తెలంగాణలోకి ఏపీ మద్యం వ్యాపారులు

Date:19/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఏపీలో జగన్ ప్రభుత్వం మద్య నిషేధానికి అనుగుణంగా అడుగులు వేస్తూ బెల్టు షాపులపై కొరడా విధించడంతో ఇక అక్కడి మద్యం షాపుల కాంట్రాక్టర్లు తెలంగాణపై దృష్టి సారించారు. ఇక్కడ అలాంటి

నియంత్రణ ఏదీ లేకపోవడం వారికి వరంగా మారింది. దీంతో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో తమ వ్యాపారాన్ని సాగించేందుకు

నడుం కడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో మద్యం షాపుల ప్రారంభానికి దరఖాస్తుదారులు లక్ష రూపాయల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఏపీ
‘ గాలి ‘ తెలంగాణాలో వీచనుండడంతో.. ఇక్కడి ప్రభుత్వం ఈ అప్లికేషన్ ఫీజును ఏకంగా రెట్టింపు.. అంటే రెండు లక్షలు చేసినట్టు సమాచారం . ఇప్పటికే లక్ష రూపాయల రుసుముతో ఖజానాకు

300 కోట్లకు పైగా లాభం చేకూరినట్టు చెబుతున్నారు. సాధారణంగా అక్టోబరు నుంచి తెలంగాణాలో కొత్త ఎక్సయిజు పాలసీ ప్రారంభమవుతుంది. అందువల్ల మరో రెండు నెలల్లోగా ఏపీ కాంట్రాక్టర్లు,

ఇక్కడ తమ ‘ మద్యం వాపారాన్ని ‘ విస్తరించేందుకు పావులు కదుపుతున్నారని, రెండు లక్షలు కాదు.. మూడు లక్షల ఫీజయినా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని తెలిసింది. దీంతో-

అటు- తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరగడానికి వీలుంటుంది గనుక ఇక్కడి సర్కార్ ‘ పచ్ఛ జెండా ‘ ఊపినట్టే లెక్క

సంక్షేమ హాస్టల్స్  కు 3000 సీసీ కెమెరాలు

Tags: AP liquor dealers into Telangana

ఏపీలోనూ..ముందస్తు అభ్యర్థుల ఖరారు

Date:21/12/2018
విజయవాడ ముచ్చట్లు:
తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. ఊహించని రీతిలో ముందస్తు ఎన్నికలకు తరలేపి విజయకేతనం ఎగురవేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. తనకు సాటిలేదని నిరూపించారు. అయితే ఏపీ లో చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే. ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి పనుల పట్ల ఆనందంగా ఉన్నారు ఏపీ ప్రజలు. దీంతో బాబు కూడా కేసీఆర్ వలె ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో బాబు మాట్లాడిన తీరు చూస్తుంటే.. ఇది నిజమేనేమో అనిపిస్తోంది.చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు హింట్స్ ఇచ్చారు. ఈ మేరకు తాజా రాజకీయ పరిణామాలపై పలు సూచనలు చేశారు. సంక్రాంతికి ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
డిసెంబర్ చివరి వారంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతామంటూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాబు.. గెలుపు ఏకపక్షం కావాలని, విమర్శించినోళ్ల నోరు మూయించాలని చెప్పుకొచ్చారు. జగన్ కు ఇప్పుడు ఓవైసీ దోస్త్ అయ్యారన్న బాబు.. మోడీ కనుసన్నలలో జగన్, ఒవైసీ ఇద్దరూ నడుచుకుంటున్నారని విమర్శించారు.ఈ 5 ఏళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని చెప్పిన చంద్రబాబు.. పార్టీ అభ్యర్థుల్ని కూడా ముందుగానే ప్రకటించి ఎన్నికలకు వెళ్తామని అన్నారు.
ప్రతి కార్యకర్త ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలని, పార్టీలో గ్రూపులు కట్టకుండా పనిచేస్తే అందరికీ సముచిత స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. మోడీ పాలన పై విరుచుకు పడుతూ ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తుక్కుతుక్కుగా ఓడిపోయిందని గుర్తు చేశారు. ఇది చూస్తేనే బీజీపీ పై ప్రజా వ్యతిరేకత ఎంతఉందనేది తెలుస్తుందని చెప్పారు. ఇక ఈయన చెప్పిందంతా గ్రహించిన రాజకీయ విశ్లేషకులు.. కేసీఆర్ తరహాలోనే బాబు కూడా పక్కా వ్యూహం రచించి ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!
Tags:In AP, final candidates are finalized

ఏపీలోనూ..మహాకూటమి ఫార్ములా

Date:03/12/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలోనూ కంటిన్యూ కానుందా ? వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటు తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ప్రాధమిక ఒప్పందానికి వచ్చాయా ? ఏపీలో టీడీపీతో కలిసి కాంగ్రెస్‌ పని చేస్తే ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతుంది ? ఏపీలో పొత్తు అవసరం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా ?
లాంటి అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యనున్నారు. టీడీపీ, కాంగ్రెస్ మధ్య‌ ఏపీలో పొత్తు కుదిరితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, సీనియర్ల‌కు పొత్తులో భాగంగా పోటీ చేసే ఛాన్స్‌ ఉంటుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అంటే ఏపీ పీసీసీ అధ్యక్షడు రఘువీరా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ నాయకుల సమావేశంలో ఈ అంశాన్ని చూచాయగా వెల్లడించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశంలో రఘువీరా వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది… పార్టీ బలంగా ఉన్న చోట నాలాంటి సీనియర్లకే అవకాశాలు వస్తాయి. మిగిలిన వారు సీట్లపై ఆశలు వదులుకోవల్సిందే… అయితే రాష్ట్రంలో పార్టీ బ‌తకాలంటే త్యాగాలు చెయ్యాల్సిందే అని తన ఉద్ధేశాన్ని నేరుగానే చెప్పినట్టు తెలుస్తోంది.ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న 36 నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో రఘువీరా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల ఓడిపోయేకంటే బలమైన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీ ముఖ్య నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసి కొన్ని చోట్ల అయినా గెలుపొందడమే మంచిదని ఆయన చెప్పినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడి పార్టీనే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించగా నామినేటెడ్‌ పోస్టులతో న్యాయం చేస్తామని… పార్టీని బ‌తికించేందుకు ఆ మాత్రం త్యాగాలు తప్పవని రఘువీరా వారికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ఏపీటో ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కీలక నేతలు సైతం ఇప్పుడు తమ రాజకీయ అవసరాలు కోసం వైసీపీ, టీడీపీలో చేరిపోయారు. మరి కొందరు చేరేందుకు సిద్ధం అవుతున్నారు.పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉంటే పార్టీనే నమ్ముకుని ఉన్న కీలక నేతలకు అయినా ఛాన్స్‌ ఉంటుందన్నది తెలిసిందే.
కొంత మంది నేతలు మాత్రం ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్‌ ఉందన్న విషయాన్నే జనాలు మర్చిపోతున్నారని, ఇలాంటి టైమ్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటన చేసినందున‌ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే పార్టీకి కలిసిరావడంతో పాటు ఏపీలో కాంగ్రెస్‌ తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారట.
తెలంగాణలో ఇప్పటికే ఈ రెండు పార్టీలు క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నాయి. భ‌విష్యత్తులో ఇటు ఏపీలోనూ ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయి అన్నదానికి బలమైన సంకేతాలు కూడా వచ్చేసాయి. ఇటు రఘువీరా సైతం ముందుగానే తమ పార్టీ కేడర్‌కు ఇదే అంశంపై సూచన చెయ్యడాన్ని కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు దాదాపు ఖ‌రారు అయినట్టే అని తెలుస్తోంది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునే ముందు మరో రెండు మూడు సార్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఏపీ కాంగ్రెస్‌లో ఉన్న ముఖ్య నేతలను, నియోజకవర్గాల కో ఆర్డినేటర్ల‌ను కలిసి వారి అభిప్రాయాలు కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ఈ లిస్ట్‌లో రెండు నుంచి మూడు ఎంపీ సీట్లతో పాటు పది వరకు అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్‌కు ఇచ్చే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే చంద్రబాబు గత ఎన్నికల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి నరసాపురం, విశాఖపట్నం, రాజంపేట, తిరుపతి లోక్‌సభ సీట్లతో పాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే బీజేపీ కేవలం 2 ఎంపీ సీట్లతో పాటు 4 అసెంబ్లీ సీట్లలో మాత్రమే విజయం సాధించింది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా గత ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చినన్ని సీట్లు ఇవ్వకపోయినా 2 నుంచి 3 ఎంపీ సీట్లు, 10 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వొచ్చని తెలుస్తోంది.పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి కర్నూలు జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కర్నూలు ఎంపీగానూ, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ కర్నూలు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగానూ పోటీ చేసే ఛాన్స్‌ ఉంది. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాధ్‌ పోటీ చెయ్యవచ్చని అంటున్నారు.
అలాగే మరో మాజీ కేంద్ర మంత్రి పన‌బాక లక్ష్మి బాపట్ల నుంచి పోటీ చేసే ఛాన్స్‌ ఉంది. గుంటూరు తూర్పు నుంచి మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌వ‌లీ పేరు రేసులో వినిపిస్తోంది. అలాగే విశాఖపట్నం నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌ పేరు సైతం లైన్‌లో ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి అసెంబ్లీ సీటు ఇవ్వవచ్చని సమాచారం.
ఈ అంచనాలు లెక్కలు ఎలా ఉన్నా మరి చంద్రబాబు ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటారు, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్నది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.
Tags; In AP, the mahakutamy formula