వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని 23 పంచాయతీలలో వలంటీర్ల నియామకాలకు శనివారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు కలసి మూడవ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో వెహోత్తం 291 ఉద్యోగాలకు గాను 1240 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేశారు. 1:4 నిష్పత్తిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని ఆరడిగుంట, కుమ్మరనత్తం, మేలుందొడ్డి, వెహోదుగులపల్లె పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

14న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నాల్గవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మండలంలోని చండ్రమాకులపల్లె, కుమ్మరనత్తం, మాగాండ్లపల్లె గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

భారతరాష్ట్రపతి తిరుమలరాక

Tags: Interviews for Volunteers

పేద వితంతువులకు రంజాన్ కిట్స్ పంపిణీ

Date:04/05/2019
జగిత్యాల  ముచ్చట్లు:
 ప్రతిఏటా రంజాన్ మాసంలో పురస్కరించుకుని నిరుపేద వితంతువులకు రంజాన్ కిట్స్ పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా రంజాన్ పండుగ ఉపవాస దిక్షలు బుధవారం నుండి ప్రారంభం కానందున హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల శాఖ ట్రస్టు కార్యాలయంలో జిల్లాలోని 300 మంది నిరుపేద వితంతువులకు ,వారి పిల్లలకు  ట్రస్టు అధ్యక్షుడు ఖాజ సలావోద్దిన్ చేతుల మీదిగా  రంజాన్ కిట్స్ ,బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ నిరుపేద వితంతువులు ఆర్థిక పరిస్థితులకు గుర్తించి ప్రతిఏటా రంజాన్ మాసం రంజాన్ కిట్స్ తన ట్రస్టు ద్వారా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. వారి కుటుంబాలు సుఖ సంతోషలతో రంజాన్ పండుగ జరుపుకోవలన్నారు.ఈకార్యక్రమంలో డాక్టర్. ముదస్సిర్ ఓద్దిన్ ,ఇసాఖ్ అలీ ,శోయబ్ ఉల్ హఖ్ ,ఆన్సారి ,ఇమాద్దిన్ ఉమేర్ తదితరులు పాల్గొన్నారు.
Tags;’ Distributed Ramadan Kit to the poor widows

వెంకన్న ఆలయంలో మహాసంప్రోక్షణ

Date:27/04/2019
తిరుమల ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం  మహాసంప్రోక్షణ జరిగింది. ఈ కారణంగ ఉదయం 11 గంటల నుంచి ఆలయాన్ని మూసివేసారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఇప్పటికే ఓ ప్రకటనను విడుదల చేశారు. వరాహస్వామివారి ఆలయంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు ఉన్న కర్కాటక లగ్నంలో మహాసంప్రోక్షణ క్రతువును జరిగింది. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహించారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో సైతం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాలు జరిగాయి.  ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసారు.
Tags: Mahanaprasthana at Venkanna Temple