ప్రతి నీటిబొట్టును వృధా చేయరాదు

– కమిషనర్‌ వర్మ

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ప్రతి వర్షపు నీటిని వృధా కానీవ్వకుండ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, భూగర్భజలాలను పెంపొందించుకోవాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. ఆదివారం ఆయన మున్సిపాలిటి, పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఇంటి యజమానులకు ఇంకుడు గుంతలు ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా సూచనల మేరకు మున్సిపాలిటిలో ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలో ఇంకుడు గుంతల ఏర్పాటును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. వర్షపునీటిని వృధాకానీవ్వకుండ ఎక్కడ నీరు అక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా మంచినీటి బోర్లు ఉన్న ప్రాంతాల్లో గల నీటిని బోర్ల వద్దకు తరలించి, అక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పట్టణంలోని గృహ యజమానులందరు తప్పకుండ ఇంటి వద్ద ఒకొక్క మొక్కను నాటుకోవాలని నిబంధన పెట్టామన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కకు వారి కుటుంబ సభ్యుల పేర్లు ఏర్పాటు చేసుకునేలా చేసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులను సంరక్షించుకునే రీతీలో మొక్కలను కూడ పెంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ కాలుష్యాని నివారించేందుకు వీలుంటుందన్నారు. ఇప్పటికే పట్టణంలో 70 శాతం వెహోక్కలు నాటి సంరక్షించడం జరుగుతోందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగ తిన పూర్తి చేసి గ్రీనరీ అవార్డును సాధించుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, కార్మికులు పాల్గొన్నారు.

19న స్పందన

Tags: Not every waterproof should be wasted