ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించిన పలువురు పట్టణ నేతలు

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నూతన ఎమ్మెల్యేగా మూడవ సారి ఎన్నికైన డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పట్టణంలోని కుమ్మరవీధికి చెందిన మురాధియా ట్రస్ట్ ప్రతినిధి అస్లాం, మదీన మసీదు కమిటి సభ్యులు ఖాజా, భక్షు, బాషా, బావాజి, అజ్‌గర్‌, సొన్న తిరుపతిలో కలసి సన్మానించారు. అలాగే సర్వశిక్షా అబియాన్‌ ఉద్యోగులు నారాయణస్వామి, శ్రీనివాసులు పెద్దిరెడ్డిని సన్మానించారు. అలాగే మండల కో-ఆర్డినేటర్‌ రెడ్డెప్ప ఎమ్మెల్యేను సన్మానించారు.

ఎంపికి సన్మానం…

పుంగనూరు సీనియర్‌ న్యాయవాది, చిత్తూరు ఎంపి రెడ్డెప్పను మంగళవారం ఆయన నివాస గృహంలో పలువురు సన్మానించారు. పట్టణ న్యాయవాదులు వెంకట్రమణారెడ్డి, రాజశేఖర్‌, వ్యాపారి రెడ్డెప్ప కలసి ఎంపిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపివో శ్రీనివాసులు, జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి, ఉపాధ్యాయులు వెంకట్రమణారెడ్డి, రవి, విశ్రాంత టీచర్‌ మునస్వామి, దళిత నాయకులు నాగరాజ, లక్ష్మినారాయణ తదితరులు ఎంపిని సన్మానించారు.

 

రైతు సంక్షేమానికి కృషి

Tags: Many urban leaders who honored MLA Peddireddy