జగన్, కేసీఆర్, మై హోమ్  నెగిటివ్ వార్తలు వద్దు

-టీవీ 9లో కొత్త పద్ధతులు

Date:20/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

టీవీ9 అంటే… సెన్సేషనలిజానికి కేరాఫ్ అడ్రస్. తమకు టీఆర్పీలు తెచ్చి పెడుతుందనుకుంటే.. ఎంత పెద్ద వీఐపీ అయినా సమాజంలో.. పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తికి సంబంధించిన వార్తలనయినాదాటి పెట్టే ప్రయత్నమే చేయదు. అందుకే..టీవీ9ను అందరూ విమర్శించినా చూస్తూనే ఉంటారు. ఆ ఫలితం టీఆర్పీల్లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. ఇది రవిప్రకాష్ ఉన్నంత వరకే. ఇప్పుడు.. టీవీ9 తన సహజసిద్దమైన స్వభావాన్ని కోల్పోతోంది. కొత్త యాజమాన్యం. వార్తలపై ఎడిటోరియల్ టీంపై.. ఆనేక ఆంక్షలు పెడుతోంది. దీనికి సంబంధించి. కొత్తగా ఓ మూడుకుటుంబాల
వార్తల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని స్పష్టమైన దిశానిర్దేశం.

 

 

 

 

 

అందిందని చెబుతున్నారు. టీవీ9 కొత్త యాజన్యానికి యజమాని లాంటి మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు, తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలకు సంబంధించిన ఎలాంటి వ్యతిరేక వార్తలకు..బ్రేకింగ్‌ న్యూస్‌లుగా.. టీవీ9లలో చోటు లేదని.. స్పష్టమైన ఆదేశాలు ఎడిటోరియల్ టీంకు అందాయి. ఇటీవల జూపల్లి కంపెనీలు, ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆయన వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు జరిగిన పరిణామాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ.. మూడు కుటుంబాలకు చెందిన
నెగెటివ్ వార్తలకు.. టీవీ9లో చోటు కల్పించవద్దని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఆ ప్రభావం టీవీ9లో స్పష్టంగా కనిపిస్తోంది.

 

 

 

 

తెలుగు రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల గెలుపోటములపై.. కథలు కథలుగా చెబుతున్న టీవీ 9 కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోయిన నిజామాబాద్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. బీజేపీతో సంబంధాలు చెడిపోయిన నేపధ్యంలో.. ముందుముందు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు, సోదాలు వంటివి ఉంటాయని.. అనుమానిస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో… అప్రమత్తంగా ఉండాలనే తాజా సూచనలు ఇచ్చారంటున్నారు. నిజానికి ఏ చానల్ యజమాని కూడా తన ఇంట్లో ఐటీ సోదాలు చేశారని సొంత చానల్‌లో బ్రేకింగ్లు వేసుకోరు.

 

 

అంత వరకూ బాగానే ఉన్నా.. టీవీకు మాత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు.. వారి కుటుంబసభ్యులకు సంబంధించి.. ఎలాంటి వ్యతిరేక వార్తలు వేయవద్దని చెబుతున్నారు. ఇదంతా టీవీ9 జర్నలిస్టులకు కొత్తగా ఉంది. రవిప్రకాష్ ఉన్నప్పుడు ఎడిటోరియల్ టీంకు పూర్తి స్వేచ్చ ఉండేది. ఏ వార్త వేసినా.. వేయకపోయినా.. ఆయన నుంచి ఎలాంటి ఎంక్వైరీ వచ్చేదికాదు. కానీ ఇప్పుడు మాత్రం.. ఏది ఏస్తే ఏమవుతుందో.. అన్న టెన్షన్‌లో టీవీ9 సిబ్బంది మునిగిపోతున్నారు.

కలెక్టర్ల చేతిలో  మున్సిపల్ ఛైర్మన్లు

Tags: Do not want pics, KCR, my home negative news

తెలంగాణలో తమిళనాడు రాజకీయాలు

Date:21/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ సాధన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థి ఉనికిని కకావికలం చేసిన కేసీఆర్.. భవిష్యత్ రాజకీయాల కోసం మరో మహత్తర స్ట్రాటజీని సిద్దం చేస్తునట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్నటిదాకా తామే ప్రత్యామ్నాయం అన్న కాంగ్రెస్ స్థానంలో.. నేడు బీజేపీ కూడా పోటీకి రావడంతో.. అసలు మరే పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా సరికొత్త వ్యూహంతో ముందుకు కదలాలని యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా వ్యూహం అంటే.. ‘తమిళనాడు తరహా రాజకీయం’ రాష్ట్రంలో అమలుచేయడం. తెలంగాణలో తమిళనాడు తరహా రాజకీయాన్ని గనుక పక్కాగా అమలుచేస్తే.. అధికారం ఎన్నటికీ తమ చేయి దాటిపోదని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.తమిళనాడులో ఎలాగైతే అధికారం డీఎంకె-అన్నాడీఎంకెల చేయి దాటి మరో పార్టీ చేతిలోకి వెళ్లదో.. తెలంగాణలోనూ అదే జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా చర్చ జరుగుతోంది. డీఎంకెలో వారసత్వ పోరు మొదలై విభేదాల కారణంగా ఎంజీఆర్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా అన్నాడీఎంకెను స్థాపించారు. అప్పటి నుంచి అధికారం డీఎంకె-అన్నాడీఎంకెల చేతులు మారుతుందే తప్ప.. మరో పార్టీకి అక్కడ స్థానం లేదు.

 

 

 

 

 

 

 

టీఆర్ఎస్‌లోనూ ప్రస్తుతం వారసత్వ పోరు నడుస్తుందన్న వాదన చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తనయుడు కేటీఆర్ కోసమే హరీశ్ రావును కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హరీశ్ రావు పార్టీని చీల్చుతారని కొందరు.. పార్టీ మారుతారని మరికొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు తెర పైకి వస్తూనే ఉన్నాయి. అయితే హరీశ్ వాటన్నింటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ తన పుట్టుక-చావు టీఆర్ఎస్‌తోనే అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయినా సరే ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తమిళనాడు తరహా రాజకీయం గురించి ప్రస్తావించినట్టుగా ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. డీఎంకె, అన్నాడీఎంకెల లాగా టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం జరగాలని.

 

 

 

 

 

 

అలాగైతే తమవాళ్లే అధికారంలో ఉంటారు తప్ప మరొకరికి అవకాశం ఉండదని కేసీఆర్ పార్టీ శ్రేణులతో చెప్పినట్టుగా అందులో పేర్కొంది.తెలంగాణపై టీఆర్ఎస్‌కు ఉన్నంత అవగాహన, పట్టు మరో పార్టీకి లేదని.. ప్రత్యామ్నాయంగా మరో పార్టీ పుట్టుకొచ్చినా అది టీఆర్ఎస్ నుంచే ఉండాలని కేసీఆర్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అంటే, ఇప్పుడు తెరపై ఉన్న ఊహాగానాల ప్రకారం ఒకవేళ హరీశ్ రావు పార్టీని చీల్చినా.. అది కేసీఆర్ స్ట్రాటజీలో భాగమే అనుకోవచ్చేమో..! దీంతో హరీశ్-కేటీఆర్ మధ్య అంతర్గత పోరుకు తెరపడి.. అధికారం అయితే హరీశ్ చేతిలో, లేదంటే కేటీఆర్ చేతిలోనో ఉంటుంది. అంతే తప్ప మూడోవాళ్ల చేతిలోకి వెళ్లదు. మొత్తానికి ప్రత్యర్థుల అంచనాలకు అందని రీతిలో కేసీఆర్ వ్యూహాలు పన్నడంలో ధిట్ట అని దీన్నిబట్టి మరోసారి అర్థమవుతోంది.

 

 తెలంగాణలో కాసుల కురిపిస్తున్న ఇసుక

Tags: Tamil Nadu politics in Telangana

ప్రధాని ప్రమాణానికి నరసింహన్ , జగన్, కేసీఆర్, 

Date:28/05/2019

అమరావతి ముచ్చట్లు:

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఒకే విమానంలో ప్రయాణం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ, రాత్రి ఏడు గంటలకు ఢిల్లీలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇదే రోజున అమరావతిలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌తోపాటు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్, గవర్నర్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కూడా వెళ్లేందుకు సిద్ధమైతే ముగ్గురు ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరే అవకాశం ఉంది.

 

అప్పుల కుప్పగా ఏపీ

Tags: Prime Minister Narsingham, Jagan, KCR,

కేసీఆర్, జగన్ కీలకం కానున్నారా

Date:30/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తొలి మూడు దశలు ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నిక దాదాపు పూర్తయింది. అయితే ప్రాధమికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఒడిశాలో బిజూ జనతాదళ్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు అధికంగా పార్లమెంటు స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నాయి. తొలి మూడు దశల ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశంలేదన్నది విశ్లేషకుల అంచనా.అందుకే ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే పెత్తనమవుతుందని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. మూడు దశలుగా జరిగిన ఎన్నికల్లో దాదాపు 302 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో ఎన్డీఏకు 80 స్థానాలకు మించి రావని లెక్కలు వేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూటమికి వంద స్థానాలకు మించి రావని చెబుతున్నారు. మిగిలిన 241 పార్లమెంటు స్థానాల్లో ఉత్తర భారతంలోనే ఉన్నాయి. వీటిలో ఎవరు ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటే వారికే ఢిల్లీ పీఠం దక్కుతుంది. అయితే ఉత్తర భారతంలోనూ ఈసారి ఏ పార్టీకి తాము ఊహించుకున్నంత మెజారిటీ స్థానాలు రావన్నది అంచనాగా విన్పిస్తుంది.
దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలదే వచ్చే కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశముంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం అదే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీరోల్ అని భావించిన కె.చంద్రశేఖర్ రావు తాను ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మరోసారి బలం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలవనున్నారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ఒక ఉమ్మడి అజెండాను రూపొందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. దేశ ప్రయోజనాలు, అవసరాలతో పాటుగా రాష్ట్రాల ప్రయోజనాలను కలిపి అజెండాను రూపొందించాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్ లు కేసీఆర్ ప్రతిపాదనకు ఒకే చెప్పే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు జగన్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతిస్తారన్నది వాస్తవం. రెండు తెలుగురాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీకి కలపి కనీసం 35 స్థానాలను సంపాదిస్తామన్న ఆశ ఉండటంతో జాతీయ స్థాయిలో తమ డిమాండ్లకు మద్దతిచ్చే పార్టీవైపే వీరు మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. పేరుకు ఫెడరల్ ఫ్రంట్ అయినప్పటికీ ఏదో ఒక జాతీయ పార్టీకి మద్దతిచ్చే అవకాశముంది. జగన్, కేసీఆర్ లకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ మాత్రమే కావడంతో హంగ్ పార్లమెంటు ఏర్పడితే తమ కోర్కెలకు ఓకే చెబితేనే కమలం పార్టీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం.
Tags: KCR, Jagan is crucial

దాడులు చేస్తున్నారు

Date:04/04/2019
అమరావతి ముచ్చట్లు:
దేశంలో దుర్మార్గులంతా ఏకమయ్యారని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు.గురువారం  పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రత్యర్థులపై కక్ష సాధించే లక్ష్యంగా ఏకమయ్యారన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ లు ఏపీపై ముప్పేట దాడులు చేస్తున్నారన్నారు. మోడీ డైరెక్షన్ తోనే టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలపై పాత కేసులను కేసీఆర్  తవ్వితోడున్నారన్నారు. మరోవైపు ఐటీ దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మైలవరంలో ఏకంగా పోలీసులపై కూడా దాడులకు తెగబడుతున్నారన్నారు.  ఇక ప్రజలపై వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. యుద్ధంలో కనీస సంప్రదాయాలు పాటిస్తారనీ, ఓటమి భయంతో వైసీపీ అన్నింటిని వదిలేసిందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు.  వీళ్ల దుర్మార్గాలతో తరతరాల అభివృద్ధి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు పీకేస్తామని పుంగనూరులో బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. పొన్నూరులోనైతే స్కూల్ పిల్లల ఆటోపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారని గుర్తు చేసారు.  మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృష్టించారని దుయ్యబట్టారు. పోలీసులు, జవాన్లపై చెప్పులు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సత్తా ఏంటో మోదీకి కూడా రుచి చూపించాలన్నారు.
Tags: Attacks are being done

కేసీఆర్‌, మోదీ పాలనపై విరుచుకుపడిన రాహుల్‌ గాంధీ

-మోదీ దేశానికి ప్రధాని కాదని, దొంగలకు చౌకీదార్‌
-కార్పొరేట్‌ వ్యాపారులకు తప్ప పేదలకు రుణాలు దక్కడంలేదు
-వనపర్తిలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ
Date:01/04/2019
వనపర్తి ముచ్చట్లు:
కేసీఆర్‌, మోదీ పాలనపై తీవ్రస్థాయిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. మోదీ దేశానికి ప్రధాని కాదని, దొంగలకు చౌకీదార్‌ అని ఆరోపించారు.తెలంగాణలో సీఎం కేసీఆర్‌.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దోపిడీకి పాల్పడుతున్నారని దొంగల జేబుల్లో రూ.వేల కోట్లు జమచేశారని ఆరోపించారు. తెలంగాణలో ఒకే ఒక్క కుటుంబం సర్వం దోపిడీ చేస్తోందని, రైతులు, యువత నుంచి లాక్కొని తన బొక్కసం నింపుకొంటోందని మండిపడ్డారు. సోమవారం వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ వీరిద్దరి మధ్యా రహస్య మిత్ర బంధం ఉందని ఆరోపించారు. మోదీ చేసిన నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. తదితర అంశాలకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చిన విషయాన్ని రాహుల్‌ గుర్తు చేశారు. అలాగే, కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా రాహుల్‌ ప్రజలకు వివరించారు.
‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అండగా నిలబడింది. రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ పాలన ఒకేలా ఉంది. 15-20 మంది ధనవంతులు మాత్రమే వారి పాలనతో ప్రయోజనాలు పొందుతున్నారు. మోదీ ప్రభుత్వం కొద్ది మంది శ్రీమంతులకు లక్షల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చింది. ప్రధాని కాగానే మోదీ పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానని ఎందుకు వేయలేదు. మేం మోదీలా అబద్ధాలు చెప్పం. అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.72వేలు చొప్పున మహిళల ఖాతాల్లో జమ వేస్తాం. కాంగ్రెస్‌ పాలనలో పేదల కొనుగోలు శక్తి పెరుగుతుంది. నోట్ల రద్దు, గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌తో మోదీ అందరినీ రోడ్డున పడేశారు’’ అని విమర్శించారు.  ‘‘కాంగ్రెస్‌ నిర్ణయాల వల్ల మహిళలు ఆర్థికంగా శక్తిమంతులు కానున్నారు. కనీసం రూ.12వేల కంటే తక్కువ ఆదాయం ఎవరికీ ఉండదు.
అందరికీ న్యాయం చేసేందుకే కనీస ఆదాయ పథకానికి న్యాయ్‌ అనే పేరు పెట్టాం. ఈ పథకంతో పేదరికంపై కాంగ్రెస్‌ మెరుపు దాడులు చేయనుంది. ఈ పథకం చరిత్రాత్మకమైనది, కాంగ్రెస్‌ మాత్రమే ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటుంది. దీనిద్వారా 5కోట్ల కుటుంబాలకు నేరుగా నగదు జమచేస్తాం. ఎలాంటి అనుమతి లేకుండా పేదలు కుటీర పరిశ్రమలు, చిన్నవ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. మోదీ పాలనలో కార్పొరేట్‌ వ్యాపారులకు తప్ప పేదలకు రుణాలు దక్కడంలేదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
Tags: KCR, Rahul Gandhi who broke with Modi’s regime

కేసీఆర్, కేటీఆర్ తో కలిసిన పవన్ కళ్యాణ్

Date:28/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
కేసీఆర్ – జగన్ కలవటం ఏంటి, నాకు రాయబారం పంపటం ఏంటి అంటూ, వారం క్రితం పవన్ మాట్లాడిన మాటలు గుర్తుండే ఉంటాయి. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ తో కలిసి ముచ్చట్లు, నవ్వులు, పువ్వులు పూయించారు. కలిసినప్పుడు మాట్లాడుకోవటం వేరు కాని, వీరి మధ్య జరిగిన సంభాషణ చూస్తే మాత్రం, వీళ్ళు మాట్లాడే మాటలకి, చేసే చేతలకి పొంతన లేదు అనిపిస్తుంది. ఈ అరుదైన కలయిక, గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమంలో జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.అటు సీఎం.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ కాసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఇలా కేటీఆర్‌‌తో.. కేసీఆర్‌ ఇద్దరితో సుమారు అరగంటకు పైగా పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ వర్గాలు మాత్రం, చంద్రబాబుకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పై, దాంట్లో పవన్ పాత్ర పై చర్చించారేమో అని గుసగుసలాడుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని కేటీఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. దీంతో తెరాస.. వైకాపా ఒక్కటయ్యాయని టీడీపీ విమర్శించింది. తెరాస.. వైకాపా కలయికను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తప్పుబట్టారు. తెనాలి వెళ్లిన పవన్‌… పెదరావూరు సభలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ… తెరాసను దెబ్బతీసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారు. వైఎస్‌ జగన్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు తెరాస నేతలు అడ్డుకున్నారు. తెలంగాణలో జగన్‌ను అడుగుపెట్టనీయబోమని ప్రకటించిన నేతలే ఇప్పడు ఆయనకు సపోర్టు చేస్తున్నారు అని విమర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. కానీ, ఆ తర్వాత ఎప్పుడూ దానిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు పవన్‌ కల్యాణ్ కేసీఆర్‌, కేటీఆర్‌తో చాలాసేపు మాట్లాడటం చర్చనీయాంశమైంది. పవన్‌ కల్యాణ్‌‌ వారిద్దరితో ఏం మాట్లాడి ఉంటారనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విందుకు చంద్రబాబు హాజరుకాలేదు.
Tags:KCR, Pawan Kalyan with Ketiar

ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం

Date:18/01/2019
విజయవాడ ముచ్చట్లు:
ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని స్పష్టంగా చెప్పిన కేసీఆర్‌… మిషన్‌ మొదలు పెట్టారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏపిని తన గుప్పిట్లో పెట్టుకోవటానికి, చంద్రబాబును ఓడించాల్సిందేనని ఆయన గట్టిగా భావిస్తున్నారు. అందుకే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రెస్‌మీట్‌లో చంద్రబాబుపై విమర్శలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఏపీ ప్రతిపక్ష నేతతో సమావేశానికి టీఆర్ఎస్ సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఏ క్షణమైనా… సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చు. సమయం తక్కువగా ఉన్నందునే జగన్‌తో కేటీఆర్‌ సమావేశం అయ్యారన్న మాట వినిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య చర్చల్లోనూ ఏపీ రాజకీయ అంశాలే ప్రధానంగా వచ్చాయి. అయితే ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామని కేసీఆర్‌, కేటీఆర్‌ చెబుతున్నారు. మరి అది ఎలా ఉంటుంది.. టీఆర్‌ఎస్‌ నేరుగా ఏపీ గ్రౌండ్‌లోకి దిగుతుందా.. ఇక్కడ రంగప్రవేశం చేసే అవకాశం ఉంటుందా…? అంటే.. ఉండకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.టీఆర్‌ఎస్‌ నేతలకు వైసీపీ నేతలకు మధ్య సాన్నిహిత్యం ఉంది.
టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. సంబరాలు చేసుకునేంత ఫ్రెండ్‌షిప్‌ నెలకొంది. అందుకే ఇక్కడ నేరుగా రంగంలోకి దిగకుండా.. వైసీపీని ఏపీలో బలపరచడం టీఆర్ఎస్ మొదటి వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి అవసరమైన అన్ని అండదండలు అందించాలి. ఎన్ని రకాలుగా సాయం చేయగలరో.. అన్ని రకాలుగా జగన్‌ పార్టీకి టీఆర్ఎస్ సాయం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇది కేసీఆర్‌ చెబుతున్న రిటర్న్‌ గిఫ్ట్‌లో ఓ కోణం ఇక రెండోది… మిత్రుడి కోసం మరో మిత్రుడిని రంగంలోకి దించడం.. టీఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఇప్పటికే ఐ యామ్‌ కమింగ్‌ టు ఏపీ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఏపీకి వస్తున్నాను.. కాచుకో అన్న రేంజ్‌లో చంద్రబాబుకు సవాల్ విసిరారు.
అయితే ఓవైసీ ద్వారా జగన్‌కు కేసీఆర్ మేలు చేయడం మరో కోణంగా కనిపిస్తోందని చెబుతున్నారు. కర్నూలు, గుంటూరు లాంటి చోట్ల మైనారిటీ ప్రాబల్యం ఎక్కువుగా ఉంది. ఇలాంటి చోట్ల ఎంఐఎం పోటీ చేయడం మరో ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇపుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసిపోయాయి. ఎంతగా అంటే.. తెలంగాణలో తాము ఓవైసీ స్థానం తప్ప అన్ని గెలుస్తామని చెబుతున్నారు. ఆ స్థానంపై ఫోకస్‌ కూడా చేయడం లేదు టీఆర్‌ఎస్‌. ఇపుడు ఏపీలో కూడా ఇంతే.. ఎంఐఎం రంగంలోకి దిగుతుంది. వైసీపీకి సపోర్ట్‌ చేస్తామని చెబుతోంది..
అంటే ఈ రెండు పార్టీలకు సంధానకర్తగా టీఆర్‌ఎస్‌ ఉంటుందన్న మాట.. తద్వారా టీడీపీ వైపు మళ్లే ముస్లిం ఓటర్లను ఎంఐఎం ద్వారా వైసీపీకి దగ్గర చేయడం రెండో వ్యూహం. అంటే ఎలా చెప్పుకున్నా.. కేసీఆర్‌ నేరుగా ఏపీలో దండయాత్రకు దిగే అవకాశం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా రంగంలోకి దిగితే.. నెగిటివ్‌ ప్రభావం ఉంటుందన్న భావన రెండు పార్టీల నేతల్లోనూ వ్యక్తమవుతోంది. 2009లో మహాకూటమి అంటూ జట్టు కట్టినప్పటికీ… తెలంగాణ దాటి ప్రచారం చేయలేదు కేసీఆర్‌.
కేవలం హైదరాబారాద్‌, తెలంగాణలో మాత్రమే చంద్రబాబుతో కలిసి ప్రచారం చేశారు. తాజాగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశవ్యాప్తంగా పార్టీలతో సమావేశాలు జరుపుతున్నప్పటికీ… ఏపీకి మాత్రం కేసీఆర్ వెళ్లలేదు. అయితే వైసీపీతో భేటీ తర్వాత ఇప్పుడు ఏపీకి వస్తారా..? అంటే డౌటేనంటున్నాయి పార్టీ వర్గాలు.
Tags;KCR