332వ రోజు జనగణమనకు న్యాయమూర్తి వందనం

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో గత ఏడాది ఆగస్టు నుంచి ఉదయం ప్రారంభించిన నిత్యజనగణమన కార్యక్రమం 332 వ రోజైన శనివారం న్యాయమూర్తి మోతిలాల్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ , తహశీల్ధార్‌ మాదవరాజు పాల్గొని, గౌరవ వందనం చేశారు. పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో జనగణమన కార్యక్రమాన్ని కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, శ్యామ్ ప్రసాద్, ముత్యాలుప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా సర్కిల్‌లో వెస్ట్గోదావరి ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మోతిలాల్‌ పాల్గొని గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు మున్సిపాలిటిలో నిత్యజనగణమన గీతాలాపన ఉదయం 8 గంటలకు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి దేశభక్తి కార్యక్రమాలలో యువత పాల్గొని, మరింత విస్తతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు శ్యామ్‌ప్రసాద్‌, త్యాగరాజు, నానబాలసురేష్‌, చిట్టి, అజిజ్‌, మస్తాన్‌, మురళి,అర్ధర్‌పాల్‌, తజ్ముల్‌బాషా, అంజాద్‌, సర్వేయర్‌ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా ఆర్జున ఘట్టం  

Tags: Judge salutes the 332nd census