క్రీడలతో మానసిక ఉల్లాసం

Date:15/07/2019

ఒంగోలు ముచ్చట్లు:

విద్యార్ధి దశలోనే మంచి  విజ్ఞానాన్ని,  సత్పృవర్తనను, గుండెధైర్యాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ విద్యార్ధులకు సూచించారు. సోమవారం ఉదయం స్ధానిక జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన 30వ ప్రాంతీయ బాడ్మింటన్ పోటిలు-2019 ప్రారంభోత్సవ  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో విద్యార్ధులు కీలక పాత్ర పోషించాల్సి వుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్య నభ్యసిస్తున్న విద్యార్ధులకు  నాణ్యమైన విద్య అందించాల్సి వుందన్నారు. భవిష్యత్తులో మంచి వ్యక్తిగా, నాయకుడిగా ఎదగడానికి  విజ్ఞానం, మంచి నడవడిక, సాహసగుణం  అనే మూడు లక్షణాల ఎంతో అవసరమని అన్నారు.

 

 

 

 

ఈ మూడు లక్షణాలు విద్యాలయాలో పొందాలని సూచించారు. సమాజంలో గౌరవప్రదంగా, సంతోషదాయకంగా జీవించడానికి  ఈ మూడు లక్షణాలు కావాలన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో మంచి నాణ్యమైన విద్యతోపాటు మంచి సంస్కారాన్ని సాధించుకోవాలని కలెక్టర్ విద్యార్ధులకు సూచించారు.  క్రీడా పోటిలో, సాస్కతిక కార్యక్రమాల వలన మానసిక ఉల్లాసంతోపాటు ఆరోగ్యంగా వండే అవకాశం
వుందని క్రీడాపోటీలలో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అలాగే మంచి ప్రదర్శన అందించాలని ఆయన  విద్యార్ధులకు సూచించారు.

 

 

 

జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ జయశ్రీ కార్యక్రమానికి అధ్యక్షత వహించి  మాట్లాడుతూ 30 రీజనల్ బాడ్మింటన్ మీట్-2019 పోటిలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థల విద్యార్ధులు పోటిలో పాల్గొననున్నారని వివరించారు. పోటిలో పాల్గొనే రాష్ట్రాలను 8 క్ల స్టర్లు గా చామరాజనగర్, హవేరి, కొట్టాయం, మాహె, నల్గొండ, పుదుచ్చేరి, రాయుచూరు, విజయనగరంగా 8 విభజించడం జరిగిందని ఆమె వివరించారు.

 

 

 

 

30వ రీజనల్ బాడ్మింటన్ మీట్ 2019 పోటిలు ఈ నెల 15వ తేది నెండి 17వ వ తేదీ వరకు నిర్వహించబడతాయని, గెలుపొందిన విద్యార్ధులు .ఆతీయ స్ధాయిలో పంజాబ్ లోని జలందర్ లో సెప్టెంబర్ 9 నుండి 11వ తేది వరకు నిర్వహింపబడే పోటీలలో పాల్గొననున్నారని ఆమె వివరించారు.కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, జవహర్ నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్  కె.శ్రీనివాసులు, పాండురంగారావు , విద్యాలయ ఉపాధ్యాయలు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలి

Tags: Mental exhilaration with sports