చంద్రయాన్ 2 సక్సెస్

-అంతరిక్ష చరిత్రలో భారత్ రికార్డ్

Date:22/07/2019

నెల్లూరు ముచ్చట్లు:

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎ‌ల్వీ రాకెట్ 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన 16.13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది.

 

 

 

అనంతరం రాకెట్ నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహం విడిపోయింది. చంద్రయాన్‌-2ను చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయిన తరువాత 15 నిమిషాలు అత్యంత కీలకమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రయాన్-2 చంద్రుడిపై దిగిన తర్వాత అందులోని రోవర్‌ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది.

 

 

 

 

చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి సమాచారాన్ని, చిత్రాలను పంపనుంది. చంద్రుడిపై జల, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి ఇది పరిశోధనలు చేయనుంది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని జులై 15న తెల్లవారుజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం గుర్తించి వాయిదా వేశారు. ఈ సమస్యను పరిష్కరించిన శాస్త్రవేత్తలు ప్రయోగం సోమవారం నిర్వహించారు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి అనువైన లాంచ్ విండో ఒక నిమిషమే కావడం విశేషం.

 

 

 

ఈ స్వల్ప సమయంలోనే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌తో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు మిష‌న్ కంట్రోల్ రూమ్ నుంచి చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగాన్ని వీక్షించారు. వీవీఐపీలు కూడా ఎక్కువ మందే ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా చూశారు. అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రాకెట్ సుమారు 43.5 మీట‌ర్ల ఎత్తు ఉన్న‌ది. చంద్ర‌యాన్‌లో విక్ర‌మ్ ల్యాండ‌ర్‌, ప్ర‌జ్ఞ రోవ‌ర్ ఉన్నాయి. రోవ‌ర్ అక్క‌డ ఉప‌రిత‌లంపై ప‌లు అన్వేష‌ణ‌లు చేయ‌నున్న‌ది.

 

 

 

 

జాబిలిపై నీట జాడ క‌నుకొనేందుకు ఇదో పెద్ద ప్ర‌యోగంగా భావిస్తున్నారు. ఇస్రో వ్య‌వ‌స్థాప‌కుడు విక్ర‌మ్ సారాభాయ్ పేరుతో చంద్ర‌యాన్ ల్యాండ‌ర్‌కు విక్ర‌మ్ పేరు పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా, ర‌ష్యా, చైనాలు మాత్ర‌మే .. చంద్రుడిపై రోవ‌ర్‌ను దింపాయి. ఈ ప్ర‌యోగంతో జాబిలిపై రోవ‌ర్‌ను దింపిన నాలుగ‌వ దేశంగా భార‌త్ చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ది. మార్క్ త్రీ రాకెట్‌.. చంద్ర‌యాన్‌ను అనుకున్న‌ట్లే విజ‌య‌వంతంగా భూక‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది.

 

 

 

 

చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై చంద్ర‌యాన్‌2 దిగ‌నున్న‌ది.సెప్టెంబర్ 7న చంద్రుడిపై ల్యాండింగ్చంద్రయాన్ 2లో ఉన్న ల్యాండ‌ర్ విక్ర‌మ్‌, రోవ‌ర్ ప్ర‌జ్ఞ‌.. ఇస్రో శాస్త్ర‌వేత్తల అంచ‌నాల ప్ర‌కారం ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ క‌న్నా ఒక రోజు ఆల‌స్యంగా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ది.

 

 

 

 

 

వాస్త‌వానికి జూలై 15వ తేదీన ఎగ‌రాల్సిన చంద్ర‌యాన్‌2.. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌యోగం వారం రోజుల ఆల‌స్యం అయినా.. ల్యాండింగ్‌లో మాత్రం ఒక రోజు తేడా వ‌స్తున్న‌ది. పాత ప్లాన్ ప్ర‌కారం.. 54 రోజుల జ‌ర్నీ త‌ర్వాత చంద్ర‌యాన్‌2 .. చంద్రుడిపై దిగాల్సి ఉంది. కానీ అనుకున్న తేదీ ఆల‌స్యం కావ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కొత్త ప్లాన్ వేశారు. అత్యంత ఖ‌రీదైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌యం కోల్పోవ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కోల్పోయిన స‌మయాన్ని తిరిగి పొందేందుకు చంద్ర‌యాన్ మిష‌న్‌లో కొన్ని మార్ప‌లు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.43 నిమిషాల‌కు షార్ కేంద్రం నుంచి చంద్ర‌యాన్2 ఎగ‌రింది. పాత ప్లాన్ ప్ర‌కారం ప్ర‌యోగం జ‌రిగిన 22వ రోజు..

 

 

 

చంద్ర‌యాన్ చంద్రుడి క‌క్ష్య‌లోకి వెళ్లేది. కానీ ఇప్పుడు ప్లాన్ మార‌డంతో.. చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్ వెళ్లేందుకు 30 రోజులు ప‌ట్ట‌నున్న‌ది. ప్ర‌యోగం జ‌రిగిన 43వ రోజున ల్యాండ‌ర్‌, ఆర్బిట‌ర్‌ను వేరు చేసే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 44వ రోజున డిబూస్టింగ్ చేప‌ట్ట‌నున్నారు. ఇక 48వ రోజున ల్యాండ‌ర్‌, రోవ‌ర్ .. వేరుప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న మాంజిన‌ల్ సీ, సింపేలియ‌న్ ఎన్ ప్రాంతంలో ల్యాండ‌ర్ దిగే ఛాన్సుంది.

జోరుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Tags: Chandrayaan 2 Success

చంద్రయాన్ కు అంతా సిద్ధం

Date:12/07/2019

నెల్లూరు ముచ్చట్లు:

యావత్ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జలై-15,2019 తెల్లవారుజామున 2:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఆదివారంఉదయం 6:51గంటల నుంచి దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది.

 

 

 

అయితే శుక్రవారం(జులై-12,2019)లాంచింగ్ రిహార్సల్ జరుగుతుంది.ఈ సందర్భంలో ఇస్రో శాస్త్రవేత్తలందరూ కొంచెం టెన్షన్ ఫీలవుతున్నారు.ఫుల్ డ్రస్ రిహార్సల్ సాయంత్రం 7:30గంటలకు పూర్తి చేశారు.. కంప్లీట్ అయిన తర్వాత లాంచ్ రిహార్సల్స్  కోసం ఇస్రో సిద్దమవుతుందని,సిస్టమ్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయో చూసేందుకు డమ్మీ కమాండ్స్ ని పంపించనున్నట్లు తెలిపారు. మొత్తం సిగ్నల్స్,కమ్యూనికేషన్ లింక్స్ శుక్రవారం జరిగే ఈ రిహార్సల్స్ లో టెస్ట్ చేయడం జరగుతుందని ఆయన తెలిపారు. దీని తర్వాత లాంచ్ వెహికల్సిస్టమ్స్,ఆర్బిటర్,విక్రమ్ హెల్త్ చెకింగ్,మరికొన్ని టెస్ట్ లు జరుగుతాయని తెలిపారు.

 

 

 

 

ఇస్రో…చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనుంది. సెప్టెంబర్ 6 లేదా 7 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర రోవర్ ల్యాండ్ అవుతుంది. పదేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్-1కు అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఈ చంద్రయాన్-2. భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో 13 పే లోడ్‌లు (ఆర్బిటర్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 పేలోడ్లు) ఉంటాయి. అయితే చంద్రయాన్ మిషన్ కి సంబంధించి కొన్ని ఆశక్తికర విషయాలు ఉన్నాయి.

 

 

 

 

చంద్రయాన్ ప్రాజెక్టుకి అయిన మొత్తం ఖర్చు…వందల హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కన్నా చాలా తక్కువ. చంద్రయాన్ -2 మిషన్ మొత్తం ఖర్చు రూ.978కోట్లు మాత్రమే. అతి తక్కువ ఖర్చుతో భారత్ చంద్రయాన్ ప్రాజెక్టుని పూర్తి చేసింది. చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలే లక్ష్యంగా చంద్రయాన్‌-2ను ఇస్రో చేపట్టనుంది. ఇంతవరకూ ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక వేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రునిపై వ్యర్థ రహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది. ఈ అణుశక్తి ట్రిలియన్‌ డాలర్ల విలువ చేయనుంది.

 

 

ఇస్రో చంద్రయాన్‌-2లో పంపనున్న రోవర్‌ ద్వారా నీరు, హీలియం-3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది. ఆ మూలకాలను చంద్రుడి నుంచి భూమికి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న దేశాలు ఈ ప్రక్రియను తమ చెప్పుచేతల్లో పెట్టుకొనే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగంతో భారత స్థానాన్ని చంద్రయాన్‌-2 మరింత పటిష్ఠం చేయనుంది.ఇప్పటి వరకూ చంద్రునిపై ఎవ్వరూ చేరుకోని ప్రాంతానికి మేం ప్రయోగం చేస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువానికి ఈ ప్రయోగాన్ని నిర్దేశించనున్నాం. ఆ ప్రాంతం గురించి తెలియజేయనున్నామని తెలిపారు.

 

చంద్రయాన్ ప్రయోగాన్ని పరిశీలించనున్న రాష్ట్రపతి

Tags: Everything prepared for Chandrayaan

చంద్రయాన్ ప్రయోగాన్ని పరిశీలించనున్న రాష్ట్రపతి

Date:12/07/2019

తిరుమల ముచ్చట్లు:

యావత్ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జలై-15,2019 తెల్లవారుజామున 2:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపనున్నారు.ఆదివారంఉదయం 6:51గంటల నుంచి దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది.

 

 

 

 

అయితే శుక్రవారంలాంచింగ్ రిహార్సల్ జరుగుతుంది.ఈ ప్రయోగానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు.అర్ధరాత్రి తర్వాత ప్రయోగం చేపట్టనుండడంతో జులై- 14వ తేదీ షార్‌కు రాష్ట్రపతి రానున్నారు. నాలుగు రోజుల తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా  ఇవాళ చెన్నై చేరుకుంటారు రాష్ట్రపతి కోవింద్.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాంచీపురం చేరుకుని వరదరాజ పెరుమాల్ ఆలయంలో అథి వరదార్ స్వామి దర్శనం చేసుకుంటారు.

 

 

 

 

 

శనివారంరాత్రికి తిరుపతి చేరుకుంటారు.భారీ భద్రత నడుమ రోడ్డు మార్గం ద్వారా తిరుమలకి చేరుకుంటారు.శనివారం రాత్రి తిరుమలలోనే బస చేసి ఆదివారంఉదయం వెంకటేశ్వరస్వామి దర్శం చేసుకుంటారు.అనతంరం శ్రీహరికోటకు వెళతారు.చంద్రయాన్-2 ప్రయోగకార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగ తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరతారు.

గ్రేటర్ లో ముందస్తు వ్యూహం

Tags: President to look into Chandrayaan experiment

 తెలుగు నాడు నేతలపై దాడులు.. నెల్లూరులో ఉద్రిక్తత

Date:15/04/2019
నెల్లూరు  ముచ్చట్లు :
నెల్లూరు జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై దాడి ఘటన కలకలంరేపుతోంది. ఈ దాడికి నిరసనగా.. తిరుమలనాయుడి భార్య, తన కుమారుడితో కలిసి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఆమెకు మద్దతుగా టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు, టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. ఇటు వైసీపీ నేతలు కూడా పోటీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేసి ఇరుపార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు. మరోవైపు దాడి ఘటనపై కోటంరెడ్డి స్పందించారు. తిరుమలనాయుడికి చాలామందితో వ్యక్తిగతంగా కక్షలున్నాయని.. ఆ కోణంలో విచారణ చేయకుండా.. తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీడీపీ నేతలు అజీజ్, బీద రవిచంద్ర యాదవ్‌లు ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని.. తన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో బీద రవిచంద్ర హస్తం ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును అందరూ గౌరవించాలి.. బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. నెల్లూరు జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై ఆదివారం దాడి జరిగింది. కొందరు దుండగులు బైక్‌పై వెళుతున్న తిరుమలనాయుడ్ని కారులో వెంబడించారు. అతడి బైక్‌ను ఆపి.. కర్రలు, ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాదారు. ఈ దాడిలో తిరుమలనాయుడు తలకు తీవ్ర గాయంకాగా.. స్థానికులు, టీడీపీ నేతలు ఆస్పత్రికి తరలించారు. తిరుమలనాయుడిపై నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా.. కోటంరెడ్డి ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదనే కారణంతో తిరుమలనాయుడిపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Tags:Attack on the leaders of Telugu Nadu .. Tension in Nellore

సిబిఐ మాజీ జెడి లక్మినారాయణ నెల్లూరు జిల్లా కోవూరు లో పర్యటన

Date:29/05/2018

నెల్లూరు ముచ్చట్లు:

ఈరోజు సిబిఐ మాజీ జెడి లక్మినారాయణ నెల్లూరు జిల్లా కోవూరు మండలం చంద్రమౌళినగర్ ఎస్టీ కాలనీలో యానాదులతో ముఖాముఖి నిర్వహించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెసి పెంచలయ్య, ప్రధాన కార్యదర్శి తలపల చంద్రమౌళి, ఉపాధ్యక్షులు యల్లంపల్లి రమేష్, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేష్ న్ నాయకులు యాకసిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని యానాదుల సమస్యలను జెడి గారి దృష్టికి తీసుకెళ్లారు.

Ex-CBI JD Lakshminarayana tour in Kovoor, Nellore district
Ex-CBI JD Lakshminarayana tour in Kovoor, Nellore district

Tags:Ex-CBI JD Lakshminarayana tour in Kovoor, Nellore district