నూతన మంత్రి పెద్దిరెడ్డికి సన్మానం

Date:07/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర నూతన మంత్రిగా నియమింపబడిన డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మున్సిపల్‌ మాజీ కమిషనర్‌ కెఎల్‌.వర్మ శుక్రవారం ఘనంగా సత్కరించారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ , మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, విశ్వనాథ్‌లు కలసి మంత్రి పెద్దిరెడ్డిని నివాసంలో కలిసి శ్రీ వెంకటేశ్వరుని బొమ్మను ఇచ్చి అభినందించారు.

అనాధ శవానికి అంత్యక్రియలు

Tags: New Minister Peddireddy was honored

 

 

ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించిన పలువురు పట్టణ నేతలు

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నూతన ఎమ్మెల్యేగా మూడవ సారి ఎన్నికైన డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పట్టణంలోని కుమ్మరవీధికి చెందిన మురాధియా ట్రస్ట్ ప్రతినిధి అస్లాం, మదీన మసీదు కమిటి సభ్యులు ఖాజా, భక్షు, బాషా, బావాజి, అజ్‌గర్‌, సొన్న తిరుపతిలో కలసి సన్మానించారు. అలాగే సర్వశిక్షా అబియాన్‌ ఉద్యోగులు నారాయణస్వామి, శ్రీనివాసులు పెద్దిరెడ్డిని సన్మానించారు. అలాగే మండల కో-ఆర్డినేటర్‌ రెడ్డెప్ప ఎమ్మెల్యేను సన్మానించారు.

ఎంపికి సన్మానం…

పుంగనూరు సీనియర్‌ న్యాయవాది, చిత్తూరు ఎంపి రెడ్డెప్పను మంగళవారం ఆయన నివాస గృహంలో పలువురు సన్మానించారు. పట్టణ న్యాయవాదులు వెంకట్రమణారెడ్డి, రాజశేఖర్‌, వ్యాపారి రెడ్డెప్ప కలసి ఎంపిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపివో శ్రీనివాసులు, జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి, ఉపాధ్యాయులు వెంకట్రమణారెడ్డి, రవి, విశ్రాంత టీచర్‌ మునస్వామి, దళిత నాయకులు నాగరాజ, లక్ష్మినారాయణ తదితరులు ఎంపిని సన్మానించారు.

 

రైతు సంక్షేమానికి కృషి

Tags: Many urban leaders who honored MLA Peddireddy

వివేకానందరెడ్డి మృతి తీరని లోటు

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:15/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

మాజీ ఎంపి దివంగత వైఎస్‌.వివేకానందరెడ్డి ఆకస్మిక మరణం తీరనిలోటని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వివేకానందరెడ్డి మరణ వార్త తెలియగానే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన వివేకానందరెడ్డి మరణం పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఆర్టీసి మజ్దూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ఆర్‌విటిబాబు, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహిం, నాయకులు కిజర్‌ఖాన్‌ , మునిరాజ, నానబాల మణి తదితరులు పాల్గొన్నారు.

కమలం పార్టీ ఆశలు నెరవేరేనా…. ?

Tags: Vivekananda Reddy’s death

ఫ్యానుగుర్తుతో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:21/02/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కుమ్మరవీధిలో ముస్లిం నాయకుడు అస్లాం మురాధి ఏర్పాటు చేసిన ఫ్యాను గుర్తు జెండాను ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలో తొలిసారిగా ఫ్యాను గుర్తుతో జెండాను ఆవిష్కరించిన అస్లాంను ఎమ్మెల్యే అభినందించారు.

 

ప్రజలకు రక్షిత మంచినీటిని అందిచడమే ఆశయం

Tags; Peddireddy is the MLA who invented the flag with a fan