సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Date:19/11/2018
ఏలూరు ముచ్చట్లు:
పేదలకు ఆధునిక వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి గత నాలుగున్నరేళ్ళ కాలంలో రూ.200 కోట్లు నిధులు పశ్చిమగోదావరి జిల్లాకు కేటయించిన ఘనత ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకే దక్కుతుంతని ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి చెప్పారు. స్థానిక పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 20 మంది పేదలకు రూ.14 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేసారు. ఈ సందర్భంగా బడేటి బుజ్జి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఆరోగ్యవంతంగా జీవించాలని, ఎప్పుడూ ఏ అనారోగ్యానికి గురైనా ఆధునిక వైద్యం ప్రతి పేద కుటుంబానికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అందిస్తున్నామని అయితే ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో లేని వ్యాధులకు పేదలు ఆధునిక వైద్యం చేయించుకొంటే అందుకైన ఖర్చుల బిల్లులను ప్రజా ప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రికి పంపిస్తే ప్రతి పేద కుటుంబానికి సిఎం సహాయ నిధి నుండి నిధులు విడుదల చేస్తున్నారని ఆయన చెప్పారు. ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే గత నాలుగున్నరేళ్ళ కాలంలో సిఎం.సహాయనిధి నుండి రూ.10 కోట్లు నిధులు మంజూరు చేయడం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డని బడేటి బుజ్జి చెప్పారు.
గత ప్రభుత్వాల పాలనలో అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏడాదికి రూ.10 లక్షలు కూడా సహాయాన్ని దేశవ్యాప్తంగా ఏ శాసనసభ్యుడు మంజూరు చేయించలేదని చంద్రబాబు అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్ళకాలంలో రాష్ట్ర వ్యప్తంగా రూ.2వేల కోట్లు కేవలం సి.ఎం సహాయనిధి నుండి పేదల ఆధునిక వైద్యానికి అందించారని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలోనైనా సి.ఎం సహయ నిధి నుండి ఇంత మొత్తం పేదలకు అందలేదని ఆయన స్పష్టం చేసారు. కేవలం ఒక పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ. 200కోట్లు పేదల ఆదునిక వైద్యానికి చంద్రబాబు సి.ఎం సహాయనిధి నుండి అందించారంటే పేదల పేదల ఆరోగ్యం పై చంద్రబాబుకు ఎంత శ్రద్ధ వుందో అర్థమవుతుంది బడేటి బుజ్జి చెప్పారు. ప్రజా ప్రతినిధుల నుండి సిఎం సహాయనిధికి దరఖాస్తులు అందించిన వెంటనే 10 రోజుల్లో చెక్కులు తయారు చేసి ఆయాప్రజా ప్రతినిధులకు పంపించే యంత్రాంగాన్ని కూడా చంద్రబాబు ఏర్పాటు చేసారని, ధనవంతులతో సమానంగా పేద వర్గాలు ఆధునిక వైద్యం పొందాలన్నదే చంద్రబాబు ధ్యేయమని బడేటి బుజ్జి చెప్పారు. పార్టీలకు అతీతంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిఎం సహాయనిధికి ఎవరూ దరఖాస్తు చేసినా  వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి అవసరమైన సహాయాన్ని 15 రోజుల్లో అందిస్తున్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతుందని ప్రతి పేద కుటుంబం ఆరోగ్యంగా జీవించాలని ప్రభుత్వ ప్రధాన ధేయమని బడేటి బుజ్జి చెప్పారు.  ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే  వెంకట రత్నం,కో-ఆప్ఫన్ సభ్యులు కొల్లేపల్లి రాజు, కార్పొరేటర్లు పాలడుగు ధీప్తి శ్యామ్, జాలా సుమతి తదితరులు పాల్గొన్నారు.
Tags:MLA who distributed check assistant checks