మట్టి వినాయకుడికి భారీ విగ్రహాలు

Date:17/08/2019

హైద్రాబాద్  ముచ్చట్లు:

వినాయకచవితి  అనగానే   ప్లాస్టర్  ఆఫ్  పారిస్ తో తయారు  చేసిన  పెద్ద పెద్ద  వినాయకులే  గుర్తుకొస్తాయి. అయితే ఈసారి మాత్రం మట్టి గణపతులకే డిమాండ్ ఉందంటున్నారు తయారీదారులు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం మట్టివినాయకుల కోసం చాలామంది అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. దీంతో విగ్రహాల తయారీలో తాము బిజీ అయ్యమని ఇందుకు నాణ్యమైన మట్టిని తెప్పించామని చెప్పారు.మట్టి వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి… చెరువులకు కూడా మేలు జరుగనుందని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఒకప్పుడు  మట్టి వినాయకులనే పూజించేవారమని.. వినాయక విగ్రహాన్ని తయారు చేసే మట్టిలో దినుసులను వేసే వారమని అవి చెరువులోని చేపలకు ఉపయోగపడేవని గుర్తుచేసుకున్నారు.

 

 

 

నిమజ్జనానికి భారీ ఏర్పాట్లుగ్రేటర్ పరిధిలో జరిగే గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని వివిధ శాఖల అధికారులకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సూచించారు. సెప్టెంబర్ 12న గణేశ్‌ నిమజ్జనం ఉంటుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గతం కన్నా అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ గణేశ్‌ శోభాయాత్ర జరిగే మార్గాలన్నింటిని ముందుగానే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు.

 

 

 

పకడ్బందీ పారిశుద్ధ్య నిర్వహణకు గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌, జాతీయ రహదారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు తమ పరిధిలోని రహదారులను మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈసారి 32 ప్రాంతాల్లో 894 క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. వీటితో పాటు స్టాటిక్ క్రేన్‌లు, మొబైల్ క్రేన్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏర్పాట్లపై జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు.

 

 

 

 

జలమండలి ఆధ్వర్యంలో 32 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయడంతో పాటు పలు మార్గాల్లో ప్రత్యేక వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నిమజ్జనం రోజున మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ రైళ్లను అదనంగా నడపాలని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లిలలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని కోరనున్నట్టు పేర్కొన్నారు.

 

 

 

 

హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి 56 క్రేన్‌లు ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. గతేడాది 122 మొబైల్ పోలీసు బృందాలు ఉండగా ఈ సారి 236కు పెంచినట్టు తెలిపారు. శోభాయాత్ర  మార్గాల్లో చెట్ల కొమ్మలు తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని కోరారు.

వెంకటేశ్వరుని అవతారంలో శనేశ్వరస్వామి

 

Tags : Huge statues of clay Ganesha