కమల్ నాధ్ కేసులు తవ్వుతున్నారు

Date:10/09/2019

భోపాల్ ముచ్చట్లు:

ఓ వైపు బీజేపీ తమ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే అదేం లేదు అంటూ బీజేపీ కొట్టి పడేస్తుంది. మరోవైపు మాత్రం కాంగ్రెస్ నాయకులపైన మాత్రం ఎప్పటివో కేసులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. బ్యాంకు కుంభకోణం కేసులో అల్లుడు రతుల్  పురిని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు 24ఏళ్ల నాటి కేసులో సీఎం కమల్ నాథ్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.

 

 

 

1984 లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో కమల్ నాథ్ పేరును కేసులో పెట్టగా ఆ కేసును త్వరలో తిరిగి తెరిచేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు అమిత్ షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరిని అరెస్టు చేసిన కొద్ది రోజులకే కేంద్ర హోంశాఖ నిర్ణయం రావడం విశేషం.

 

 

 

 

గత నెలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంను కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కమల్ నాథ్ కేసును తిరగతోడుతున్నారు.అయితే మరోవైపు సీఎం కమల్ నాథ్ ఢిల్లీ అల్లర్లలో తన పాత్రను ఖండించారు. కమల్ నాథ్ ఢిల్లీ నాయకులు జగదీష్ టైట్లర్ మరియు సజ్జన్ కుమార్లతో కలిసి 1984లో అల్లర్లకు జనాన్ని ప్రేరేపించారనినే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఢిల్లీలోని రాకాబ్‌గంజ్ గురుద్వారా దగ్గర కమల్ నాథ్ ఒక గ్రూపుకు నాయకత్వం వహించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

 

జోగు రామన్న మిస్సింగ్

Tags: Kamal Nath is digging cases

వైసీపీలో కనిపించని ఫైర్ బ్రాండ్లు

Date:31/08/2019

విజయవాడ ముచ్చట్లు:

ప్రభుత్వంలో ఉన్న నాయ‌కులు త‌మ‌పై విమ‌ర్శలు వ‌స్తే.. వెంట‌నే స్పందించి కౌంట‌ర్లు ఇవ్వడం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వ‌ర‌కు కూడా జ‌రిగేదే. త‌మ‌పై వ‌చ్చే విమ‌ర్శల‌ను ఎప్పటిక‌ప్పుడు తిప్పి కొడుతూ ముందుకు సాగుతుండ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏపీలో మాత్రం వైసీపీ నేత‌లు ప్రభుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్రతిప‌క్షాలు స‌హా ప్రజ‌ల నుంచి ఎదుర‌వుతున్న విమ‌ర్శల హోరును లెక్కచేయ‌డం లేదు.

 

 

 

ఐదేళ్లపాటు ఏం జ‌రిగినా.. త‌మ‌కు ఏమ‌వుతుంద‌నే భ‌రోసానా? లేక ఆయా విమ‌ర్శల్లో ప‌స‌లేద‌ని ప‌ట్టించుకోవ‌డం లేదా? అనేది చ‌ర్చనీయాంశంగా మారింది.నిజానికి ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి ఎక్కువ మంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. మాస్ ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ‌డంలో దిట్టలు కూడా వైసీపీకి సొంతం. అలాంటి వారు ఇప్పుడు ప్రతిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శల‌పై నోరు మెద‌ప‌డం లేదు. ముఖ్యంగా మంత్రులుగా ఉన్నవారిలో చంద్రబాబుపై నిత్యం విమ‌ర్శలు సంధించి, మీడియాలో సంచ‌ల‌నం సృష్టించిన కొడాలి నాని కూడా మౌనంగానే ఉండి పోవ‌డం ఆశ్చర్యానికి దారితీస్తోంది. పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌ర్లు, అమ‌రావ‌తి ప్రాజెక్టు, అన్న క్యాంటీన్లు స‌హా అనేక విష‌యాల‌పై విమ‌ర్శలు చేస్తున్నారు టీడీపీ నాయ‌కులు.

 

 

 

 

అయితే, వీరికి స‌రైనకౌంట‌ర్ ఇచ్చేందుకు, ప్రతిప‌క్షాల‌కు ముకుతాడు వేసేందుకు ఒక్క‌రంటే ఒక్కరు కూడా సాహ‌సించ‌డం లేదు.ఇక‌, బొత్స, మంత్రి అనిల్ కుమార్ వంటివారు కూడా ఫైర్ బ్రాండ్లే అయినా.. వారు ఏం మాట్లాడితే.. ఏ వివాదం తెర‌మీద‌కి వ‌స్తుందోన‌నే భ‌యం కూడా పార్టీని వెంటాడుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వ‌ర్గానికి చెందిన మేక‌తోటి సుచ‌చిత‌, పుష్ప శ్రీవాణి వంటి వారు కూడా విధాన ప‌ర‌మైన విష‌యాల‌పైనా మాట్లాడక పోవ‌డం దేనికి సంతేక‌మ‌నే సందేహం వ్యక్తం అవుతోంది.

 

 

 

 

 

జ‌గ‌న్ అమెరికా ప‌ర్యట‌న‌లో దాదాపు ప‌ది రోజులు ఉన్నారు. ఆ స‌మ‌యంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్యటించిన చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా కూడా ప్రభుత్వంపై విమ‌ర్శలు సంధించారు.మ‌రి వీరికి స‌రైన కౌంట‌ర్ ఇచ్చే సామ‌ర్ధ్యం ఉన్న రోజా వంటి వారు కూడా మౌనంగా ఉండ‌డంతో ప్రభుత్వ ప‌నుల్లో వీరు బిజీగా ఉన్నార‌ని అనుకోవాలా? లేక‌.. ప‌స‌లేని విమ‌ర్శల‌పై స్పందించి ప్రతిప‌క్షానికి ప్రాధాన్యం పెంచ‌డం ఎందుకులే! అనుకున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రోజులు గ‌డిస్తేనే త‌ప్ప వీటికి స‌మాధానం ల‌భించ‌దు.

హాట్ టాపిక్ మారిన జీవీఎల్

Tags: Fire brands not found on YCP

మట్టి వినాయకుడికి భారీ విగ్రహాలు

Date:17/08/2019

హైద్రాబాద్  ముచ్చట్లు:

వినాయకచవితి  అనగానే   ప్లాస్టర్  ఆఫ్  పారిస్ తో తయారు  చేసిన  పెద్ద పెద్ద  వినాయకులే  గుర్తుకొస్తాయి. అయితే ఈసారి మాత్రం మట్టి గణపతులకే డిమాండ్ ఉందంటున్నారు తయారీదారులు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం మట్టివినాయకుల కోసం చాలామంది అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. దీంతో విగ్రహాల తయారీలో తాము బిజీ అయ్యమని ఇందుకు నాణ్యమైన మట్టిని తెప్పించామని చెప్పారు.మట్టి వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి… చెరువులకు కూడా మేలు జరుగనుందని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఒకప్పుడు  మట్టి వినాయకులనే పూజించేవారమని.. వినాయక విగ్రహాన్ని తయారు చేసే మట్టిలో దినుసులను వేసే వారమని అవి చెరువులోని చేపలకు ఉపయోగపడేవని గుర్తుచేసుకున్నారు.

 

 

 

నిమజ్జనానికి భారీ ఏర్పాట్లుగ్రేటర్ పరిధిలో జరిగే గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని వివిధ శాఖల అధికారులకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సూచించారు. సెప్టెంబర్ 12న గణేశ్‌ నిమజ్జనం ఉంటుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గతం కన్నా అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ గణేశ్‌ శోభాయాత్ర జరిగే మార్గాలన్నింటిని ముందుగానే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు.

 

 

 

పకడ్బందీ పారిశుద్ధ్య నిర్వహణకు గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌, జాతీయ రహదారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు తమ పరిధిలోని రహదారులను మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈసారి 32 ప్రాంతాల్లో 894 క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. వీటితో పాటు స్టాటిక్ క్రేన్‌లు, మొబైల్ క్రేన్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏర్పాట్లపై జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు.

 

 

 

 

జలమండలి ఆధ్వర్యంలో 32 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయడంతో పాటు పలు మార్గాల్లో ప్రత్యేక వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నిమజ్జనం రోజున మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ రైళ్లను అదనంగా నడపాలని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లిలలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని కోరనున్నట్టు పేర్కొన్నారు.

 

 

 

 

హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి 56 క్రేన్‌లు ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. గతేడాది 122 మొబైల్ పోలీసు బృందాలు ఉండగా ఈ సారి 236కు పెంచినట్టు తెలిపారు. శోభాయాత్ర  మార్గాల్లో చెట్ల కొమ్మలు తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని కోరారు.

వెంకటేశ్వరుని అవతారంలో శనేశ్వరస్వామి

 

Tags : Huge statues of clay Ganesha

సోరంగ మార్గం మారిపోయిందోచ్

Date:09/08/2019

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ, చిట్టినగర్ నుండి హైదరాబాద్ జాతీయరహదారిని కలిపే మార్గంలో ఉన్న సొరంగం ఇది. నగర శివారు ప్రాంతాలైన భవానీపురం, విద్యాధరపురం, కబేళా పరిసర ప్రాంత వాసులు అతి తక్కువ సమయంలో నగరంలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం సొరంగం. అయితే మనకు తెలిసిన సొరంగం వేరు, ఇప్పుడు వేరు. విజయవాడ మొత్తాన్ని పరిశుభ్రంగా తాయారు చేస్తున్న చంద్రబాబు, సొరంగ మార్గాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సొరంగం మొత్తం, లోపల భాగంలో అందమైన రంగులతో నింపారు. కళంకారీ పెయింటింగ్స్ వేస్తున్నారు. పనులు చాలా వరకు అయిపోయాయి. ఇంకా కొంత మేర పెయింటింగ్స్ వెయ్యాల్సి ఉంది.

 

 

 

కేఎల్‌ రావు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సొరంగ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 60వ దశకంలో నిర్మాణమైన ఈ సొరంగ మార్గం, అప్పట్లో విజయవాడకు బెజవాడ అనే పేరు రావడానికి ఈ సొరంగమే కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ సొరంగం పూర్తయ్యే నాటికి విజయవాడలో అక్షరాస్యుల శాతం చాలా తక్కువని, గ్రామీణుల రాకపోకలు ఎక్కువగా ఉండేవని చెబుతారు. దీంతో గ్రామీణులు అప్పట్లో ఈ సొరంగాన్ని బెజ్జంగా వ్యవహరించేవారు. బెజ్జం ఉన్న ఊరు కాబట్టి విజయవాడ కాస్తా, బెజ్జంవాడగా, కాలక్రమంలో బెజవాడగా విజయవాడ బాగా ప్రసిద్ధి చెందిందనేది వారి వాదన.స్వచ్ఛ భారత్‌లో బెజవాడ బెస్ట్‌ సిటీగా నిలిచింది అంటే కారణం,

 

 

 

 

ఇలా సిటీ మొత్తం అందంగా తీర్చిదిద్దితేనే. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొత్తం 4 వేల నగరాలు పోటీపడ్డాయి. వీటిని అధిగమించి మరీ విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం నగరంలో దాదాపు పదిహేను రోజులపాటు విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. డంపింగ్‌ యార్డులో ఏర్పాటు చేసిన బయోమైనింగ్‌ ప్రాజెక్టు, వీవీడీ అనే ప్రైవేటు సంస్థ ద్వారా చేపట్టిన భవన నిర్మాణాల వ్యర్థాలతో టైల్స్‌ తయారీ సంస్థ ఏర్పాటు వంటి వాటితో పాటు నగరంలో పారిశుధ్యం దిశగా చేపట్టిన చెత్త సేకరణ, కమర్షియల్‌ ప్రాంతాల్లో చెత్త సేకరణకు తీసుకున్న చర్యలు, డంపింగ్‌ యార్డు నిర్వహణ, స్మార్ట్‌ డంపర్‌ బిన్లు, చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ వాహనాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

 

 

 

 

నగరంలోని చెత్తసేకరించే అన్ని ప్రాంతాలను పర్యవేక్షించేందుకు వినూత్నంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు రహదారుల పక్కన చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తరలించడం, తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించడం, ప్రజా మరుగుదొడ్లను ఆధునికీకరించడం, నగరంలోని పాఠశాలల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛకార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం, కాలువల పక్కన సుందరీకరణ, ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయడం వంటివి చర్యలు చేపట్టారు.మరోవైపు నగరంలోని కూడళ్లన్నింటినీ అందంగా మారుస్తూ ఫౌంటేన్లు, గ్రీనరీని పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.

 

 

 

 

 

రహదారులకు ఇరువైపులా ఉన్న గోడలన్నింటినీ అందమైన చిత్రాలతో అలంకరించారు. వాణిజ్య సముదాయాల వద్ద తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు. నిత్యం సేకరించే తడి చెత్తనున ఎరువుగా మార్చేందుకు నగరంలోని రైతుబజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద 11 ప్రాంతాల్లో కంపోస్టుయార్డులను ఏర్పాటు చేశారు. ఆటోనగర్‌, విద్యాధరపురం ప్రాంతాల్లో రెండు పెద్ద కంపోస్టు యార్డులను నెలకొల్పారు. నగరంలో 550 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తుండగా.. దీనిలో 200 మెట్రిక్‌ టన్నుల తడి చెత్త ఉంటోంది. ఈ చెత్త మొత్తం ప్రస్తుతం కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు.

 

ఎంపీలు… చక్రం తిప్పుతాన్నారే…

Tags: The tunnel has changed

సురేష్ రెడ్డి, మండవ ఫ్యూచరేంటీ

Date:08/08/2019

నిజామాబాద్ ముచ్చట్లు:

పార్టీ మారితే, ఫేట్‌ మారుతుందనుకున్నారు. కండువా మార్చితే పదవి ఖాయమని ఫిక్సయ్యారు. హామీలు కూడా ఆ రేంజ్‌లో వచ్చాయని సంబరపడ్డారు. రోజులు, నెలలు గడుస్తున్నాయి. ఆ శుభ గడియ మాత్రం, గడప తొక్కలేదు. ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామి నెరవేరకపోవడానికి, కారణం ఏమై ఉంటుందా అని బుర్రకు పని చెప్పారు. ఒకరి ఓటమి, తమకు పదవులు రాకుండా అడ్డు పడుతోందని తెలిసి, తెగ ఫీలయిపోతున్నారట. ఓడిపోయినవారిని తిరిగి సెటిల్ చేసే వరకూ, వీరికి పదవులు రానేరావని అందరూ మాట్లాడుకుంటున్నారట. అదే వారిద్దరిలోనూ కొత్త గుబులుకు కారణమవుతోంది.

 

 

 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేకమంది సీనియర్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారినా రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదన్న ధీమాతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి టిఆర్ఎస్‌లో చేరారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఎన్నికల ముందు టిఆర్ఎస్ అధినేత సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.  పార్లమెంట్ ఎన్నికల ముందు నిజామాబాద్‌ రాజకీయాల్లో మంచి పట్టున్న నేతగా పేరున్న మండవ వెంకటేశ్వరరావును, స్వయంగా ఆయనింటికి వెళ్లి చర్చించి పార్టీలో చేర్చుకున్నారు .

 

 

 

కేసీఆర్. రానున్న రోజుల్లో మండవకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని భరోసా కల్పించి పార్టీలోకి తీసుకున్నారు. అయితే అటు సురేష్ రెడ్డి, ఇటు మండవ వెంకటేశ్వరరావుల పరిస్థితి, అగమ్యగోచరంగా మారింది. సురేష్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి ఛైర్మన్‌ లేదా రాజ్యసభ ఇచ్చి పెద్దల సభకు పంపిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు, ఆ ఉలుకే లేదు. తనకు ఎలాంటి పదవి ఇస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో కూడా సురేష్‌ రెడ్డికి అర్థంకావడం లేదట. దీంతో ఎదురుచూపులే మిగిలాయి సురేష్‌ రెడ్డికి.

 

 

 

తెలంగాణలో వరుసగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో సురేష్ రెడ్డికి ఏదో ఒకటి ఇస్తారని అంతా భావించారు. కానీ ఈమధ్య ప్రకటించిన ఎమ్మెల్సీల్లో కూడా సురేష్ రెడ్డి పేరు లేకపోవడంతో, కక్కలేక మింగలేక ఉన్నారు సురేష్‌ రెడ్డి. మండవ సేవలు టిఆర్‌ఎస్‌ పార్టీకి అవసరమని, ఆయనకు కీలక పదవి కట్టబెట్టబోతున్నట్టు అప్పట్లో తెలంగాణ భవన్‌ వర్గాలు చెప్పాయి. కానీ ఇప్పటివరకు అసలు పార్టీలో మండవ పొజిషన్ ఏంటో కూడా ఎవరికీ అర్థం అవ్వడం లేదు. అయితే ఎంపీ ఎన్నికల ఫలితాల తరువాత పదవులు పక్కా అనుకున్న నేతలకు, కవిత ఓటమితో బ్రేకులు పడ్డాయంటున్నారు.

 

 

 

గులాబీ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓడిపోయి ఎలాంటి పదవి లేకుండా ఉన్న సమయంలో, ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు పదవులు ఇస్తే బాగుండదన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. కవిత భవిష్యత్తుపై ఒక క్లారిటీ వస్తే గాని ఈ ఇద్దరు నాయకుల ఫ్యూచర్‌పై క్లారిటీ వచ్చేలా లేదని నిజామాబాద్ టిఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది

 

ఆనందంలో కౌలు రైతులు

Tags: Suresh Reddy, Mandawa Futuranti

స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ,జనసేన వ్యూహాలు

Date:31/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం ఏదో ఊపు మీద దక్కిందన్న విమర్శ ఉంది. టీడీపీ అయితే ఈవీఎంల సహాయం అంటూ లేని పోని అనుమానాలు పెంచుతూ పోయింది. అయితే ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా ప్రీ పోల్ సర్వేల నుంచి ఏ దశలోనూ వైసీపీ వెనక్కి తగ్గలేదు. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించింది. మరో వైపు టీడీపీ అప్పటికే బాగా వెనకబడిపోయింది. జగన్ కి ఓ చాన్స్ ఇద్దామన్న వారి గొంతు పెరిగి పెద్దదై అది సునామీగా మారేసరికి టీడీపీ అడ్రెస్ గల్లంతు అయింది. మరి ఆ సునామీ లాంటి జనాభిమానాన్ని వైసీపీ నిలబెట్టుకుందా లేదా అన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుంది.

 

 

 

జగన్ విషయానికి వస్తే ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరుకు జనం నూటికి నూరు మార్కులు వేశారు. మరి ముఖ్యమంత్రిగా ఆయన తొలి అడుగులు, విధానాలు ఎలా ఉన్నాయన్న దాని మీద జనం తీర్పు ఇచ్చేది కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే. అందువల్ల స్థానిక ఎన్నికలు ఇపుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఇక పార్టీ పుట్టినది లగాయితు ఇంతటి ఘోరమైన అవమానం టీడీపీకి జరగలేదు. చంద్రబాబుకు ఓటమి కొత్తకాదు, కానీ వైసీపీ చేతిలో ఈ రకమైన దారుణ పరాజయం మాత్రం కచ్చితంగా కొత్తే. అందుకే ఆయన తేరుకోలేకపోతున్నారు అయినా రాజకీయాల్లో పండిపోయిన అనుభవం ఉంది కాబట్టి తనదైన చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. టీడీపీ చూపు ఇపుడు స్థానిక ఎన్నికల పైనే ఉంది.

 

 

 

అక్కడ నుంచి నరుక్కు రావాలని ఆ పార్టీ డిసైడ్ అయిపోయింది. అందుకే జగన్ ఇలా సీఎం గా ప్రమాణం చేయగానే అలా విమర్శలతో దాడి చేయడం మొదలెట్టింది. హామీలను జగన్ తుంగలోకి తొక్కుతున్నాడన్న ఆరోపణలన్నీ స్థానికి సమరంలో వాడుకునే ఆయుధాలే. స్థానిక ఎన్నికల్లో టీడీపీ కోలుకుంటే పార్టీ పటిష్టంగా ఉన్నట్లుగా సందేశం ఇటు తమ్ముళ్ళకు, అటు జనాలకు కూడా వెళ్తుంది. అది 2024 ఎన్నికల్లో గెలవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల స్థానిక ఎన్నికలు టీడీపీకి పెను సవాల్ లాంటివి.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేని సంప్రదాయాన్ని అనుసరించి దెబ్బతిన్నారు. ఆయన పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతు రాజకీయాలతో 2014 టైమ్ లో గడిపేశారు.

 

 

 

 

నిజానికి తొలి సారి పార్టీ పెట్టిన తరువాత జనంలో వచ్చే అతి పెద్ద ప్రభావాన్ని తనకు తానుగా పవన్ కోల్పోయాడు. ఆ విధంగా అయన తన తప్పు లేకపోయినా టీడీపీ, బీజేపీ విధానలను వ్యతిరేకించేవారికి టార్గెట్ అయ్యాడు. ఇక 2019 నాటికి విడిగా పోటీకి దిగుతూ పెద్దగా బలం లేని వామపక్షాలను, అసలు ఏపీలో ఉనికి లేని బీఎస్పీని కలుపుకుని వెళ్ళడం ద్వారా మరో తప్పు చేశాడు. దాంతో ఆయన పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఇపుడు పవన్ అసలైన దారిలోకి వచ్చాడు.

 

 

 

ఏదైనా ఒంటరిగా, సొంతంగా తేల్చుకోవాలనుకుంటున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అసలు బలమేంటో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవచ్చునన్నది పవన్ ఆలోచనగా ఉంది. మొత్తానికి ఏపీలో ప్రధాన పార్టీలైన జనసేన. టీడీపీలకు స్థానిక ఎన్నికలు చాలా కీలకమైనవి. అతి ముఖ్యమైనవి. ఇక ప్రజలకు కూడా ఈ ఎన్నికలు ఆసక్తిని కలిగించనున్నాయి.

జమిలీ పై టీడీపీ ఆశలు

Tags: TDP and Jana Sena strategies on local bodies elections

రాజకీయ వైరాగ్యంతో మధుయాష్కీ

Date:30/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్రత్యేక స్థానం సంపాయించుకున్న నాయ‌కుడు మ‌ధుయాష్కీ గౌడ్‌. వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ముఖ్యంగా కేంద్రంలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నేరుగా సంబంధ బాంధ‌వ్యాలు నెరిపే యాక్సెస్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందిన నాయ‌కుడు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న రాజ‌కీయ వైరాగ్యంతో నిలువునా ఒణికి పోతున్నారు. త‌న‌కు ఇక‌, రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్ దాదాపు లేన‌ట్టేన‌ని త‌న అనుచ‌రుల‌తో చెప్పుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అసలు మ‌ధు యాష్కీ గౌడ్ రాజ‌కీయాలు ఏంటి? ఎందుకిలా మారాయి? అనే విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది.విష‌యంలోకి వెళ్తే..

 

 

కాంగ్రెస్ కోట‌రీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు మ‌ధు యాష్కీ. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ఆయ‌న‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం పెరుగుతున్న ద‌శ‌లో దానిని అణిచి వేసేందుకు వైఎస్ కొంద‌రు నాయ‌కుల‌ను వినియోగించుకుని కేసీఆర్ స‌హా కొంద‌రు తెలంగాణ వాదుల‌పైనా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ‌స‌రంలేద‌నే విష‌యంపైనా విమ‌ర్శలు చేయించారు. ఇలాంటి వారిలో మ‌ధుయాష్కీ ఒక‌రు వైఎస్ చెప్పిన‌ట్టు మ‌ధుయాష్కీ న‌డుచుకున్నారు.

 

 

 

 

ఈ క్రమంలోనే ఆయ‌న‌కు కేంద్రంలోని కాంగ్రెస్ నేత‌ల‌తోనూ ప‌రిచ‌యం ఏర్పడింది.2004, 2009 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో మ‌ధుయాష్కీ విజ‌యం సాధించారు. వ‌రుస విజ‌యాల‌తో మ‌ధుయాష్కీ జోరెత్తి పోయారు. చాలా మంది మ‌ధుయాష్కీ సిఫార్సుల‌తో ప‌ద‌వులు పొందిన వారు కూడా ఉన్నారు. అయితే, రాజ‌కీయాల్లో ఓడ‌లు ఎప్పుడు బ‌ళ్లవుతాయో.. బ‌ళ్లు ఎప్పుడు ఓడ‌ల‌వుతాయో చెప్పడం క‌ష్టం. అదేవిధంగా మ‌ధుయాష్కీ రాజ‌కీయాలు కూడా తెలంగాణ ఏర్పాటుతో త‌ల్లకిందుల‌య్యాయి.

 

 

 

కొన్నాళ్ల పాటు తెలంగాణ‌ను వ్యతిరేకించిన ఆయ‌న స్వయంగా తెలంగాణ వాదిగా ముద్ర వేయించుకునేందుకు చాలా కాలం ప‌ట్టింది. అయిన‌ప్పటికీ.. 2014 ఎన్నిక‌ల్లో మ‌ధుయాష్కీ నిజామాబాద్‌లో ఘోరంగా ఓడిపోయారు. కేసీఆర్ కుమార్తె క‌విత‌పై దాదాపు ల‌క్షా అర‌వై వేల ఓట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది.ఇక‌, ఆ త‌ర్వాత మ‌ధుయాష్కీ నిజామాబాద్ మొహం కూడా చూసింది లేదు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ధుయాష్కీని తిరిగి నిజామాబాద్ నుంచి పోటీ చేయాల‌ని చెప్పినా.. ఆయ‌న సుముఖత వ్యక్తం చేయ‌లేదు.

 

 

 

న‌ల్లగొండ జిల్లా భువ‌న‌గిరి నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, కోమ‌టిరెడ్డి కార‌ణంగా మ‌ధుయాష్కీ దానికి దూర‌మై.. త‌ప్పని ప‌రిస్థితిలో నిజామాబాద్ నుంచే పోటీ చేయాల్సి వ‌చ్చింది. అయితే, ఈ ద‌ఫా మ‌ధుయాష్కీకి మ‌రింత చేదు అనుభ‌వం ఎదురైంది. సిట్టింగ్ ఎంపీ క‌విత ఓడిపోయింది. అదేస‌మ‌యంలో ఇక్కడ నుంచి ప్రయోగాత్మకంగా పోటీ చేసిన బీజేపీ విజ‌యం సాధించింది. ఇక‌, క‌విత‌కు వ్యతిరేకంగా ప‌సుపు రైతులు పోటీ చేయ‌గా వారంతా 98 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకోగా.. యాష్కీ కేవ‌లం 60 వేల ఓట్లతో స‌రిపెట్టుకుని చివ‌ర‌కు డిపాజిట్ కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యం మ‌ధుయాష్కీకి త‌ల‌నొప్పిగా మారింది.

 

 

 

 

 

రాహుల్ వ‌ర్గంగాపేరు తెచ్చుకున్న ఆయ‌న .. ఇప్పుడు పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాహులే రాజీనామా చేయ‌డంతో ఫ్యూచ‌ర్ పై విర‌క్తి ఏర్పడింది. ఇక‌, రాజ‌కీయంగా త‌న‌కు ఫ్యూచ‌ర్ లేద‌ని మ‌ధుయాష్కీ భావిస్తున్నారు. ఇక‌, నిజామాబాద్‌లో బీజేపీ పుంజుకోవ‌డం మ‌రింత అశ‌నిపాతంగా మారింది. వాస్తవానికి మ‌ధుయాష్కీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని ఓ వ‌ర్గమే.. నిజామాబాద్‌లో బీజేపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించింద‌నే వ్యాఖ్యలు వినిపించాయి. ఏదేమైనా మ‌ధుయాష్కీ ఫ్యూచ‌ర్ ప్రశ్నార్థకంగా మారింది. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.

ఆసక్తికరంగా మారుతున్న సైకిల్ కమలం పోరు

Tags: Madhuyashki with political rivalry

పురందరేశ్వరీకి రాజ్యసభ పదవి

Date:23/07/2019

విజయవాడ ముచ్చట్లు:

పురంద్రీశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా సుపరిచతులు. మంచి వాగ్దాటితో ఆకట్టుకునే పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో పూర్తి యాక్టివ్ గా కన్పిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పురంద్రీశ్వరి మరింతగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పురంద్రీశ్వరిని పట్టించుకోవడం లేదా? ఆమెకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం లేదా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.అయితే అందుతున్న సమాచారం ప్రకారం పురంద్రీశ్వరికి రాజ్యసభ పదవి ఇచ్చే ఆలోచనలో అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

ఈ మేరకు ఆమెకు అమిత్ షా నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. పురంద్రీశ్వరి భారతీయ మహిళా మోర్చా జాతీయ నేతగా పార్టీకోసం కొన్నేళ్లుగా సేవలందిస్తూ వస్తున్నారు. 2014 లో మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడే పురంద్రీశ్వరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం భావించింది. లోక్ సభ ఎన్నికలకు ఏడాది ముందే ఈ ఆలోచన రావడంతో అధినాయకత్వం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. అనుకున్నట్లుగానే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పురంద్రీశ్వరికి విశాఖపట్నం పార్లమెంటు టిక్కెట్ ఇచ్చింది. కానీ పురంద్రీశ్వరి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ పై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ నుంచి జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటికే ఉన్నారు.

 

 

 

ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఇక త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈదఫా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం
నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో పురంద్రీశ్వరి పేరు ఖరారయినట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అందుకే పురంద్రీశ్వరి ఈ మధ్య కాలంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద చిన్నమ్మకు పదవి దక్కాలన్న ఆమె అభిమానుల కోరిక త్వరలో నెరవేరే అవకాశం.

 

అక్రమ క్వారీలపై విజిలెన్స్ విచారణ

Tags: Rajya Sabha post for Purandeswari