కేంద్ర ప్రభుత్వంతో సమానంగా కరువు భృతి చెల్లించాలి

– సంఘ అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి

Date:20/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

విశ్రాంత ఉద్యోగులందరికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కరువు భృతిని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి డిమాండు చేశారు. సోమవారం ఉద్యోగుల విశ్రాంతి భవనంలో సంఘ సమావేశాన్ని కార్యదర్శి చెంగారెడ్డి తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఈహెచ్‌ఎస్‌ సమగ్రంగా నిర్వహించి, మెడి కల్‌ రియంబర్స్మెంట్‌ సకాలంలో పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే విశ్రాంత ఉద్యోగులందరికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటితో పాటు పీఆర్‌సిని అమలు చేసేందుకు ప్రభుత్వానికి వినతిపత్రం పంపుతామన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఫారం 16 , ఆధార్‌ , పాన్‌కార్డు, బ్యాంకు పాసు బుక్కుజిరాక్స్ కాపిలను అందజేయాలన్నారు. దీని ద్వారా ఈఫైలింగ్‌ చేసి ఆదాయపు పన్ను మినహాయింపుకు తగు చర్యలు చేపడుతామన్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు ఎదురైయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలపై సంఘం తక్షణం స్పందించి, పరిష్కరించేందుకు సంఘ స్రభ్యులు కలసి చర్యలు చేపడుతామన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు దొరస్వామి, కోశాధికారి చంద్రశేఖరం తదితరులు పాల్గొన్నారు.

 

 

ఘనంగా జూనియర్  ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

 

Tags: Drought should be paid equal to the central government