మానవత్వంతో వైద్య సేవలు అందించండి : కలెక్టర్

Date:14/06/2019

పత్తికొండ ముచ్చట్లు:

మానవత్వంతో రోగులకు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వైద్యులను ఆదేశించారు.  శుక్రవారం పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యుల హాజరు పట్టికను తీసుకుని వైద్యులు, సిబ్బంది హాజరు అయ్యారా లేదా అని పేరు పేరున పిలిచి హాజరు అయ్యినట్టు రూడి చేసుకున్నారు.  ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరుగుతూ తనిఖీ చేశారు.  రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.  మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని , అంబులెన్స్ అందుబాటులో లేదని పలువురు ఫిర్యాదు చేశారు.  రోగికి మెరుగైన చికిత్స అందించడానికి కర్నూలుకు పంపించేందుకు అంబులెన్స్ సిద్ధం చేయాలని వైద్యులను ఆదేశించారు.  మరుగుదొడ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏడుగురు వైద్యులున్నారు.  రోగులకు మెరుగైన వైద్యం అందించక పోతే ఎలా అని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో సమస్యలు విన్నానని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.

 

 

 

 

త్వరలో వైద్యులతో , అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.  మరో సారి ఆకస్మికంగా ఈ ఆసుపత్రిని తనిఖీ చేస్తామన్నారు.  అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ( సెంట్రల్)  లో పంచాయతీ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేయబోయే పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామమూర్తి, తహసీల్దార్, డివిజనల్ పంచాయతీ అధికారి, వైద్యులు, నర్సులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

కొత్తయిండ్లు హైస్కూల్‌లో అడ్మీషన్ల జోరు

Tags: Provide medical services with humanity: Collector