సోదరబావంతో జీవించాలి

Date:26/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజాస్వామ్యదేశంలో ప్రతి ఒక్కరు కులమతాలకతీతంగా సోదరబావంతో జీవించాలని పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ఫయాజ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన స్వేచ్చ, రక్షణ, న్యాయం అనే నినాదంతో భయంలేకుండ జీవించండి అనే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అందరు కలసి మెలసి జీవిస్తుంటే కొంత మంది అరాచక శక్తులు సోదర బావాలను దెబ్బతీస్తూ , సమానత్వం లేకుండ చేస్తున్నారని ఇలాంటి వాటిని మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక ప్రతినిధులు అబ్ధుల్‌రజాక్‌, అల్లాభక్షు, అతిక్‌బాషా, యుసఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాయస్థానాలలో తెలుగుబాషను అమలు చేయాలి

Tags: Live with brotherhood

హరీష్ రావు పరిస్థితి ఏమిటిప్పుడు

Date:20/07/2019

కొడంగల్ ముచ్చట్లు:

కొడంగల్ ప్రజల రుణం  ఏమిచ్చినా తీర్చుకోలేనని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అయన మొదటిసారి ఎంపిగా కొడంగల్ లో పర్యటించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే  పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టిందoట. అలాంటి పరిస్థితి హరీష్ రావ్ కు వచ్చిందని వ్యాఖ్యానించారు. మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన తరువాత  మొదటిసారిగా  కొడంగల్ నియోగజక వర్గం కోస్గిలో జరిగిన అభినందన సభకు ఎంపీ రేవంత్ రెడ్డి హాజరవుతున్నందుకు అనందంగా వుందన్నారు.అనంతరం శివాజీ చౌరస్తాలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగించారు.

 

 

 

 

కొడంగల్ నియోజకవర్గoలో  10 ఏళ్ళలో నేను చేసిన అభివృద్ధి తప్ప, తెరాస  ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదని ఒకవేళ చేసినట్టు నిరూపిస్తే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో నన్ను ఓడగొట్టడానికి కేసీఆర్ హరీష్ రావు ని పంపిస్తే. అదే హరీష్ రావు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.

 

 

 

ఇప్పుడు ఎంపీ గా గెలిచిన నాకు ..కొడంగల్ ప్రజల నాడీ పార్లమెంట్ లో వినిపించే అవకాశం వచ్చిందని అన్నారు. కొడంగల్ ప్రజలకు అనునిత్యం అండగా ఉంటానని మిమ్ములని కాపాడుకునే బాధ్యత  నాదని అన్నారు. రానున్న మున్సిపాల్టీ ఎలక్షన్లో  కొడంగల్ మొత్తం కాంగ్రెస్  జండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

పెన్షన్ దారులకు ప్రోసెడింగ్ ల పంపిణి

 

Tags: When is Harish Rao’s situation

ఆర్‌డబ్యూజ్లిఎస్‌ డీఈఈగా వెంకటేశ్వర్లు

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్‌డబ్యూజ్లిఎస్‌ డివిజన్‌ డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా వెంకటేశ్వర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శనివారం జారీ చేసింది. ఈ మేరకు ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలంలో మంచినీటి సమస్య లేకుండ ఉండేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సమస్యపై ప్రజలు తమకు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని కోరారు.

వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Tags: Venkateshwaras as ArdabujlS DIE

13న జాతీయ మెగాలోక్‌ అదాలత్‌

Date:02/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కోర్టు ఆవరణంలో ఈనెల 13న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయవాదుల సంఘ కార్యదర్శి కెవి.ఆనందకుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ సూచనల మేరకు జాతీయ మెగాలోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు , కక్షిదారులు సహకరించాలన్నారు. అలాగే సివిల్‌, క్రిమినల్‌కు సంబంధించిన అన్ని రకాల కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

3న డ్రిప్‌ సేధ్యంపై సదస్సు

Tags: National Megalok Adalat on 13th

బీజేపీ డీఎన్ఏలోనే జాతీయవాదం ఉంది: రామ్ మాధవ్

Date:08/06/2019

అగర్తలా ముచ్చట్లు:

బీజేపీ డీఎన్ఏలోనే జాతీయవాదం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. జాతీయవాదమే బీజేపీకి

గుర్తింపని తెలిపారు. బీజేపీ అంటేనే జాతీయవాదం. జాతీయవాదమంటేనే బీజేపీ అని రామ్ మాధవ్ వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించిందన్న ఆయన..

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 2022నాటికి భారతదేశం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు.నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు దేశంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు నిర్మించి

ఇచ్చే విధంగా మోదీ నాయక్వంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. 2047నాటికి భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ గా సుధీర్ కుమార్

Tags:BJP is in National DNA in DNA: Ram Madhav

9న బ్రాహ్మణుల ఉపనయనాలు

Date:08/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆదిశంకరచార్యుల జయంతిని పురస్కరించుకుని గురువారం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత ఉపనయనాలు నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రాహ్మణ వటువులకు ఉచిత యజ్ఞపవీతదారణ కార్యక్రమాలు ఉదయం వెంకట్రమణస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ యువకులకు గాయిత్రిమంత్రోపదేశము, పూజా కార్యక్రమాల నిర్వహణ విధివిధానాలపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపనయనాలు చేసుకునే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా హాజరై, శంకర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నాలని ఆయన , కార్యదర్శి కోదండం కోరారు.

 

ఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి

 

Tags: Brahmins are the nine

  త్వరలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

 Date:07/05/2019
హైదరాబాద్ ముచ్చట్లు :
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఓటింగ్‌ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీకాలం జులై5తో ముగుస్తుందన్నారు. ఎలాంటి కోర్టు కేసులు లేని స్థానాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని చెప్పారు. త్వరలో మిగతా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుందన్నారు. సభ్యులపై కోర్టు కేసులు ఉన్నా ఓటింగ్‌కు అర్హులేనని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. మే 31న పోలింగ్‌ జరుగుతుందని, మే14 లోపు నామినేషన్లు దాఖలు చేయాలని, జూన్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. కాగా రంగారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినందున తమ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్‌ ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళీధర్‌ రావు గతంలోనే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
Tags:Telangana state election commissioner Rajat Kumar

అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం: తలసాని వార్నింగ్

Date:26/04/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గాంధీ భవన్ లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు కర్రు కాల్చి వాతపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, కేసీఆర్ పై విశ్వాసంపై ఉంది కనుకే తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం గురించి తలసాని ప్రస్తావిస్తూ, నిరాడంబరంగా నిర్వహిస్తామని, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని అన్నారు.
Tags:Speak aloud: