లగడపాటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వివరాల ఆధారాలు చూపాలి

– వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్

 

Date:23/05/2019

అమరావతి   ముచ్చట్లు:

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్‌ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని ట్వీట్‌ చేశారు.

 

 

 

 

 

వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో జోకర్ స్థాయికి తీసుకెళ్లిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గత డిసెంబరులో కాంగ్రెస్ 3 హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీస్సుల‌ను తీసుకున్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి 

Tags: The luggage exit poll survey should provide evidence