స్వాతి నాయుడు కోరిక ఏంటో తెలుసా

Date:06/08/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
యూట్యూబ్‌ ఫాలోవర్స్‌కి స్వాతినాయుడు గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు శృంగార చిత్రాల్లో నటించి.. షార్ట్ ఫిల్మ్స్‌ ద్వారా ప్రచారం పొందింది స్వాతినాయుడు. అంతేకాకుండా తెలుగులో ఫుల్ న్యూడ్‌గా నటించేందుకు తాను సిద్ధమే అని.. ఒకరు కాదు ఒకేసారి పదిమందితో సెక్స్ సీన్స్‌లో నటించడాకైనా రెడీనే అంటే అంటూ అప్పట్లో బోల్డ్ ప్రకటన చేసింది. తాజాగా ఆమె నటించిన ‘ఆమె కోరిక’ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎస్‌.ఆర్‌.మీడియా సమర్పణలో యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతినాయుడు నటించిన చిత్రం ‘ఆమెకోరిక’. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా థియేటర్స్‌లో విడుదలవుతోంది. .‘ఆలు మగ అనుబంధంలోకి అనుకోని వ్యక్తి రావడంతో ఆ సంసారం ఎలా ఛిన్నాభిన్నం అయ్యిందన్న కాన్సెప్ట్‌తో ‘ఆమెకోరిక’ చిత్రం తెరకెక్కించాం. లవ్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఇలా ఆల్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగిన చిత్రం. టైటిల్ జస్టిఫికేషన్‌ ఏంటో సినిమా చూసి తెల్సుకోవాల్సిందే. స్వాతినాయుడు నటన సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. సురేష్‌, రాజు, సిరిప్రియ, రాఘవరావ్‌ సపోర్టివ్‌ క్యారక్టర్స్‌లో అద్భుతంగా నటించారు. త్వరలో తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ చేయనున్నాం అన్నారు.