పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లయన్స్ క్లబ్ లక్ష్యం

– కొండవీటి నాగభూషణం

Date:12/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పేద ప్రజలకు కార్పోరేట్‌ వైద్యం అందించి, వారి ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ పని చేస్తోందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ , చిత్తూరు వైఎస్సార్సీపి ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పతో కలసి వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ ప్రతి వారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరాలు క్రమం తప్పకుండ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే మూడు నెలలకొక్కసారి అన్ని రకాల జబ్బులకు ఉచిత చికిత్సలు, ఆపరేషన్లు చేయించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో తిరుపతి మినహా ఎక్కడ గానీ కీడ్ని రోగ గ్రస్తులకు డయాలసిస్‌ సెంటర్లు లేకపోవడంతో దానిని దృష్టిలో ఉంచుకుని పుంగనూరులో సుమారు రూ.2 కోట్లతో రాంపల్లె వద్ద డయాలసిస్‌ సెంటర్‌ భవన నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. త్వరలోనే డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. ఈ విధంగా పేద ప్రజలకు కార్పోరేట్‌ వైద్యం అందించే లక్ష్యంతో లయన్స్ క్లబ్ఆహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అలాగే పేద ప్రజల కోసం , వారి కులవృత్తుల ఆధారంగా మహిళలకు పనిముట్లు అందజేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాబ్‌ట్యాప్‌లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా పుంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులకు, ప్రజలకు డెంగ్యూ, మలేరియా జ్వరాలకు మందులు ఉచితంగా పంపిణీ చేసిన ఘనత పుంగనూరు లయన్స్ క్లబ్ దేనన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా వైద్యశిబిరాన్ని కుప్పం పీఇఎస్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన 10 మంది డాక్టర్లు, 15 మంది సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు వరదారెడ్డి, మహేంద్రరావు, గోపాలక్రిష్ణ, వెంకటాచలపతిరెడ్డి, రఘుపతి, మునిరత్నంరెడ్డి, గిరిధర్‌, ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

 

చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం

 

Tags: The goal of the Lions Club is to protect the health of the poor