తాగునీటిపై నిర్లక్ష్యం చేయద్దు

– జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి

Date:27/05/2019

సదుం ముచ్చట్లు:

మండలంలో తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం చేయకుండ తక్షణమే చర్యలు తీసుకోవాలని జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో తాగునీటి గ్రామాలను గుర్తించి, వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు.అవసరమైన ప్రాంతాలలో బోర్లు వేయడం, పూడికలు తీయ్యడం , పైపులైన్లు వేయడం చేపట్టాలని సూచించారు. అలాగే గృహ నిర్మాణాల లబ్ధిదారులకు తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరారు. గతంలో అనర్హులకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు అవినీతి రహిత పాలనకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నాగరాజు, తహశీల్ధార్‌ రామక్రిష్ణ, ఆర్‌డబ్యూజ్లిఎస్‌డీఈఈ ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.

జనం మెచ్చిన నేత జగన్‌ …

Tags; Do not neglect drinking water