రైలు పట్టాలపై ప్రమాదకర వీడియోలు

Date:11/08/2019

చిత్తూరు ముచ్చట్లు:

రైలు పట్టాలపై ప్రమాదకర వీడియోలు తిసీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వ్యక్తిని రేణిగుంట రైల్వే ఆర్. పీ ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కుక్కలగుంట పంచాయతీకి చెందిన రామ్ రెడ్డి (24) ఇంజనీరింగ్ పూర్తి చేసి యూట్యూబ్లో వచ్చే షేర్లు, లైకులు ఆధారంగా డబ్బు సంపాదించవచ్చు అని భావించి ప్రమాదకరమైన వీడియోలు చిత్రీకరించే ఆలోచన చేశాడు. ఏర్పేడు వ్యాసాశ్రమం రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి రైలు తో తొక్కించడం, రైలు దగ్గరకు వచ్చేవరకు ఉండి ద్విచక్ర వాహనంపై తప్పించుకోవడం వంటి ప్రమాదకరమైన వీడియోలు చిత్రీకరించాడు. నెలరోజులుగా ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తుండడంతో హైదరాబాద్ కు చెందిన నరసింహస్వామి అనే యువకుడు ట్విట్టర్ ద్వారా రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు రేణిగుంట రైల్వే ఐ పి ఎఫ్ హీరా సింగ్ కేసు నమోదు చేసి శనివారం రామిరెడ్డిని అరెస్టు చేసి నెల్లూరు రైల్వే కోర్టుకు తరలించారు.

నాలుగు రాష్ట్రలు జల విలయం

Tags: Dangerous videos on train rails