ఉరవకొండ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Date:08/05/2019
అనంతపురం ముచ్చట్లు:
ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లో కర్ణాటక చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి
చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ కాలనీకి చెందిన ఓబుళేసు, సోమప్ప అనే భవన నిర్మాణ కార్మికులు పాత ప్రయాణ ప్రాంగణం నుంచి తమ కాలనీకి ద్విచక్ర
వాహనంలో వెళ్తున్నారు.అక్కడ ద్విచక్ర వాహనం, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గుర్తించిన స్థానికులు చికిత్స కోసం
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా సోమప్ప మార్గమధ్యంలో మృతి చెందాడు.
Tags:One died in Urobendoda road accident