అవినీతిని ఉపేక్షించేది లేదు

-కలెక్టర్ రోనాల్డ్ రోస్

Date:15/07/2019

భూత్పూర్  ముచ్చట్లు:

ప్రభుత్వోద్యోగులు అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని మహబబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం నాడు భూత్పూర్ తహశీల్ధార్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేంచేందుకు  వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఇకనైనా మారాలని ఆయన కోరారు.

 

 

 

 

ప్రజల వద్ద ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమ కార్యాలయ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి నేరుగా తమ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు.మా భరోసా ధ్వారా ప్రజలకు అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సరోజిని దేవి, తహసీల్దార్ మహేందర్ రెడ్డి, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రధినిధులు, పాల్గొన్నారు.

బీజేపీ తీరు దుర్యోద్యనుడి రాజ్య కాంక్ష లా ఉంది

Tags: Do not overlook corruption