హిందుత్వ అజెండాతో జగన్, కేసీఆర్

-బీజేపీకి  బ్యాలెన్స్ చేసే పనిలో సీఎంలు

 

Date:28/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా పీఠాలకూ, స్వాములకూ విలువ పెరిగిపోతోంది. ఇది మోడీ ఎఫెక్ట్ గా భావిస్తున్నారు. ఉత్తరాదిని జయించిన మోడీ, షా ద్వయం చూపు ఇపుడు దక్షిణాది మీద పడింది. దక్షిణాదిలో కర్నాటక తప్ప ఎక్కడా బీజేపీ విస్తరించలేకపోయింది. కేరళ, తమిళనాడు ఇప్పట్లో కొరుకుడుపడేలా లేవు కానీ, తెలంగాణాలో ఆంధ్ర ప్రదేశ్ లలో బలం పుంజుకునేందుకు కమలానికి దారులు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఎంట్రీకి తెలంగాణాను గేట్ వేగా చేసుకోవాలనుకుంటోంది.కమలం పువ్వుకు ముల్లుతోనే చెక్ పెట్టాలని తెలంగాణా సీం కేసీయార్ నిర్ణయించారు. హిందుత్వ కార్డు తో తెలంగాణాలో పాతుకుపోవాలని చూస్తున్న బీజేపీకి అదే హిందూత్వ కార్డుతో ఝ‌లక్ ఇవ్వాలన్నది కేసీయార్ ప్లాన్. అందుకే విశాఖ శారదాపీఠం స్వామీజీ ఆసరాను ఆయన తీసుకుంటున్నారు. స్వామితో సాన్నిహిత్యాన్ని రాజకీయంగా వాడుకోవడం ద్వారా హిందువుల మనసు గెలుచుకోవాలని, మెజారిటీ ఓట్లను గంపగుత్తగా పట్టేయాలని ఆలొచన చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం కేసీయార్ ప్రయోగాలు చేయడంతో హిందువులు బీజేపీ వైపు మళ్ళారు. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఇపుడు ఇటు వైపు దువ్వుడు కార్యక్రమాన్ని కేసీయార్ మొదలుపెట్టారు. మజ్లిస్ పార్టీతో దోస్తీ తగ్గించి స్వాములతో పీఠాలతో కేసీయార్ గడుపుతున్నారు.ఇక ఏపీ సీఎం జగన్ విషయంలో బీజేపీ సులువుగా హిందుత్వ కార్డ్ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయన్నది తెలిసిందే.

 

 

 

 

 

 

 

 

క్రిస్టియన్ మతాన్ని నమ్మే జగన్ కి వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడం బీజేపీకి సులువైన పని. అయితే జగన్ కూడా రాటుతేలిన రాజకీయమే చేస్తున్నారు. తనకు మొదటి నుంచి ఉన్న ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంక్ ని కాపాడుకుంటూనే కొత్తగా బీసీలను దగ్గరకు తీస్తున్నారు. దాంతో పాటుగా అగ్ర కులాల మద్దతు కోసం స్వాములను, గుళ్ళను ఆయన కూడా నమ్ముకున్నారు. కేసీయార్ బాటలోనే జగన్ సైతం శారదాపీఠం స్వరూపానందేంద్ర ఆశీస్సులు కోరుకుంటున్నారు. తద్వారా హిందువుల మనసు గెలుచుకోవాలని. బీజేపీని నిలువరించాలని జగన్ తాపత్రయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

పొలం పనుల్లో రైతన్నలు

Tags: Jagan, KCR with Hindutva agenda

కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదు: రోజా

Date:11/06/2019

అమరావతి  ముచ్చట్లు:

ఎమ్మెల్యే రోజాను అమరావతి రావాలంటూ ముఖ్యమంత్రి జగన్ కబురు పంపారని వస్తున్న వార్తలపై రోజా స్పందించారు. ఆ వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తనను ఎవరూ అమరావతికి రావాలని పిలవలేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు. విజయవాడకు వచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అమరావతికి వచ్చానని స్పష్టం చేశారు. మంత్రి పదవి దక్కలేదని తనకు ఏమాత్రం బాధలేదన్నారు. కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు తాను అలిగానని వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తాను కులాలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికి రోజా శుభాకాంక్షలు తెలిపారు.

పీట‌ముడి వీడ‌ని ఆర్టీసీ ఆస్తులు!

Tags: He did not come to power because of the Caste Equation: Roza

అక్టోబరు 15 నుంచి రైతు భరోసా

Date:06/06/2019

విజయవాడ ముచ్చట్లు:

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూసుకెళుతున్నారు. తాజగా

రైతులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు జగన్. గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష చేసిన జగన్.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీల్లో

రైతులకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటున్నారు. రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే రైతులకు కనీస

మద్దతు ధర అందేలా.. చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెట్టడంతో పాటూ రైతులకు నష్టం కలగకుండా ఈ నిధి

ద్వారా ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రద్దు చేశారు. అలాగే నకిలీ విత్తనాల వ్యవహారంపై సీఎం

జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తన వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని.. అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు వెనకాడొద్దని అధికారులకు సూచించారు. విత్తన చట్టం తెచ్చే అంశంపై

అధికారులతో చర్చించిన జగన్.. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ చేయడంతో పాటూ.. వ్యవసాయం, రైతులకు

మేలు చేసే విధంగా మంచి సలహాలు ఇచ్చే అధికారులు, సిబ్బందికి సన్మానం చేస్తామన్నారు. రైతులకు బీమా సౌకర్యంపైనా అధికారులతో చర్చించారు.
నకిలీ విత్తన సంస్థలపై చర్యలు
ఆంధ్రప్రదేశ్ లో రైతులను నిండా ముంచేస్తున్న నకిలీ విత్తనాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని

అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు వ్యవసాయం, దాని అనుబంధ అంశాలపై సమీక్ష నిర్వహించారునకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై

కఠినంగా వ్యవహరించాలనీ, అవసరమైతే జైలుకు పంపేందుకు కూడా వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్తగా విత్తన చట్టం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

అవసరమైతే ఈ విషయమై శాసనసభలో చర్చించి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు.గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పంపిణీ జరగాలని అన్నారు.

ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచి సలహాలు, సూచనలు ఇచ్చే సిబ్బందికి సన్మానం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రైతులకు బీమా సౌకర్యాన్ని

సక్రమంగా అందించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ బీమాకు సంబంధించి ప్రీమియంను కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు

 

సభాపతిపై కాంగ్రెస్ ఫైర్ – అసెంబ్లీలో నల్లరిబ్బన్స్ తో ఆందోళన

Tags:From October 15, the farmer gets assured

కేబినెట్ లో 15.. 25

-ఎవరికి వారే ధీమా… తెరపైకి కొత్త కొత్త పేర్లు

 

Date:03/06/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ సీఎంగా ప్ర‌మాణం చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వ‌లోనే త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని అభ్య‌ర్థుల సంఖ్య‌ను బ‌ట్టి.. 28 మంది వ‌ర‌కు మంత్రుల‌ను ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు 25 నుంచి 27 వ‌ర‌కు కూడా మంత్రుల‌ను నియ‌మించుకుని పాల‌న అందించారు. అయితే, ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఆయ‌న రాక‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుమార్పులు వ‌స్తాయ‌ని, రాష్ట్ర బ‌విష్య‌త్తు మారుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ కోణంలోనే జ‌గ‌న్ కూడా త‌న అడుగులు చాలా జాగ్ర‌త్త‌గా వేస్తున్నారు.కాస్ట్ క‌టింగ్‌లో భాగంగా తాను తీసుకునే వేత‌నాన్ని త‌గ్గించుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మయం లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలకు వ్య‌యాన్ని త‌గ్గించుకునేందుకు జ‌గ‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇదిలా వుంటే, రాష్ట్రంలో అవినీతిపై యుద్ధం ప్ర‌క‌టించారు. నేరుగా సీఎం కార్యాల‌యంలోనే కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తు న్నారు. దీంతో రాష్ట్రంలో అవినీతిని పెద్ద ఎత్తున అరిక‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇక‌, తాజాగా ఆయ‌న మంత్రి వ‌ర్గంపైనా దృష్టి పెట్టారు. ముందుగా చిన్న కేబినెట్‌తోనే పాల‌న సాగించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో మొత్తంగా 15 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

 

 

 

 

ప్ర‌స్తుతం ఈ క్ర‌తువుపైనే జ‌గ‌న్ దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. గ‌డిచిన తొమ్మిదేళ్లుగా వైసీపీకి అండ‌గా ఉంటున్న వారితో పాటు..తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌పై న‌మ్మ‌కంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు కూడా పెద్ద ఎత్తున పోటీ చేసి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరిలో జ‌గ‌న్‌కు ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఇలా అన్ని వ‌ర్గాల వారూ ఉన్నారు. దీనికితోడు.. త‌న క‌ష్ట‌న‌ష్టాలు పంచుకుని, త‌నతోపాటు పార్టీని న‌డిపించిన అనేక మంది ఉన్నారు. మ‌రి వీరంద‌రికీ ఈ కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తారా? కేవ‌లం 15 మందితోనే అంటే.. సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకున్నా.. పార్టీ ప‌రంగా చూసుకున్నా.. అంద‌రికీ న్యాయం చేయ‌డం క‌ష్ట‌మ‌నే అంటున్నారు.ఇక‌, ఇప్ప‌టికే జ‌గ‌న్ మాట ఇచ్చిన వారిలో ఇద్ద‌రు క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రూ కూడా గుంటూరు జిల్లా వారే. ఒక‌రు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, రెండు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి. ఒక‌రు క‌మ్మ‌, మ‌రొక‌రు రెడ్డి. ఇక బాలినేనికి ఇప్ప‌టికే హామీ ఇచ్చేశాడు. ఇక‌, ఈ క్యూలో క‌నిపిస్తున్న మ‌రోపేరు రోజా. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందుగానే ఆమె పేరు మంత్రి వ‌ర్గంలో ఉంద‌నే ప్ర‌చారం సాగింది. అసెంబ్లీలో ఏడాది పాటు స‌స్పెండ్ అయినా.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించారు. ఇలా చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కూడా ఉన్నారు ఈ ఇద్ద‌రూ ఒకే జిల్లాకు చెందిన వారు.

 

 

 

 

 

మ‌రి ఎవ‌రికి ద‌క్కుతుంది? అనే ఆస‌క్తిగా మారింది. ఇక‌, మైనార్టీ కోటా, ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీ వ‌ర్గాల నుంచి కూడా కేబినెట్లో చోటు త‌ప్ప‌కుండా కేటాయించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.ఇక‌, సీనియ‌ర్లుగా ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌, త‌మ్మినేని సీతారాం, కొలుసు పార్థ‌సార‌ధి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేక‌తోటి సుచ‌రిత‌, పిన్నెల్లిరామ‌కృష్ణారెడ్డి .. ఇలా అనేక మంది ఎదురు చూస్తున్నారు.మ‌రి ఎవ‌రికి సీటు ద‌క్కుతుందో చూడాలి. అయితే, కేబినెట్‌లో మాత్రం క‌చ్చితంగా ఐదుగురు సీనియర్లు కాగా, మిగిలిన వారు కొత్తవారు ఉండే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తం 13 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారని కూడా అంటున్నారు. ఈ స‌స్పెన్స్ వీడేందుకు కొంత‌కాలం వేచి చూడాల్సిందే.

 

రాజస్థాన్ ను పుట్టముంచిన సీనియర్లు

 

Tags: 15 in the cabinet

జిల్లాల పెంపునకు కొత్త అడ్డంకులు

Date:03/06/2019

ఏలూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన జగన్ వరుసగా తాను ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన అమలు పర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది జిల్లాల పెరుగుదల. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాల సంఖ్యను పెంచుతానని మాట ఇచ్చారు. తెలంగాణలో అక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలను పెంచారు. తాను కూడా జిల్లాలను పెంచితే పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందని జగన్ అనేక సభల్లో చెప్పారు.ఈ మేరకు ఆయన కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలున్నాయి. వీటిని 25కు పెంచాలన్నది జగన్ ఆలోచన. జిల్లాల పెంపుపై అధ్యయనాన్ని ఇప్పటికే ఒక అధికారికి జగన్ అప్పగించినట్లు చెబుతున్నారు. జగన్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని పాదయాత్రలో మాట ఇచ్చారు. అయితే ఇందుకు సాంకేతికంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రాలను జిల్లాలను చేస్తే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలు మారే అవకాశముంది. ప్రకాశం జిల్లా తీసుకుంటే నెల్లూరు, బాపట్ల, పార్లమెంటు పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

 

అలాగే రాజంపేట పార్లమెంటు పరిధిలో కడప, చిత్తూరుజిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన నియోజకవర్గాలున్నాయి. అయితే ఇది సాంకేతికంగా సాధ్యం కాదని అధికారులు జగన్ కు స్పష్టం చేసినట్లుచెబుతున్నారు. ఇలా చేస్తే రెవెన్యూ రికార్డుల మొత్తాన్ని ఒక జిల్లా నుంచిమరొక జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. దీంతో దీనిపై అధ్యయనం చేసే బాధ్యతను జగన్ ఒక అధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది. భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుచేసే ప్రతిపాదన కూడా జగన్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబునాయుడు రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలనుకుని వెనక్కు తగ్గారు. ఇందుకు కారణాలుకూడా లేకపోలేదు. కొత్త రాష్ట్రం కావడంతో తగినంతమంది అధికారులు, సిబ్బంది లేరు. ఐఏఎస్, ఐపీఎస్ ల కొరత ఉంది. జిల్లాల సంఖ్య పెరిగితే అందుకు సరిపోయిన సంఖ్యలో అధికారులు లేరు. దీనిని అధిగమించేందుకు జగన్ తొలుత కసరత్తులు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద జిల్లాల సంఖ్యను కొద్దిరోజుల్లోనే జగన్ ప్రభుత్వం పెంచే అవకాశముందన్నది సచివాలయం వర్గాల టాక్.

జగన్ మరీ ముందుచూపు

Tags:New barriers to hike in districts

జూన్ 7 కేబినెట్ విస్తరణ

Date:30/05/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయబోతున్న జగన్.. మంత్రివర్గ విస్తరణపైనా ఫోకస్ పెట్టారు. మంత్రుల జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్న జగన్.. జూన్ 7న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు కాగానే.. శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జూన్ 11, 12 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట. శాసనసభ నిర్వహణపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. అసెంబ్లీ అధికారులతో చర్చించినంట్లు తెలుస్తోంది. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా.. శాసనసభ కార్యాలయానికి సమాచారం అందినట్లు సమాచారం. ఈ సెషన్స్‌లో కేవలం స్పీకర్ ఎన్నిక, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందట.. జూన్‌ నెలాఖరులో బడ్జెట్‌
సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక జగన్ పూర్తిస్థాయిలో పాలనపై దృష్టిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో సీఎం కార్యాలయం సిద్ధం చేస్తున్నారట. ఈ ఏర్పాట్లను వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జూన్ 3 నుంచి ముఖ్యమంత్రి హోదాలో జగన్ శాఖలవారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నారట.

 

జగన్ కు ముందుంది… ముసళ్ల పండుగ

Tags: June 7 Cabinet expansion

ప్రధాని ప్రమాణానికి నరసింహన్ , జగన్, కేసీఆర్, 

Date:28/05/2019

అమరావతి ముచ్చట్లు:

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఒకే విమానంలో ప్రయాణం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ, రాత్రి ఏడు గంటలకు ఢిల్లీలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇదే రోజున అమరావతిలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌తోపాటు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్, గవర్నర్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కూడా వెళ్లేందుకు సిద్ధమైతే ముగ్గురు ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరే అవకాశం ఉంది.

 

అప్పుల కుప్పగా ఏపీ

Tags: Prime Minister Narsingham, Jagan, KCR,

కలిసి పని చేయాలి

Date:25/05/2019

విజయవాడ  ముచ్చట్లు:

ఎపి లోను, కేంద్రం లోను అధికారం లోకి వచ్చిన జగన్, మోడీలకు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణశుభాకాంక్షలు తెలిపరు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు అన్నాక ప్రజా తీర్పు లో ఎవరో ఒకరు గెలవక తప్పదు. ఎన్నికలను యుద్దంలా ఎవరూ చూడొద్దు. ప్రజల కోసం అందరూ కలిసి పని చేయాలి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కేంద్రం నుంచి న్యాయ బద్దంగా రావాల్సిన వాటిని తెచ్చేందుకు కృషి చేయాలి. నేడు ఎన్నికలలో అభివృద్ధి, మౌలిక వసతుల అంశం ప్రస్తావనే లేదు. కుల మతాలు అంతరాలు, ప్రజలకు తాయిలాలు ప్రకటించడమే ఆనవాయితీ గా మారిందని వ్యాఖ్యానించారు. కులాల విభజనతో నేడు నడుస్తున్న రాజకీయాలు ప్రజలకు మంచిది కాదు. కులాల వల్ల ఒకస్థాయి ప్రజలకు మేలు తప్ప, సామాన్యులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కులాల తో సమాజ విభజన ఎపి లో స్పష్టంగా కనిపించింది.

 

 

 

ఇక అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు తాయిలాలు ప్రకటించి ప్రజలను సోమరులను చేస్తున్నారు. నేను ఇచ్చా, నేను ఇస్తా అని నేతలు చెప్పుకోవడం విడ్డూరం. ప్రజల సొమ్మును ప్రజలకే తమ స్వార్దం కోసం పంచి గొప్పగా చెప్పుకోవడం ఎపి నేతలకే చెల్లింది. కోట్ల రూపాయలు ఓట్ల కోసం ఖర్చు పెడితే.. వారు ప్రజాసేవ ఎలా చేస్తారు. ఇప్పడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే  ఎంత ఖర్చవుతుందో కూడా వారికే తెలియదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలు వీడి ఎపి కి న్యాయం చేసేలా వ్యవహరించాలని అన్నారు. నలుగురు జాతీయ స్థాయి ఆర్దిక నిపుణులు  ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఢిల్లీ నుంచి నిధులు తేలేని పక్షంలో.. మనం కట్టే వాటిని వినియోగించుకునేలా కేంద్రాన్ని ఒప్పించాలి.  యనభై వేల కోట్లు రావాల్సి ఉన్నందున, వాటిని తెచ్చే అంశాల పై దృష్టి పెట్టాలని సూచించారు. మంచి విద్య, వైద్యం అందించడం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. సురాజ్య యాత్ర ద్వారా అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వాలకు, పార్టీలకు ఇచ్చాను. ఇప్పటికైనా సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుని వాటిని అమలు చేయాలి. ఇప్పుడు విద్య, వైద్యానికి వినియోగిస్తున్న డబ్బు కన్నా ఖర్చు తక్కువే అవుతుందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమ రంగాలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.

 

అగడపాటిని నమ్ముకున్నాడు…ప్రాణాలు తీసుకున్నాడు

Tags: Should work together