నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Date:30/04/2019
ముంబై ముచ్చట్లు:
ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోయింది. 39,032 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,748 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల కారణంగా మార్కెట్ నష్టాల్లోనే ప్రారంభమైంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. అయితే తర్వాత డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, చివరి గంటలో కొనుగోళ్లతో సూచీలు నష్టాలను పూడ్చుకోగలిగాయి. నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఓసీ, హెచ్‌సీఎల్, టాటా స్టీల్, బీపీసీఎల్, హిందాల్కో, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, మారుతీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 29 శాతం మేర పతనమైంది. ఆర్థిక ఫలితాలు బాగులేకపోడం ఇందుకు కారణం.
Tags: Markets ending in losses

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Date:23/04/2019
ముంబై ముచ్చట్లు:

ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా నష్టపోయింది. సెన్సెక్స్ 80 పాయింట్లు పడిపోయింది. 38,565 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 11,576 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దేశవ్యాప్తంగా మూడో మూడో దశ పోలింగ్‌ జరుగుతుండటంతో పాటు మరో రెండు రోజుల్లో(గురువారం) డెరివేటివ్స్‌ ముగింపు ఉండటం, యూరప్‌ మార్కెట్లు నష్టాల ప్రారంభం వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ 50లో ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, కోల్ ఇండియా, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ ఏకంగా 4 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో మారుతీ సుజకీ, యస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. మారుతీ, యస్ బ్యాంక్ షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో వంటి ఇండెక్స్‌లు నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి.
Tags:Markets ending in losses

 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Date:18/04/2019
ముంబై ముచ్చట్లు:
ఇండియన్ స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. దీంతో మార్కెట్ నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. చివరకు సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయింది. 39,140 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 11,753 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. నిఫ్టీ 50లో రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, బీపీసీఎల్, విప్రో, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టైటాన్, ఐఓసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఏకంగా 3 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, హిందాల్కో, వేదాంత, ఇండస్ఇండ్ బ్యాంక్, వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 4 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి.
Tags:Markets ending in losses

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Date:15/02/2019
ముంబై ముచ్చట్లు:
దేశీ స్టాక్ మార్కెట్ శుక్రవారం కూడా నష్టాల్లో ముగిసింది. సూచీలు నష్టపోవడం ఇది వరుసగా ఏడో సెషన్. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఉదయం లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో మిడ్ సెషన్‌లో ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల మేర పడిపోయింది. అయితే తర్వాత సూచీల నష్టాలు రికవరీ అయ్యాయి. చివరకు సెన్సెక్స్‌ 67 పాయింట్ల నష్టంతో 35,809 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 10,724 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. 2018 అక్టోబర్ 28 నుంచి చూస్తే ఇండెక్స్‌లు ఒక వారంలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. నిఫ్టీ 50లో బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, గెయిల్, పవర్ గ్రిడ్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీపీసీఎల్, ఎన్‌టీపీసీ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. రిలయన్స్ 2 శాతం మేర లాభపడింది. అదేసమయంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్, టాటా స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హిందాల్కో, వేదాంత, హెచ్‌పీసీఎల్ షేర్లు నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఏకంగా 5 శాతం పడిపోయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కోలుకుంది. చివరకు 4 శాతం మేర నష్టపోయింది.సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు కూడా 2 నుంచి 1 శాతం మధ్యలో పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.15 శాతం పెరుగుదలతో 64.67 డాలర్లకు పెరిగింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.11 శాతం పెరుగుదలతో 54.47 డాలర్లకు చేరింది. మరోవైపు ఇండియన్ రూపాయి 0.17 శాతం క్షీణతతో 71.28 స్థాయికి క్షీణించింది.
Tags:Markets ending in losses

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Date:29/05/2018
ముంబై  ముచ్చట్లు:
 మార్కెట్లు న‌ష్టాల‌తో స‌రిపెట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్ కీల‌క 35వేల దిగువ‌కు దిగ‌జారింది. మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు దిగ‌జారి 34,949 వ‌ద్ద స్థిర‌ప‌డగా, మ‌రో సూచీ నిఫ్టీ 55.35(0.52%) పాయింట్లు కోల్పోయి 10,633 వ‌ద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఎం అండ్ ఎం(2.26%), భార‌తీ ఎయిర్టెల్(1.08%), ఇన్ఫీ(0.72%), టీసీఎస్(0.54%), హీరో మోటోకార్ప్(0.45%) ఎక్కువ‌గా లాభ‌ప‌డిన వాటిలో ఉండ‌గా, మ‌రో వైపు ఐసీఐసీఐ బ్యాంకు(2.87%), ఎస్బీఐఎన్(2.70%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(1.80%), యెస్ బ్యాంక్(1.78%), కొట‌క్ బ్యాంక్(1.63%), ఏసియ‌న్ పెయింట్స్(1.49%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.
Tags:Markets ending in losses