ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వెదురు

-ప్రణాళికలు సిద్దం చేస్తున్న ఉద్యానవనశాఖ

Date:07/09/2019

ఖమ్మం ముచ్చట్లు:

పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో వాతావరణంలో అనేక మార్పులొ స్తున్నాయి. ప్లాస్టిక్‌ మహ్మరి ఇందుకు అవరోధంగా మారింది. దీనికి ప్రత్యా మ్నాయంగా వెదురును ప్రోత్సహించేలా ఉద్యానవన శాఖ సన్నద్ధమవుతున్నది.రాష్ట్రంలోని పలు అడవుల్లో ఇప్పటికే వెదురు కుందుళ్లు విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌ తదితర జిల్లాల్లో ఎక్కువగా ఎదురు కుందుళ్లు ఉన్నాయి. రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఎత్తున వెదురు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో వెదురు చెట్లను నరకాలన్నా, అక్రమంగా తరలించాలన్నా అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నది.

 

 

 

 

ఈ నిబంధనను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో వెదురు సాగు ప్రోత్సాహానికి అవకాశాలు మెరుగుపడ్డాయని అధికారులు భావిస్తున్నారు. వెదురు కలపతో వివిధ రకాల వస్తువుల తయారీలో శిక్షణ కల్పించడం, వెదురుపై ఆధారపడిన కుటుంబాల నైపుణ్యాన్ని మెరుగుపరడం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు ఉద్వానవన శాఖ అధికారి చెప్పారు. ఈ-మార్కెటింగ్‌ సదుపాయం కల్పించనున్నారు. వెదురు ఉత్పిత్తిదారులతో సంఘాల ఏర్పాటుకు చేసి, వస్తువుల తయారీదారుల సంఘాలకు సబ్సిడీపై వెదురు అందించాలని అధికారులు భావిస్తున్నారు.  అందుకు గానూ రైతులకు ప్రత్యేక రాయితీలిచ్చి భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.

 

 

 

 

వెదురు లంకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నేషనల్‌ బ్యాంబు మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా వెదురు వనాలను పెంచడానికి కసరత్తు ప్రారంభించింది. వెదురు మొక్కల పెంపకం, వెదురు ఆధారిత కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడానికి జాతీయ వెదురు మిషన్‌ను ఏర్పాటైంది. వెదురు సాగు కోసం రాష్ట్రంలో రూ.11కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. వెదురు సాగు చేయడం, మద్దతు ధర కల్పించడం తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవనోపాధిని మరింత మెరుగుపర్చడం, వెదురు ఉత్పత్తులను మార్కెట్‌ చేయడం బ్యాంబు మిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా తెలంగాణ రైతాంగానికి వెదురు ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. రైతులకు అవగాహన కల్పించి, వారి పంట పొలాల గట్ల వెంట ఈ వెదురు మొక్కలను పెంచాలని నిర్ణయించింది.

 

 

 

 

రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రోత్సహించాలని భావిస్తున్నది. వెదురు సాగు చేసే రైతన్నలకు ఒక్కో వెదురు మొక్కకు రూ 240 చొప్పున ప్రోత్సాహం అందించనుంది. వెదురు మొక్కలు నాటడానికి గుంతలు తవ్వడం, ఎరువులు, సాగు చేయడానికి అంతా కలిపి రూ 240 వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెదురు మొక్కకు రూ 35 నుంచి రూ 40వరకు ఖర్చవు తుంది. మొదటి ఏడాది 50 శాతం రాయితీ, రెండో ఏటా 30శాతం, మూడో ఏడాది 20శాతం చొప్పున రైతుకు రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఎకరాలో 250 మొక్కలు నాటేలా ప్లాన్‌ చేసింది. వెదురు లంకలు అడవుల్లో సహజంగా పెరుగుతాయి. రాష్రంలో వాతావరణం అందుకు అనుకూలంగా ఉన్నది. అడవుల్లోంచి, రైతు పొల్లాలో సాగు చేయించాలని నిర్ణయించింది.

 

 

 

 

రాష్ట్రంలో 8 లక్షలా 30వేల వెదురు మొక్కలను నాటాలని ఉద్యానవనశాఖ సన్నాహాలు చేస్తున్నది. వెదురు ఒకసారి నాటితే దశాబ్దాల తరబడి దిగుబడి వస్తున్నది. కానీ, బుట్టల అల్లికలకు, భవన నిర్మాణాలకు మాత్రమే పరిమితమైంది. ఇండ్లల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌ బదులుగా గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల్లో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురును అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే పలు ఈశాన్య రాష్ట్రాల్లోని మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రజల జీవనంలో వెదురు అంతర్భాగమైందని అధికారులు అంటున్నారు.

 

 

 

 

అక్కడైతే ఇండ్లలోనే వెదురు పెంచుతున్నారు. వెదురుబొంగులతో తయారు చేసిన అందమైన ఫర్నీచర్‌ పట్ల పట్టణవాసులు ఆసక్తి చూపుతున్నారు. బొమ్మలు, ఫెన్‌బాక్స్‌లు, కూరగాయల బుట్టలు, సోఫాలు, టీపారులు, హ్యాంగింగ్‌ చైర్‌లుతోపాటు కర్టెన్లు, క్యాండిల్‌ స్టాండ్‌లు, టోపీలు, పూలకుండీలు, అందమైన దీపాలు తదితర వస్తువులను తయారు చేసే అవకాశం ఉన్నది. వెదురు ఉత్పత్తులు తయారు చేసే వారికి శిక్షణ కల్పించి నైపుణాలను పెంచడానికి మంచి అవకాశాలున్నాయని, తద్వారా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం కానుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.

పప్పులు, ఉల్లిపాయలు మండుతున్నాయ్. 

Tags: Bamboo as a substitute for plastic

వంద మందికే ట్రైనింగ్

Date:20/08/2019

అదిలాబాద్‌ ముచ్చట్లు:

అన్నీ ఉన్నా…అల్లుడి నోట్లో శని అన్న చందాన తయారైంది. హకీంపేట,కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ (రీజినల్‌ హాస్టల్‌) జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు క్రీడాపాఠశా లలు ఉన్నాయి.రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్‌ అకాడమీలున్నాయి. వీటిన్నింటిలో కలిపి కేవలం వంద మంది క్రీడాకారులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడగా కబడ్డీని ప్రభుత్వం గుర్తిం చింది. అయితే ఆ క్రీడకూ అకాడమీ లేకపోవడం గమనార్హం. గ్రా మీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆడే ఖోఖో, వాలీబాల్‌కు ప్రత్యేకంగా అకాడమీలు లేవు.

 

 

 

2003-04లో పలు క్రీడలకు జిల్లాల్లో అకాడ మీలు ఏర్పాటు చేయగా, నిధుల లేమితో 2008లో వాటిని మూసి వేశారు. గతంలో వాలీబాల్‌ అకాడమీ ఎల్‌బీ స్టేడియంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కోచ్‌ల విభజన, వసతి సదు పాయాలు సరిగాలేకపోవడంతో దాన్ని ప్రభు త్వం మూసివేసింది. అప్పటి నుంచి దాని ఏర్పాటు ఆలోచన మరిచిపోయింది. గతంలో కబడ్డీ అకాడమీ ఉన్నా అది వివిధ కారణాలతో మూత పడింది. ప్రస్తుతం తిరిగి ప్రారంభించే ఆలోచనా చేయడం లేదు. అంతర్జాతీయ స్థా యిలో రాష్ట్రక్రీడాకారులు పతకాలు తీసుకొ స్తున్న బాక్సింగ్‌కు ప్రత్యేకంగా అకాడమీలు లేవు.

 

 

 

 

అయితే రాష్ట్రంలో పెద్దగా క్రీడాకారులు లేని కయాకింగ్‌, రోయింగ్‌, కనోయింగ్‌ క్రీడలకు స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో శిక్షణ ఇస్తున్నారు…. వీటితో పాటు ప్రత్యేకంగా ఖమ్మంలో అథ్లెటిక్స్‌ అకాడమీ(బాలుర), హైదరాబాద్‌లో సైక్లింగ్‌, రెస్లింగ్‌ అకాడమీలుం డగా, కొత్తగా వనపర్తిలో హాకీ అకాడమీ(బాలుర) ఏర్పాటు చేశారు. వీటన్నింటిలో సుమారు వెయ్యి మంది క్రీడాకారులు శిక్షణ తీసుకుం టున్నారు. మొత్తం శిక్షణ కోసం చేరిన విద్యార్థుల్లో సగంమంది ఒక్క హకీంపేట క్రీడా పాఠశాలలోనే ఉండటం గమనార్హం.

 

 

 

 

 

హకీంపేట స్కూల్‌లో అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, ఆర్చరీ, వాలీబాల్‌, ఫెన్సింగ్‌, జిమ్నా స్టిక్‌, కరీంనగర్‌ స్కూల్‌లో అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, జిమ్నాస్టిక్‌, జూడో, స్విమ్మింగ్‌, కనోయింగ్‌, కయాకింగ్‌, రోయింగ్‌క్రీడలు, వరం గల్‌ స్కూల్‌లో హ్యాండ్‌బాల్‌, అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, ఆదిలాబా ద్‌లో అథ్లెటిక్స్‌ క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో సాట్స్‌గుర్తించిన క్రీడ లు 50వరకూ ఉంటే, శిక్షణ ఇస్తున్నది కేవలం 16క్రీడల్లో మాత్రమే. దీంతో క్రీడలంటే ఇష్టమున్నా, అకాడమీలు లేక, శిక్షకులు లేక విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. క్రీడలకు దూరమవుతున్నారు.తెలంగాణలో మొత్తం 95మంది మాత్రమే శిక్షకులు (కోచ్‌) ఉన్నా రు.

 

 

 

 

వీరిలో 34మంది కాంట్రాక్టు, 53మంది ఔట్‌సోర్సింగ్‌ కోచ్‌లుం డగా, కేవలం 8మంది మాత్రమే పర్మినెంట్‌ శిక్షకులు న్నారు. వీరిలోనూ శిక్షణ బాధ్యతల కంటే ఇతర బాధ్యతలు నిర్వ హించే వారేఅధికం. ఇటీవల శారుతో పాటు గిరిజనశాఖ విడు దల చేసిన కొత్త కోచ్‌ల నియామకాల వైపు ప్రస్తుతమున్న కోచ్‌లు చూస్తు న్నారు. దీని ప్రభావంతో సగంమంది కోచ్‌లు అటువైపువెళ్లే అవకాశ మున్నట్టు అధికారులు చెబుతున్నారు.

 

 

 

 

అయితే 2018జనవరిలో జరిగిన సాట్స్‌ పాలక మండలిలో కొత్తగా వందమంది కాంట్రాక్టు కోచ్‌లను తీసుకోవాలని తీర్మానం చేశారు. ఏడునెలల దాటినా ఇప్ప టికీ అది తీర్మానంగానే మిగిలిపోయింది. దీనికితోడు క్రీడాకారులకు ఇచ్చే సామాగ్రి కూడా సరిగా ఇవ్వడం లేదనే ఆరో పణలున్నాయి.

రియల్ ఎస్టేట్ రంగంలో హైద్రాబాద్ టాప్

Tags: Training for a hundred people

ముందుకు సాగని దేవాదుల ప్రాజెక్టు

Date:14/06/2019

వరంగల్ ముచ్చట్లు:

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్‌ జిల్లాల పరిధిలో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 3 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. కంతనపల్లి రద్దయి తుపాకులగూడెం బ్యారేజీ తెరపైకి రాగా.. గతంలో అగ్రిమెంట్‌ చేసుకున్న సూ–రిత్విక్‌ కంపెనీకే పనులు అప్పగించారు. మారిన పరిస్థితులు, డిజైన్‌కు అనుగుణంగా 2016లో అక్టోబర్‌లో అగ్రిమెంట్‌ కాగా.. 2020 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయా ల్సి ఉంది. 2017 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారం భించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంటే తుపాకులగూడెం పనులు తాబేలు నడకను తలపిస్తున్నాయి.అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా పదేళ్ల పాటు శ్రమించి తొలి దశ పనులు ప్రారంభించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఏడాదిలో 171 రోజులు నీటిని ఎత్తిపోయడం ద్వారా 10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో డిజైన్‌ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు అహో.. ఓహో అంటూ అందరూ కితాబిస్తున్నారు. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టు అయిన మేడిగడ్డ బ్యారేజీకి 30 కి.మీ.ల దిగువన నిర్మిస్తున్న తుపాకులగూడెం పురోగతిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 10లక్షల ఎకరాలకు సాగునీరందిం చే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి.

 

 

 

 

 

 

 

 

మోటార్ల ద్వారా తోడి పోయాలంటే గోదావరిలో కనీస నీటిమట్టం 71 అడుగులు ఉండాలి. వరదలు వచ్చినప్పుడు తప్ప ఈ స్థాయిలో నీటి మట్టాలు గోదావరిలో లేకపోవడంతో 40 రోజులకు మించి ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్‌ చేయడం సాధ్యపడలేదు. దేవాదుల వద్ద కనీస నీటి మట్టం స్థాయిని ఉంచేలా దిగువన కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించనున్నారు పీవీ నర్సింహారావు సుజల స్రవంతి పేరుతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆయన మరణంతో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌తో ఇబ్బంది లేకుండా పూర్తిగా ముంపు లేకుండా కంతనపల్లికి 17 కి.మీ.ల ఎగు వన తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. బ్యారేజీ నిర్మాణానికి 2,121 కోట్లు కేటాయించారు.పనులు ప్రారంభించి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఫౌండేషన్‌ పనులు పూర్తి కాలేదు. డౌన్‌ స్ట్రీమ్‌ ర్యాఫ్ట్, డౌన్‌ స్ట్రీమ్‌ స్పిల్‌వే పనుల వరకే అయ్యాయి. అవి కూడా నదిలో సగం వరకే పూర్తయ్యాయి. మిగిలిన సగం ప్రాంతంలో అసలు పనులు మొదలు పెట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే అన్నారం బ్యారేజీకి గేట్లు బిగిస్తుండగా మేడిగడ్డ, సుందిళ్ల వద్ద ఫౌండేషన్‌ పనుల దశ ఎప్పుడో దాటి పోయింది.

 

అదిలాబాద్ లో అడగడుగునా నిఘా

Tags: Progressive Deeds Project

ఎయిమ్స్ కు క్లాసులకు అంతా సిద్ధం

Date:29/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

అత్యుత్తమ వైద్యసేవలకోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల ప్రజల చిరకాలవాంఛ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ  ఏర్పాటుతో నెరవేరనుంది. నిమ్స్‌ను ఏర్పాటుచేస్తే అత్యుత్తమ వైద్యసేవలు అందుతాయని పాత 5 జిల్లాలలో పోరాటాలుచేసి అలిసిపోయిన ప్రజల డిమాండ్ కేంద్రప్రభుత్వం నిమ్స్ స్థానంలో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్ ద్వారా నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నిమ్స్ ఏర్పాటవుంతుందనుకుంటే 4సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఔట్ పేషెంట్ విభాగం మాత్రమే దక్కింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 12 రాష్ట్రాలలో భాగంగా తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని పార్లమెంట్‌లో ప్రకటించి అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక రూపంలో కావలసిన వనరుల జాబితాను కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావల్సిన వనరుల జాబితా అందిన వెంటనే కార్యాచరణ ప్రారంభించి ఎయిమ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తాజాగా బీబీనగర్ ఎయిమ్స్ విభాగం ఇన్‌చార్జి, ఎయిమ్స్ భోపాల్ విభాగం డైరెక్టర్ ఈ నెల 16న జారిచేసిన ప్రకటనతో ఎయిమ్స్‌లో వైద్య సేవలందుతాయన్న యాదాద్రిభువనగిరి జిల్లాతోపాటు పరిసర జిల్లాల ప్రజల ఆశలు చిగురించాయి. అందులో భాగంగా కేంద్ర బృందం నిమ్స్ భవనాన్ని పరిశీలించి సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు 2022 లోపు ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నా నిర్ణయం మెరకు బీబీనగర్ ఎయిమ్స్ కళాశాల బాధ్యతలను భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్‌కు అప్పగించారు. అందులో భాగంగా వైద్య విద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు 40 మంది బోధన, బోధనేతర సిబ్బందినియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

 

 

 

 

 

భోదన విభాగంలో కమ్యూనిటీ ఫ్యామిలీ మెడిసిన్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాలలో ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. బోదనేతర విభాగాలలో సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, డిమానిస్ట్రేటర్ల విభాగాలలో నియామకానికి మార్గం సుగమమయ్యింది. జూన్ 5వ తేదీలోపుఅర్హులైనవారు ధరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.కేంద్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రారంభం2018 సంవత్సరం డిసెంబర్ 17న జరిగిన కేంద్ర మంత్రివర్గంలో 750 పడకల అసుపత్రి ఏర్పాటు చేస్తూ 15 విభాగాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఎయిమ్స్ భవన నిర్మాణం, వసతుల ఏర్పాటుకు రూ.1,628కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఎయిమ్స్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్ ఏర్పాటులో భాగంగా వైద్యవిద్యాకళాశాల సీట్ల భర్తీ అయిన వెంటనే వైద్య సేవలందుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.

జగన్ కేబినెట్ పై చర్చోపచర్చలు

 

Tags: All of the classes are ready for Aims

కరీంనగర్‌..ఉద్యమాల పురిటిగడ్డ

 Date:08/04/2019
కరీంనగర్ ముచ్చట్లు :
కరీంనగర్‌..ఉద్యమాల పురిటిగడ్డ . కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్టాత్మకమే. అన్ని పార్టీలకు కీలకమే. ఓటర్లు ప్రతీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తూ అందరి నాయకుల్ని ఆదరించిన సందర్భాలు గత చరిత్రలో ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న పార్లమెంటు నియోజకవర్గంగా కరీంనగర్‌‌కు పేరుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బి.వినోద్ ఎంపీగా గెలిచారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున వినోద్ మరోసారి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు.ఓసీలకు ముఖ్యంగా వెలమలకు కంచుకోట కరీంనగర్. నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఆసామాజిక వర్గానికి చెందిన వారు లేకుండా ఎన్నికలు ఉండేవి కావు. నియోజక వర్గం అవిర్భావం నుంచి భిన్న పార్టీల సభ్యులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఇక్కడిప్రజలు ఆమితాసక్తిని చూపించారు. ఒకే వ్యక్తికి రెండు నుంచి మూడు పర్యాయాలు అవకాశమిచ్చినా.. మరో ఎన్నికల్లో వేరే వారిని ఎన్నుకున్నా.. పనితీరు బాగోకుంటే నిర్మొహమాటంగా వేరే అభ్యర్థిని గెలిపించుకున్నా.. అది కరీంనగర్‌పార్లమెంటు స్థానంలోని ప్రజానీకానికే చెల్లింది.లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్… కచ్చితంగా ఏదో ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే.
అయితే కరీంనగర్ నుంచి మళ్లీ వినోద్ బరిలోకి దిగితే… ఇక కేసీఆర్ మెదక్ లేదా నల్లగొండల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ ఎంపీ వినోద్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి కరీంనగర్‌తో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. మానకొండూర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, కోరుట్ల నియోజవర్గాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమే. పార్లమెంటు ఏర్పాడిన తరువాత 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 2004 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేసీఆర్ గెలిచారు. అనంతరం 2006, 2008లో జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో అభ్యర్థుల బలబలాలను చూస్తే..టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ఎస్‌కు పట్టుండంతో గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేస్తున్నారు వినోద్. ఇక కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న పొన్నం ప్రభాకర్ 2009లో ఎంపీగా గెలిచారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ కూడా రేసులో ఉన్నారు. సంస్థాగతంగా ఇక్కడ బీజేపీకి పట్టుండడం..స్థానికంగా బండి సంజయ్‌కు మంచి పేరు ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. స్థానిక యువతతో కలిసిపోయి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని ఆయనకు పేరుంది. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మే 23న తేలనుంది.
Tags:Karimnagar

కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కీలక స్థానం

 Date:03/04/2019 కరీంనగర్ ముచ్చట్లు:

మూడు పార్టీల రణరంగానికి నెలవైన కరీంనగర్‌  పార్లమెంట్‌ ఎన్నికల్లో కీలక స్థానంగానే పేరొందుతోంది.  తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు ఈ స్థానాన్ని కైవసం చేసుకునేలా పావులు కదుపుతుండటంతో ఆసక్తికర పరిణామాలు  కనిపిస్తున్నాయి. మూడు నెలల కిందట జరిగిన శాసనసమరంతో పోలిస్తే ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల సమయానికి రాజకీయ రంగులతోపాటు ప్రచార హంగులు మారాయి. అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అనేలా ఆధిపత్య పోరు సాగుతోంది. ఇదే తరుణంలో గతంలో వచ్చిన ఓట్లను తారుమారు చేసేలా తమ బలాన్ని చూపించాలని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో తరహాలో ప్రజలకు హామీలను గుప్పిస్తున్నాయి. తమని గెలిపిస్తే ప్రగతిని దరిచేరుస్తామనే తీరుని తెలియపరుస్తున్న అభ్యర్థులు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సాధించే ఓట్ల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. ఓట్లను లెక్కిస్తూ వాటిని తమ ఖాతాలో వేసుకునేలా వ్యూహాల్ని పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గత పరిస్థితులు, తాజా ఎత్తుగడలను ఇప్పుడు పరిశీలిద్దాం..
నియోజకవర్గాల పరంగా చూస్తే తక్కువ ఓట్లున్న నియోజకవర్గమే అయినా పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చూపేలా వేమువాడ ఓటర్లు విభిన్నమైన తీర్పుని అందించనున్నారు. తెరాస గత అసెంబ్లీ ఎన్నికల్లో 84,050ఓట్లను పొందింది. ఇక్కడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు 31వేలకుపైగా ఆధిక్యం పొందారు. అక్కడి కాంగ్రెస్‌ పార్టీకి 55,864ఓట్లు వచ్చాయి. ఇదే తరహాలో భాజపా అభ్యర్థి 6569ఓట్లను పొంది అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచే కమలనాథులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆపార్టీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవాలనే జోష్‌ను చూపిస్తోంది. అదే తరహాలో కాంగ్రెస్‌ పార్టీ పలు సమావేశాల్ని నిర్వహిస్తూ ఓట్లు పొందాలనే ఎత్తుగడల్ని చూపిస్తుండగా తెరాస మాత్రం అందరికన్నా ముందుండేలా అగ్రనాయకుల రోడ్‌షోలతో ప్రజల మనసుల్ని గెలిచే ప్రయత్నాల్లో ముందువరుసలో ఉంటోంది. ప్రచారంలోనూ వైవిధ్యతను చూపిస్తూ అందరిని ఆకర్షించుకోవాలని మూడు పార్టీల పోటీదారులు భావిస్తున్నారు.
పార్లమెంట్‌ పరిధిలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం కరీంనగర్. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గంగుల కమలాకర్‌కు 14,974 ఆధిక్యత వచ్చింది. సుమారుగా 2లక్షల ఓట్లు పోలవగా ఇందులో తెరాసకు 80,983ఓట్లు పడ్డాయి. నియోజకవర్గంలో తెరాస పైచేయిని సాధించినప్పటికీ ఆ పార్టీకి సమీపంలోనే నిలబడేలా భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కి కూడా 66 వేలకుపైగా ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ 39,500 మంది ఆదరణను అందుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చూపించిన అభిమానాన్ని మరింతగా పెంచుకునేలా మూడు పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నాల్ని సల్పుతున్నారు. ముఖ్యంగా తెరాస గతానికి భిన్నంగా కరీంనగర్‌ పట్టణంలో ఆధిక్యతను పొందాలని భావిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లపై  తెరాస నేతలు ఆకర్ష వల విసిరారు. తమ పార్టీలో చేర్చుకున్నారు. తెరాస బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్ని సాగిస్తుండగా.. భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
చొప్పదండి నియోజకవర్గ పరిధిలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మొన్నటి శాసనసమరం సమయంలోనే మారిపోయాయి. అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శోభకు తెరాస టికెట్‌ను నిరాకరించడం, సుంకె రవిశంకర్‌ గులాబీ పార్టీ అభ్యర్థిగా మారిపోవడం..భాజపా నుంచి శోభ పోటీ చేయడం.. సుంకె రవిశంకర్‌ 42,127ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.  తెరాస  అభ్యర్థి గెలుపొందడంతో ఇక్కడ పార్టీ శ్రేణులు ఉత్సాహంగానే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో గత ఓట్ల రికార్డును (91,090) పదిలపర్చుకునేలా తెరాస సమాయత్తమవుతుండగా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తమకు వచ్చిన 48,963ఓట్లను రెండింతలుగా మార్చుకునేలా లోలోపల పార్టీ శ్రేణులతో ప్రజల్ని కలుస్తోంది. భాజపా అభ్యర్థికి కూడా ఈ నియోజకవర్గ పరిధిలోని యువజన సంఘాల మద్దతు క్రమక్రమంగా పెరుగుతుండటంతో పోటీ త్రిముఖమనే  వినిపిస్తోంది. అధికార పార్టీలోకి ఆయా మండల స్థాయి నాయకులు చేరడంతో కాంగ్రెస్‌కు ఒకింత కలవరం తప్పడంలేదు. భాజపా మాత్రం జోరును చూపించేలా అడుగులేస్తోంది.
ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గం అవడంతో ఇక్కడ గులాబీ పార్టీకి వచ్చే ఓట్ల అంచనాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఓట్లు పెరిగినట్లే ఈ స్థానంలో లోక్‌సభకు తెరాస అభ్యర్థికి వీలైనన్ని ఎక్కువ ఓట్లను అందించేలా మంత్రి వ్యూహాత్మకంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. పైగా పార్లమెంట్‌ స్థానంలో ప్రచార బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే సొంత నియోజకవర్గం ఆధిక్యతపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 1,03,764 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి 60,509 ఓట్లు రాగా 43వేలకుపైగా ఎక్కువ ఓట్లను ప్రత్యర్థిపై సాధించారు. ఇక్కడ భాజపా అనుకున్న తరహాలో కనీసం డిపాజిట్‌కు సరిపడ ఓట్లను కూడా పొందలేక 1662తో సరిపెట్టుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో మిగతా రెండు పార్టీలకన్నా జోరుని చూపించాలంటే కమలనాథులకు కష్టమైన ప్రక్రియనే. ఇక గత ఎన్నికల్లో గెలుపు ఆశతో పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో గత ఫలితాల్ని తారుమారు చేసేలా ఓట్ల జోరుని పెంచుకావాలని చూస్తోంది. గ్రామస్థాయిలో ఓటర్లతోపాటు జమ్మికుంట, హుజురాబాద్‌ పురపాలికల్లోని ఓటర్లు ఎవరిని కరుణిస్తారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
మానకొండూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌పై మూడు పార్టీల నాయకులు కన్నేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆరెపల్లి మోహన్‌ అనూహ్యంగా తన అనుచరులతో తెరాస గూటిని చేరడంతో రాజకీయ వర్గాల్లో ఇది చర్చకు తావిచ్చింది. దీంతో చాలా మండలాల్లో మండలస్థాయి నాయకులు కూడా పార్టీని విడిచే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పార్టీ బాధ్యతల్ని మోస్తున్న కవ్వంపల్లి సత్యనారాయణ తనవంతు ప్రయత్నాల్ని చేస్తున్నారు. కాంగ్రెస్‌కు తగిలిన గాయాన్ని రూపుమాపేలా ఊరూర సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కేవలం 4,335 ఓట్లను మాత్రమే పొందిన భాజపా ఇప్పటి సమరంలో అందుకు పదింతల ఆధిక్యతను మూటగట్టుకునేలా ఊరూర ఓటర్లను కలిసే పనిలో నిమగ్నమైంది. తెరాసకు ఈ నియోజకవర్గంలో 88,890 ఓట్లురాగా.. 57,209 ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థికి వచ్చాయి. దీంతో ఇక్కడ ఇప్పుడు తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తోపాటు ఆయనపై పోటీ చేసి ఓటమి చెందిన ఆరెపల్లి మోహన్‌ ఇద్దరు  కలిసి తమబలాన్ని చాటాలని చూస్తున్నారు.
సిరిసిల్ల..ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే అత్యధికంగా గులాబీ పార్టీకి ఓట్లను గంపగుత్తగా అందించిన నియోజకవర్గమిది. ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గెలిచిన స్థానమవడంతో ఇక్కడితీరు మిగతా నియోజకవర్గాలకు భిన్నంగానే ఉంటోంది. తెరాసకు 1,25,213 ఓట్లు రాగా కాంగ్రెస్‌ 36,204ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కేటీఆర్‌ 89,009ఓట్ల పైచేయిని కాంగ్రెస్‌పై సాధించారు. ఇక్కడ భాజపా అభ్యర్థి 3,243ఓట్లు మాత్రమే లభించాయి. కేటీఆర్‌ నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి పర్చడం సహా ఇక్కడినుంచి గెలిచిన ఆయన రాష్ట్రస్థాయిలో కీలక హోదాలో ఉంటారని ఇక్కడి ఓటర్లు ఈ తరహాలో పట్టం కట్టారు. ఇప్పుడు అదే పంథాని కొనసాగించేలా గులాబీ సేనాని ముందుకు పరుగెత్తుతుండగా.. నేరెళ్ల ఘటనలో బాధితులకు మద్దతును తెలిపిన భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ దండిగానే సానుభూతి ఓట్లు వస్తాయనే విశ్వాసంతో ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కూడా ఎట్టిపరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు రెట్టింపుగా ప్రజల విశ్వాసాన్ని అందుకోవాలనే తపనను ప్రచారంలో చూపిస్తున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్‌ నుంచి ప్రత్యేక స్థానంగా గుర్తింపును పొందిన హుస్నాబాద్‌పైనే అన్ని పార్టీల దృష్టి పడుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తెరాసకు ఎక్కువగానే ఇక్కడ ఓట్లు పడ్డాయి. తెరాస తరపున పోటీ చేసిన వొడితెల సతీష్‌కుమార్‌ ఏకంగా 1,17,083 ఓట్లను సంపాదించుకున్నారు. ఇక్కడ ప్రజా కూటమి అభ్యర్థికి 46,553ఓట్లు వచ్చాయి. ఇక భాజపా అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. కేవలం 4వేలకుపైగా ఓట్లను పొందింది. దీంతో ఇక్కడి ఓట్లను ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు. అత్యధికంగా మండలాలున్న నియోజకవర్గం అవడంతో ఇక్కడనే ప్రచారం జోరుగా అందరు అభ్యర్థులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కొత్త కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉన్న చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో ఉన్న పట్టును మరింతగా పెంచుకునేలా పార్టీల ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Tags:Karimnagar is a key candidate in the parliamentary elections

కరీంనగర్, వేములవాడలో భారీ వర్షం

Date:23/05/2018
కరీంనగర్ ముచ్చట్లు:
ఉత్తర తెలంగాణ లో భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా  వేములవాడ మండలంలో భారీవర్షంతోపాటు ఈదురు గాలులు.  ఉరుములు.  మెరుపులు రావడంతో జనజీవనం స్థంభించింది. ఉమ్మడి కరీంనగర జిల్లా లోని గంగాధర ధర్మపురి ,జగిత్యాల ,కోడీమ్యాల ,వేములవాడ లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. మేఘాలు భారీగా కమ్ముకున్నాచి. పలు  ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా కి అంతరాయం కలిగింది. అంతేకాకుండా రైతులకు చేతికి వచ్చిన పంట భారీ వర్షాల వల్ల ముద్దయ్యాయి. ప్రజలు బయటకు రాకుండా వుండిపోయారు.
Tags: Karimnagar, heavy rain in Vamulvada