కాల్పులకు గుంటూరు వాసి మృతి

 Date:07/09/2018
గుంటూరు ముచ్చట్లు:
అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు  విచక్షణారహితంగా  కాల్పులు జరపడంతో నలుగురు ఆక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్‌(25)గా గుర్తించారు. ఈ ఘటన సిన్సినాటిలోని వాల్‌నట్‌ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో చోటుచేసుకుంది. మృతి చెందిన పృథ్వీరాజ్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా తెలిసింది.గ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది.
ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీ నగరంలో ఉన్న ఫిఫ్త్ థర్డ్ సెంటర్ లో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ తెలుగు యువకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫౌంటైన్ స్వ్కేర్ లోని ఫిఫ్త్ థర్డ్ సెంటర్ భవనం లాబీలో జరిగిన ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని ఒమర్ ఎన్రిక్ శాంటా(29)గా అధికారులు గుర్తించారు.
ఇతని వద్ద 200 రౌండ్లకు సరిపడా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పృథ్వీరాజ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అమెరికా అధికారులతో కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో పృథ్వీరాజ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు.
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో గుంటూరుకు చెందిన పృథ్వీరాజ్‌ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే న్యూయార్క్‌ పోలీసులను సంప్రదించామని, పృథ్వీరాజ్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.
Tags:Guntur killed by gunfire

కాల్పులకు గుంటూరు వాసి మృతి

Date:07/09/2018
గుంటూరు ముచ్చట్లు:
అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు  విచక్షణారహితంగా  కాల్పులు జరపడంతో నలుగురు ఆక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్‌(25)గా గుర్తించారు.
ఈ ఘటన సిన్సినాటిలోని వాల్‌నట్‌ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో చోటుచేసుకుంది. మృతి చెందిన పృథ్వీరాజ్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా తెలిసింది.గ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది. ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీ నగరంలో ఉన్న ఫిఫ్త్ థర్డ్ సెంటర్ లో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ఓ తెలుగు యువకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫౌంటైన్ స్వ్కేర్ లోని ఫిఫ్త్ థర్డ్ సెంటర్ భవనం లాబీలో జరిగిన ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని ఒమర్ ఎన్రిక్ శాంటా(29)గా అధికారులు గుర్తించారు. ఇతని వద్ద 200 రౌండ్లకు సరిపడా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పృథ్వీరాజ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అమెరికా అధికారులతో కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో పృథ్వీరాజ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో గుంటూరుకు చెందిన పృథ్వీరాజ్‌ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇప్పటికే న్యూయార్క్‌ పోలీసులను సంప్రదించామని, పృథ్వీరాజ్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.
Tags: Guntur killed by gunfire