ఆర్టీసి డిపోకు వీడిన చందగ్రహణం

– మాట నిలుపుకున్న పెద్దిరెడ్డి
– ప్రారంభానికి ఏర్పాట్లు
– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోని ఆర్టీసి డిపోకు చందగ్రహణం వీడింది. ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే డిపో ప్రారంభిస్తామని హామి ఇచ్చారు. ఈ మేరకు ఆర్టీసి అధికారులు మంగళవారం డిపోను పరిశీలించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డిపోను డిప్యూటి ట్రాఫిక్‌ మేనేజర్‌ రాము, పలమనేరు మేనేజర్‌ రామక్రిష్ణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ దినేష్‌లు కలసి డిపోను పరిశీలించారు. నివేదికలు పంపగానే ఆర్‌ఎం నాగశివుడు డిపోను పరిశీలించి, చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డిపో ప్రారంభానికి సిద్దమౌతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ , ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

డిపో నిర్మాణం…

పుంగనూరు నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం సుమారు రూ. 2కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆర్టీసి డిపో సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోకుండ పోయింది. పట్టణంలో 30 సంవత్సరాలుగా ప్రజలు ఆర్టీసి బస్సు డిపో కోసం ధర్నాలు, దీక్షలు చేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ డిపో మంజూరు చేయాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని కోరారు. ఆయన తక్షణం మంజూరు చేశారు. ఈ పనులను ప్రారంభించేందుకు 2009 సెప్టెంబర్‌ 23న అప్పటి రవాణాశాఖ మంత్రి శత్రుచెర్ల విజయరామరాజు , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలసి పనులను ప్రారంభించారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆకాల మరణం తరువాత పనులు పూర్తి అయిన రాజకీయ మార్పులతో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం ఆర్టీసి డిపోను ప్రారంభించకుండ ఆపివేశారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబునాయుడు ఆర్టీసి డిపోను ప్రారంభించకుండ వ్యక్తిగత కక్షలతో పుంగనూరు అభివృద్ధిని అడ్డుకున్నారు.

నవోదయలో చైతన్య విద్యార్థుల ప్రతిభ

Tags: Cassage from the RTC Depot

పుంగనూరులో పెద్దిరెడ్డి హ్యాట్రిక్‌

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. ఆయన తొలుత 1974లో ఎస్వీ యునివర్శిటిలో విద్యార్థి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. 1978లో మాజీ రాష్ట్రపతి నీలంసంజీవరెడ్డి ప్రోత్సాహంతో పీలేరు ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ పడ్డారు. 1989లో చల్లా ప్రభాకర్‌రెడ్డిపై పోటీ పడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో జివి.శ్రీనాథరెడ్డిపై గెలుపొందారు. తిరిగి 2004లో గెలుపొందారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు డీసీసీ అధ్యక్షుడుగా పని చేశారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడుగా నియమింపబడ్డారు. 2009లో పుంగనూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో అటవీశాఖ మంత్రిగా పని చేశారు. తిరిగి 2014 ఎన్నికల్లో ఎన్నికైయ్యారు. ఈ సారి ఎన్నికల్లోను మూడవసారి ఎన్నికైయ్యారు.

 

జగన్  విజయం  వెనుక దివ్యారెడ్డి

 

Tags: Peddireddy hat trick in Punganuru

ముస్లింలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఇఫ్తార్‌ విందు

Date:19/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆదివారం రాత్రి పుంగనూరు ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందును షాదిమహాల్‌లో ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు షా, కార్యదర్శి అమ్ము్య ధ్వర్యంలో ముస్లిం పెద్దలు ఏర్పాటు చేశారు. అంజుమన్‌ షాదీమహాల్‌లో ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉబేదుల్లా కాంపౌండులో షామీర్‌, అంజాద్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో ఎమ్మెల్యే పాల్గొని , శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అంజుమన్‌ కమిటి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలోని ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ముస్లింలకు ఎలాంటి సమయంలోనైనా అండగా ఉంటామని హామి ఇచ్చారు. ముస్లింల అభివృద్ధి కోసం తన భాస్కర్‌ ట్రస్ట్ నుంచి నిధులు అందజేస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలనలో ముస్లింలకు ఆగ్రస్థానం కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు ఎంఎస్‌.సలీం, నయాజ్‌, ఆసిఫ్‌, పార్టీ నేతలు ఇప్తికార్‌, ఖాన్‌, అఫ్సర్‌, నూరుల్లా, సిద్దిక్‌, ఖాజా, ఇర్ఫాన్‌, ఆయాజ్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, నాగరాజారెడ్డి, సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, విశ్వనాథ్‌, నారపరెడ్డి, ముస్లింలు ఇంతియాజ్‌, ఎంఏఎన్‌.నూరుల్లా, కిజర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి

Tags: MLA Pendireddy Iftar dinner for Muslims

తెలుగుదేశం నేతలకు కండువాలు కప్పిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:08/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం గుట్టపల్లెకు చెందిన యాదవ కులస్తులు జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, చంద్రారెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో 70 మంది నాయకులకు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో అంజప్ప, రవి, గంగిరెడ్డి, హరి, వెంకటేష్‌, రమణ, శ్రీనివాసులు, నారాయణ, శంకరప్ప, మోహన, సురేష్‌, మల్లయ్య, క్రిష్ణప్ప, నరసింహులు, బాలక్రిష్ణ, బి.అంజప్ప, ఎం.బాస్కర్‌ తో పాటు పలువురు పార్టీలో చేరారు. అలాగే పుంగనూరు జనసేన నాయకుడు, కాపు సంఘ కార్యదర్శి నానబాలకుమార్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయనకు పార్టీ కండువ వేసి, పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ గుట్టపల్లె యాదవ నాయకులు, కాపునాయకులు పార్టీలో చేరడంతో మరింత బలోపేతం అయిందన్నారు. యాదవులు, కాపులు అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొండవీటి నాగభూషణం, విశ్వనాథ్‌, తుంగామంజునాథ్‌, దొంతివెంకటేష్‌, బావాజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

తెలుగుదేశం పార్టీ ఓటర్లకు గాలం

Tags: Peddireddy is the MLA who tied the knives to the Telugu Desam leaders

పుంగనూరు అసెంబ్లికి నామినేషన్‌ దాఖలు చేసిన పెద్దిరెడ్డి

Date:22/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు అసెంబ్లి ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , తన కుమారైతో శ్రీశక్తితో కలసి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆర్‌వో కార్యాలయంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కనకనరసారెడ్డికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పెద్దిరెడ్డిచే ప్రమాణపత్రం చదివించారు. అనంతరం ఎన్నికల నిబంధనల గూర్చి ఎన్నికల అధికారి పెద్దిరెడ్డికి వివరించి, ఈ మేరకు అభ్యర్థికి ఇవ్వాల్సిన ఆదాయవ్యయ, ఎన్నికల నిబంధనల పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

తెలుగుదేశం తరపున అనీషారెడ్డి నామినేషన్‌ దాఖలు

పుంగనూరు తెలుగుదేశం పార్టీ తరపున నూతన కాల్వ అనీషారెడ్డి తన నామినేషన్‌ పత్రాలను ఆర్‌వోకు అందజేశారు. అలాగే ఆమె భర్త శ్రీనాథరెడ్డి, మరో నామినేషన్‌ను దాఖలు చేశారు. అలాగే బిజెపి తరపున మదన్‌మోహన్‌బాబు నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటమునియాదవ్‌, వరుణ్‌తేజ్‌, బిజెపి నేతలు అయూబ్‌ఖాన్‌, రాజారెడ్డి , చిన్న తదితరులు పాల్గొన్నారు.

 

మోహన్‌బాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు

Tags; Peddireddy who filed nomination for Punganur Assembly

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:18/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ఎంబిటి రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. పార్టీ కార్యాలయాన్ని కౌన్సిలర్‌ శోభారాణి , యువజన సంఘ నాయకులు రాఘవేంద్ర, బావాజాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రచార కార్యక్రమాలకు , నేతలకు, ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, డాక్టర్‌ శరణ్‌, గురుప్రసాద్‌, కిట్టా, కిషోర్‌, వెంకటేష్‌, హరిప్రసాద్‌, నవీన్‌కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

 

పెద్దపల్లిలో రెండు నామినేషన్ల స్వీకరణ

Tags: MLA Pendireddy, who started the party office

ఎమ్మెల్యే పెద్దిరెడ్డిచే నవరత్నాల కరపత్రాలు ఇంటింటా పంపిణీ

Date:11/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల ప్రచారాన్ని పుంగనూరు పట్టణంలోని హనుమంతరాయుదిన్నెలో పార్టీ అభిమానుల మధ్య ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా పార్టీ నవరత్నాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల ప్రజలను ఆదుకుని, అభివృద్ధి చేసుకునేందుకే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ఏర్పాటు చేశారన్నారు. దీనికి బయపడిన తెలుగుదేశం పార్టీ వైఎస్సార్‌సీపీ పథకాలను కాపికొట్టి పెన్షన్ల పెంపు, నిరుద్యోగభృతి, పసుపు, కుంకుమ పంపిణీ చేసిందన్నారు. పసుపు కుంకుమ క్రింద పంపిణీ చేసిన చెక్కులు చెల్లవని , కానీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి, ఎమ్మెల్యేలుగా , ఎంపిలుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మాయమాటలకు ఎవరు లోనుకాకుండ 2014 ఎన్నికల హామిలను గుర్తు చేసుకుంటు చంద్రబాబుకు తగిన గుణపాఠం నే ర్పి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, బూత్‌ కమిటి మేనేజర్‌ అమ్ము, కౌన్సిలర్లు మంజుల, రేష్మా, నేతలు రాఘవ, రాజశేఖర్‌రెడ్డి, హరినాథరెడ్డి, అయాజ్‌, ఇర్ఫాన్‌, అస్లాంమురాధి తదితరులు పాల్గొన్నారు.

భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే…..

పుంగనూరులో మాంసం వ్యాపారుల భవనం కోసం ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత నెలలో రూ.5 లక్షలు అందజేశారు. ఆ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భవనాన్ని అన్ని వసతులతో నిర్మించుకోవాలని , ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి, మాంసం వ్యాపారులకు అనుకూలంగా భవనాలు నిర్మిస్తామన్నారు.


ఆలయంలో పూజలు…

మండలంలోని కీలకీరి గ్రామంలో ప్రారంభించనున్న శివాలయాన్ని , అక్కగార్ల ఆలయాలను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయాలలో పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మూడవ సారి మీకు సేవ చేసే బాగ్యం కల్పించండి

Tags: Introduction of leaflets by MLA Peddi Reddy

దివంగత నేతలు వైఎస్సార్‌, వేణుల విగ్రహాల ఆవిష్కరణ

Date:08/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెలో దివంగత నేతలు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వేణుగోపాల్‌రెడ్డిల విగ్రహాలను ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ వేణుగోపాల్‌రెడ్డి పార్టీ కోసం ఎనలేని సేవలు అందించారని ఆయన ఆకస్మిక మరణం పార్టీకి , పంచాయతీ ప్రజలకు తీరనిలోటన్నారు. ఆయన ఆశయాలను కాపాడుతూ అన్ని విధాల పంచాయతీని అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్‌రెడ్డి సతిమణి , మాజీ సర్పంచ్‌ వరుణకుమారి, పార్టీ నేతలు ప్రభాకర్‌రెడ్డి, జయనారాయణరెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి చేరిన దేశం నాయకులకు కండువాలు కప్పిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Tags; The late leaders of the YSR and the launch of the bronze idols