16న సాయి ఆలయాలలో గురుపౌర్ణమి వేడుకలు

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడిసాయిబాబా ఆలయాలలో వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్దం చేశారు. ఈ నెల 16న మంగళవారం గురుపౌర్ణమి వేడుకలు చేయనున్నారు. మాదనపల్లెలో శ్రీ సాయిబాబా ఆలయం, కొత్తయిండ్లు సాయిబాబా ఆలయం, చెరువు కట్టపై సాయి ఆలయం, బస్టాండులో గల సాయి ఆలయంతో పాటు కట్టపై వెలసిన శ్రీ దత్తాత్రయ ఆలయంలోను, యాబై రాళ్ల వెహోరవలో గల దత్తపీఠంలోను గురుపౌర్ణమి పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఆలయాలకు రంగులు వేసి అలంకరించారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక హ్గమాలు, అభిషేకాలు నిర్వహించి, పూజలు చేసి, స్వామివారిని సుందరంగా అలంకరించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

కమిషనర్‌ కెఎల్‌.వర్మకు సన్మానం

Tags: Guru Purnima celebrations at Sai temples on 16th