రిజర్వాయర్ లో ఎలుగుబంటి హల్చల్.         

  Date:22/03/2019
పాములపాడు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా  వెలుగోడు  రిజర్వాయర్ లో శుక్రవారం నాడు  ఒక  ఎలుగు  బండి హల్ చల్ చేసింది.  రిజర్వాయర్ లో హల్ చల్  సృష్టించి జాలర్లను భయభ్రాంతులకు గురి చేసింది. దీన్ని  గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ఎలుగుబంటి ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.. అదుపులోకి తీసుకునే ప్రయత్నం లో ఎలుగుబంటి  ప్రొడక్షన్ వాచర్ కుమార్ పై  ఒక్కసారిగా దాడిచేసింది. కుమార్ మెడను పట్టుకొని కొంతదూరం  నీళ్ళలోకి లాకెళ్లింది. దాంతో అప్రమత్తమయిన  గ్రామస్తులు, ఫారెస్ట్ ఆఫీసర్లు గట్టిగా అరుపులు కేకలు వేయడంతో  కుమార్ ను వదిలేసిన ఎలుగుబంటి వెలుగోడు గ్రామ పొల్లాలోకి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడిన ప్రొడక్షన్ వాచర్ ను వెలుగోడులోని  ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడి డాక్టర్ లు ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఎలుగుబంటి తపించుకొని వూరి పొలిమేరలోకి వెళ్లడంతో ఏక్షణాన  ఊరిమీద దాడి చేస్తుందోనని అక్కడి ప్రజలు భయందోళనకు గురిఅవుతున్నారు.
TagsBear bear in the reservoir.