పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించండి

Date:14/06/2019

మహబూబాబాద్ ముచ్చట్లు:

మహబూబాబాద్ మండలం లక్ష్మీ పురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ బానోత్ మౌనిక ను పాఠశాల హెచ్ఎం బద్రు, ఉపాధ్యాయ బృందం, యువజన సంఘాలు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తుందని, సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులుతమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేలా కృషి చేయాలన్నారు.

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

Tags: Include children in government schools