ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

– కమిషనర్‌ వర్మ హెచ్చరిక

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల ఆరోగ్యానికి , పర్యావరణానికి భంగం కలిగించి ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయించినా, వినియోగించినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. శనివారం పట్టణంలో పండ్ల , పూల వ్యాపారులు , హ్గటళ్లలో ఆయన దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్గటళ్లలో ఇడ్లీలు తయారు చేసేందుకు ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పూల వ్యాపారులు ఎక్కువుగా కవర్లు వినియోగిస్తున్నారని ఫిర్యాదులు అందుతోందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పట్టణంలోని అన్ని వర్గాల వారికి ముందుగా సమాచారం అందించడం జరిగిందన్నారు. కానీ కొంత మంది వ్యాపారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశాల మేరక వి చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా ప్రకటించారని తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. లేకపోతే విక్రయదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అలాగే దుకాణాలకు, హ్గటళ్లకు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పట్టణంలో పలు షాపులకు జరిమానాలు విధించారు. ఈ దాడుల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

దళిత మైనర్‌ బాలికపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Tags: If we sell plastic goods, we will file criminal cases