కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

 Date:20/04/2019
ఒంటిమిట్ట ముచ్చట్లు:

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు  కాళీయమర్దనాలంకాములో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.

 

 

 

 

వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.  సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

 

 

 

 

 

 

అశ్వ‌వాహ‌నం  :

 

శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ‌నివారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు అశ్వ‌ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

 

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించమని ప్రబోధిస్తున్నాడు.

 

 

 

 

 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో న‌టేష్ బాబు, ఏఈవో  రామరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 21న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఆదివారం  ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.

ఏప్రిల్ 22న పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం సాయంత్రం  5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

 

దేవుడి మాన్యాలపై కన్నుపడితే కటకటాలే

 

Tags:In the Kaliyammadanallamalakkaram Srikadasamasam Kavuksham