కేసీఆర్, అసదుద్దీన్ ప్లాన్ వర్కవుటుందా…

Date:13/12/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో తనకు ఎదురేలేదు అని భావించిన కేసీఆర్‌కి ఈ ఎన్నికల ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి. ప్రజలు మరోసారి పట్టం కట్టారు. దీంతో కేసీఆర్ లో ఎక్కడా లేని జోష్ వచ్చేసింది. ఇక ఏకంగా దేశ రాజకీయాలనే శాసించడానికి నిచ్చెనలు వేసేస్తున్నారు ఈ గులాబీ పెద్ద. బీజేపీ యేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని దేశంలో తీసుకొస్తానని మొదటి మీడియా సమావేశంలోనే చెప్పేశారు కేసీఆర్. అయితే రాష్ట్రంలో చక్రం తిప్పనంత సులువు కాదు! దేశంలో చక్రం తిప్పడమంటే! అనే సంగతి కూడా మనోడి బాగానే తెలుసండోయ్..! ఎంతైనా రాజకీయంలో మెట్లెక్కుతూ పైకొచ్చినోడు కదా! ఆ మాత్రం తెలియకుంటే ఎలా? కాకపోతే దేశ ప్రజలందరినీ ఏకం చేయటం అనేది ఆయనకు శక్తికి మించిన భారం. అది అతనొక్కడే మోయలేడుగా! అందుకే అసదుద్దీన్ ఓవైసీతో కలిసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట ఈ గులాబీ బాస్.
ఇందుకోసం మజ్లిస్ పార్టీ అధినేత అసద్దుద్దిన్‌తో చేతులు కలపనున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇద్దరూ కలిసి.. దేశంలోని ప్రధాన పార్టీల నాయకులను కలవడమే కాకుండా దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకొని బీజేపీ, కాంగ్రెస్‌లకు అడ్రస్ లేకుండా చేయాలనేది వీరి ప్లాన్ అట. అసదుద్దిన్ ఒవైసీకి దేశవ్యాప్తంగా ముస్లింలలో మంచి పట్టుంది. అలాగే కేసీఆర్‌కు  కొన్ని వర్గాలలో మద్దతుంది. అలాగే ఇప్పుడు సాధించిన విక్టరీ ఈయనకు బాగా ప్లస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి తరుణంలోనే జాతీయ స్దాయి రాజకీయాలలో వేలు పెట్టొచ్చనేది కేసీఆర్ భావన అని తెలుస్తోంది. అంటే చూశారా.. కేసీఆర్‌కి ఎంత ముందు చూపో! మొన్నామధ్య ఎలక్షన్స్‌లో గెలిస్తే పనిచేస్తా.. లేదంటే హాయిగా రెస్ట్ తీసుకుంటా అని ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయిగా. చావైనా.. రేవైనా రెండిటినీ సమానంగా ట్రీట్ చేయటమే ఆయనలోని బలం.
అదే ఆయనను ఈ రకంగా ఆలోచింపజేస్తోందా? అనేది జనం మాట. జాతీయ స్థాయిలో తన మార్క్ వేసుకోవటమంటే మామూలు విషయం కాదు.. దానికి ఎంతో రాజకీయ పరిజ్ఞానం, మెళకువలు తెలిసుండాలి. మాటలతో అయితే కేసీఆర్ తెలంగాణ ప్రజలను బుట్టలో వేశారు కానీ అదే ఫార్ములా దేశంలో వర్తించదుగా! అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమంటే.. అది కేసీఆర్ అజెండాపై ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ తీసుకు వచ్చిన మైనార్టీ ఓట్ల ఫార్ములా కూడా బీజేపీ కాంగ్రెస్ లను ఇరుకున పెడుతుందని అన్ని పార్టీలు విశ్వసించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల బీజేపీ మీద గెలవటం కోసం కాంగ్రెస్ ముస్లింలను కొంచెం దూరం పెడుతోంది. సరిగ్గా ఇదే పాయింట్‌ని క్యాచ్ చేసే ఆలోచనలో ఉండొచ్చు కేసీఆర్. అందుకే ఆయన ఓవైసీతో కలిసి పకడ్బందీ స్కెచ్ వేస్తున్నారని టాక్! చూడాలి మరి ఈ ప్లాన్ ఎంతమేర వర్కవుట్ అవుతుందో!
Tags:KCR, Asaduddin Plan Workshop …

కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న కేసీఆర్‌

– కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి
Date:20/10/2018
కామారెడ్డి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి మండిపడ్డారు. కేఅందుకే ఆయనను రైతులకు కంటకప్రాయుడు.. కాంట్రాక్టర్లకు ప్రియుడు అని తాను గతంలో అన్నానని గుర్తు చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రాజెక్టులన్నీ ఆంధ్రా గుత్తేదారుల చేతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు ఆంధ్రా గుత్తేదార్లకు రూ.75వేల కోట్ల పనులు అప్పగించారని తెలిపారు. రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి నాలుగేళ్లు చేశారని.. కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరితో రుణమాఫీపై వడ్డీ పెరిగి ప్రజల నడ్డివిరిచారన్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామంటే.. కేసీఆర్‌ రూ.లక్ష మాత్రమే చేస్తామంటున్నారని తెలిపారు.
సచివాలయానికి రాకుండా రాష్ట్రాన్ని పాలించిన ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ లాంటి భాష మాట్లాడేవారు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేరన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదని చెప్పారు. మైనార్టీలను మోసం చేసేందుకే మోదీతో కుమ్మక్కై కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా 70ఏళ్లు దాటాయి గనక తనకు మతి తప్పిందన్నట్టుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఇస్తే దోచుకుంటారని తెలిపారు. తెరాసను పాతిపెట్టాలనే కసి ప్రజల్లో ఝంఝామారుతంగా వీస్తోందన్నారు.
Tags:KCR, which exploits the economy in the name of contracts

ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్

Date:06/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అధికారికంగా రద్దయ్యింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ గవర్నర్‌‌కు సమర్పించగా.. ఆయన ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కేసీఆర్‌ను నరసింహన్ కోరారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శితో పాటూ ఎన్నికల కమిషన్‌కు పంపారు. అలాగే ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్, ఆపద్ధర్మ మంత్రిమండలి కొనసాగిస్తూ సీఎస్ జోషి జీవో నెంబర్ 134ను జారీ చేశారు.
అంతకముందు ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేసి.. మంత్రులతో కలిసి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మంత్రివర్గ తీర్మానాన్ని సమర్పించి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ అసెంబ్లీ రద్దుకు కారణాలను వివరించారు. 2014 జూన్ 2న కేసీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేశారు. అంటే ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ 6నాటికి 4 సంవత్సరాల 3 నెలల 4రోజులు అయ్యింది.
Tags:KCR

ప్రధాని మోదీకి రెండు అంశాలపై వినతి పత్రాలు అందజేసిన కేసీఆర్

Date:25/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
14వ ఆర్థిక సంఘం సిపార్సుల మేరకు తెలంగాణ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తికి అనుకూలంగా 0.50 శాతం అదనంగా ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచాలని ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని  సీఎం కేసీఆర్ కోరారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో 3 శాతం అప్పులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.
వరుసగా నాలుగో ఏడాది కూడా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కు 3.5 శాతం రుణ పరిమితి ఇవ్వాలని లేఖలో  అయన  పేర్కోన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలు 3.5 శాతం ఇచ్చినట్లుగానే 2018-19కి కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు కోసం భారీగా ఖర్చు పెడుతున్నందున రుణ పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేసారు.
వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నాలుగో విడత 450 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని వినతి పత్రం అందజేసారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా  తెలంగాణలోని 9 వెనకబడిన ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి ఏడాదికి 50 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తున్నారని
 2017-18 సంవత్సరానికి నాలుగో విడత నిధులు ఇంకా రాలేదని లేఖలో పేర్కొన్నారు. చొరవ తీసుకుని వెనకబడిన జిల్లాల కోసం రావాల్సిన 450 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
Tags: KCR, who has given the papers to Prime Minister Modi on two issues