మార్కెట్‌ కమిటిలో పాత పద్దతిని కొనసాగించాలంటు రైతులు ధర్నా

– ఎంపి మిధున్‌రెడ్డితో ఫోన్‌లో చర్చలు
– ధర్నా విరమించిన రైతులు

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మార్కెట్‌ కమిటిలో టమోటా వ్యాపారంలో ఏజెంట్ల ద్వారానే వ్యాపారాలు కొనసాగించాలని రైతులు సోమవారం ధర్నా , రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి రైతులతో చర్చలు జరిపారు. రైతు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామి ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణ మార్కెట్‌ కమిటిలో కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై మార్కెట్‌ కమిటి అధికారులు ఏజెంట్లకు తెలియజేశారు. దీంతో రైతులు ఏజెంట్లను రద్దు చేస్తే టమోటాలు ఎవరికి అమ్మాలి..? డబ్బులు ఇచ్చేదెవ్వరు..? టమోటాలు తరలించేందుకు బాక్సులు ఇచ్చేదె వ్వరు..? ఈ వసతులను ప్రభుత్వం చేపట్టకుండ ఒక్కసారిగా ఏజెంట్లను రద్దు చేస్తే లక్షలాది రూపాయలు నష్టాలు వస్తుందని ఆందోళన చేశారు. అధికారులు వినకపోవడంతో మార్కెట్‌ కమిటి ముందు రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మాజి ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి మార్కెట్‌ కమిటి వద్దకు చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతు సమస్యలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై రైతులు ఆందోళన చెందకుండ పాత పద్దతినే కొనసాగించాలని నిర్ణయించారు.

 రాయితీ గ్యాస్ దందా 

Tags: Farmers who want to keep the old system in the market committee dharna