దేశంలో నిరుద్యోగం పెరిగింది

Date:11/05/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నివర్గాలను, అసమ్మతి గొంతుకలను గౌరవిస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలు, అసమ్మతి వ్యక్తం చేసే గొంతుకలను అణచివేయబోమని స్పష్టం చేశారు. ఓ లైన్ లో నిలబడ్డ చివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలని గాంధీజీ చెప్పేవారనీ, దాన్ని తాము పాటిస్తామని రాహుల్ అన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాహుల్ ఈ మేరకు స్పందించారు.దేశంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సభ్యులకు వ్యతిరేకంగా హింస చెలరేగినా, అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాము విద్వేష భావజాలం, సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే పోరాడుతున్నామనీ, వ్యక్తులకు వ్యతిరేకంగా కాదని తేల్చిచెప్పారు. భారత్ ప్రేమతో కూడుకున్న దేశమనీ, ప్రేమ కారణంగానే దేశం పురోగమించగలిగిందని వ్యాఖ్యానించారు.
ధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తోందని మండిపడ్డారు. చైనా ప్రతి రోజు 50వేల కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంటే… మోదీ మాత్రం ప్రతి రోజు 24వేల ఉద్యోగాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకునే మోదీ… ఉద్యోగాలను మాత్రం కల్పించలేకపోతున్నారని అన్నారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని చెప్పారు. పంజాబ్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
Tags: Unemployment in the country has increased