ఐటిఐలో ప్రవేశానికి ధరఖాస్తు చేయండి

Date:13/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల ప్రభుత్వ ఐటిఐలో అడ్మీషన్ల కోసం పదోతరగతి చదివిన విద్యార్థులు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ సుబ్రమణ్యంరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వాదేశాల మేరకు రెండవ విడత అడ్మీషన్లను 14 నుంచి స్వీకరిస్తామన్నారు. పదోతరగతి పాసైన యువతి, యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ.10 లు ధరఖాస్తు రుసుము చెల్లించి, అడ్మీషన్లు పొందాలని కోరారు. ఈనెల 24 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఈనెల 27న ఉదయం 9:30 గంటల నుంచి నిర్వహిస్తామని, ఇంటర్వ్యూలకు హాజరైయ్యే అభ్యర్థులు తమ ఒరిజనల్‌ సర్టిపికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

మదనపల్లె మున్సిపల్‌ కమిషనర్‌గా కెఎల్‌.వర్మ

Tags: Make admission to ITI

పది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Date:11/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని వివిధ ప్రాంతాలలో పేకాట ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేసి , రూ. 9,780 లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. మండలంలోని సింగిరిగుంట పొలాల్లో పేకాట ఆడుతున్న అర్జున్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే పట్టణ సమీపంలోని నక్కబండలో పేకాట ఆడుతున్న బాస్కర్‌రెడ్డితో పాటు ఆరు మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి రూ.9,780 లు స్వాధీనం చేసుకుని , కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Tags: Arrested ten men