పేదముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ

Date:21/05/2019

పుంగనూరు ముచ్చుట్లు:

పుంగనూరు పట్టణంలోని పేద ముస్లిం కుటుంభాలకు చెందిన పలువురుకి రంజాన్‌ తోఫాను పంపిణీ చేశారు. పట్టణంలోని సున్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌, సీఐ నాగశేఖర్‌, అయూబ్‌, కరీముల్లా, మస్తాన్‌ ఆధ్వర్యంలో తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇనాయతుల్లాషరీఫ్‌ మాట్లాడుతూ పేద ముస్లింలు సంతోషంగా రంజాన్‌ పండుగను నిర్వహించుకునేందుకు అన్ని రకాల ఆహార వస్తువులు కలిపి పంపిణీ చేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా తోఫా పంపిణీ చేశామన్నారు. ఈనెల రోజుల పాటు ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. పట్టణంలోని పేద ముస్లింలను ఆదుకోవడమే తమ కమిటి లక్ష్యమన్నారు.

 

బెంగాల్ లో రీ పోలింగ్

 

Tags: Ramadan delivering poverty to the poor