ఇది గొప్ప విజయం

Date:23/05/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ  చరిత్రలో ఇలాంటి గొప్ప విజయం ఎప్పుడూ నమోదు కాలేదు.  25 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడం, 175లో 153 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఏపీలో నూతన అధ్యాయమని వైకాపా అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత అయన మీడియాతో మాట్లాడారు.  దేవుడి దయతో ప్రజల చల్లని దీవెనలతో ఈ విజయం సాధమైంది.  ఈ విజయం నామీద ఉన్న బాధ్యతను మరింత పెంచుతుంది.  ప్రజలు విశ్వసనీయతకు ఓటేశారు.  నాపై విశ్వాసంతో ప్రజలు ఓటేశారు. ఐదు కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కడికే ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారు.  గొప్ప గవర్నెన్స్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తానని అన్నారు. – ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేలా ప్రతి అడుగు వేస్తా.  నాపై విశ్వాసం ఉంచిన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజమహేంద్రవరం నుండి ఆదిరెడ్డి భవానీ ఘన విజయం

 

Tags: It’s a great success