దళిత సంఘంచే ఎంపీడీవో, తహశీల్ధార్‌లకు సన్మానం

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, తహశీల్ధార్‌ మాదవరాజుకు సోమవారం సన్మానం చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకరప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌ల ఆధ్వర్యంలో అధికారులకు శాలువకప్పి , పూలమాలలు వేసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అందజేస్తామన్నారు. దళిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు గంగప్ప, గంగాధర్‌, గంగరాజు, చంద్రమోహన్‌, ప్రేమ్‌కుమార్‌, నాగరాజు, ఆనంద్‌, కిరణ్‌, విశ్వనాథ్‌, మోహన్‌, గణేష్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

చెవిటి, మూగ వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

Tags; MPDVO and Tahsildhar felicitated by Dalit community

వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని 23 పంచాయతీలలో వలంటీర్ల నియామకాలకు శనివారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు కలసి మూడవ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో వెహోత్తం 291 ఉద్యోగాలకు గాను 1240 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేశారు. 1:4 నిష్పత్తిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని ఆరడిగుంట, కుమ్మరనత్తం, మేలుందొడ్డి, వెహోదుగులపల్లె పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

14న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నాల్గవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మండలంలోని చండ్రమాకులపల్లె, కుమ్మరనత్తం, మాగాండ్లపల్లె గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

భారతరాష్ట్రపతి తిరుమలరాక

Tags: Interviews for Volunteers