గ్యాంగ్ రేప్ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయాలి

Date:14/01/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్‌ బాలిక పై సామూహిక అత్యాచారం ఘటనపై హోంమంత్రి మహముద్ అలీ ఆరా తీశారు. అత్యాచారం ఘటన కేసు వివరాలను సీపీ అంజనీ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని మహముద్ అలీ ఆదేశించారు.
పాతబస్తీలోని కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లకిడికిలో 16 ఏళ్ల మైనర్ బాలికపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు బలత్కారానికి పాల్పడుతూ వీడియో తీశారు. ఈ వీడియోను ఫేస్బుక్, వాట్సప్‌ల్లో పోస్ట్ చేస్తామని బెదిరించి పలుమార్లు ఘాతుకానికి ఒడిగట్టినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలు రిపోర్టులు చూసి డాక్టర్లు నిర్ఘాంతపోయారు. నిందితులు బాలికపై 4 సంవత్సరాల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు రిపోర్టుల్లో వెల్లడైంది. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, బస్తీవాసులు ఆందోళనకు దిగారు. ఒక నిందితుడిని సాక్షిగా కేసులో పెట్టారని బాధితులు ఆరోపించారు. దాంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేసారు.
Tags:Gang rape should be investigated on the case