రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌పై అవగాహన పెంచుకోవాలి

– జిల్లా పీడీ విద్యాశంకర్‌

Date:30/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు ప్రతి ఒక్కరు డ్రిప్‌ ఇరిగేషన్‌పై పంటలు పండించేందుకు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాశంకర్‌ కోరారు. బుధవారం మండల కార్యాలయంలో పుంగనూరు, రామసముద్రం మండలాల రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌, ఉద్యానవన పంటలపైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ విద్యాశంకర్‌ మాట్లాడుతూ రైతులు ఉన్న నీటిని వృధా కాకుండ, తొలుత పొలానికి డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకుని, తరువాత పంటలు పండించే విధానానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా రైతులకు నాణ్యమైన ఉత్పత్తితో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుందన్నారు. అలాగే ఉధ్యానవనశాఖ ద్వారా పండ్లతోటల పెంపకాలు చేపట్టాలన్నారు. రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకునేందుకు, నేరుగా సంప్రదించేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యులు తీసుకుంటున్నట్లు ఈ సమావేశంలో డాన్‌ఫౌండేషన్‌ కో-ఆర్డినేటర్‌ తులసిదేవి, జైయిన్‌ కంపెనీ మేనేజర్‌ రవికాంత్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

 

Tags: Farmers should develop awareness on drip irrigation