జగన్ ఎప్పుడూ మా వాడే

Date:03/06/2019

అనంతపురం ముచ్చట్లు:

జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. సుధీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగిన జేసీ.. రాష్ట్ర విభజన తర్వాత సైకిలెక్కారు. 2014లో అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన.. 2019లో మాత్రం కుమారుడికి టికెట్ తెచ్చుకున్నారు. కానీ ఫ్యాన్ స్పీడుకు పవన్ కుమార్ రెడ్డి తట్టుకోలేక ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న జేసీ.. తాజాగా జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ అంటే ఒంటి కాలుపై లేచి విమర్శలు చేసే దివాకర్ రెడ్డి.. తన విమర్శల్లో వేడిని కాస్త తగ్గించారు. సోమవారం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన జేసీ.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను జగన్‌పై రాజకీయ విమర్శలు చేశానే తప్ప.. ఎప్పుడూ ద్వేషించలేదన్నారు. ‘జగన్ మావాడే ’అంటూనే.. పార్టీ మారానుకోవడం లేదంటున్నారు. ప్రధాని మోదీ జగన్ వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. సీఎం అయినందుకు జగన్ కు అభినందనలు తెలిపారు.

 

 

 

 

 

 

గతంలో జగన్ పై రాజకీయపరమైన విమర్శలు చేశానే తప్ప ఏనాడూ ద్వేషించలేదని స్పష్టం చేశారు. అయితే జగన్ ను ఓ విషయంలో మెచ్చుకోవాలని, ప్రత్యేక హోదా అంశంలో మొదటి నుంచి ఒకే పంథాకు కట్టుబడి ఉన్నాడని, ఈ విషయంలో తొలినుంచి జగన్ నిజాయతీగా వ్యవహరిస్తున్నాడని కితాబిచ్చారు. ఢిల్లీలో మోదీతో జగన్ మాట్లాడిన విధానం చూస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాడనిపిస్తోందని అన్నారు. ఢిల్లీలో జగన్ మాట్లాడిన తీరుతెన్నులు అద్భుతమని జేసీ కొనియాడారు.ఎప్పుడూ జగన్‌పై నిప్పులు చెరిగే జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి మాత్రం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. రాజకీయ విమర్శలు చేశానే తప్ప.. ద్వేషించడం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. మరోవైపు జేసీ బ్రదర్స్ పార్టీ మారబోతున్నారంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ, బీజేపీవైపు ఈ ఇద్దరి సోదరుల కన్నుపడిందని చర్చ జరుగుతోంది. మొత్తానికి జేసీ పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు.

 

8 గంటల నుంచి ఎంపీపీ,జెడ్పీల కౌంటింగ్

Tags:Jagan has always used us