ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి

–  ఎస్పీ. అపూర్వ రావు

Date:20/05/2019

వనపర్తి ముచ్చట్లు:

ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చాలని ఎస్పీ అపూర్వ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఆరుగురు ఫిర్యాదుదారులు విచ్చేసి వారి ఫిర్యాదులను ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అపూర్వ రావు ఫిర్యాది దారులతో స్వయంగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు  భార్యాభర్తల ఫిర్యాదులు, రెండు భూ తగాదాలు, రెండు పరస్పర తగాదాలపై ఫిర్యాదులు లాగా వెంటనే వాటిని పరిష్కరించాలంటూ ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి సృజన పాల్గొన్నారు.

 

క్రీడలను ప్రోత్సహించాలి

 

 

Tags: Fix the complaints instantly