స్పీకర్ కు మాతృ వియోగం

Date:06/02/2019
నిజామాబాద్ ముచ్చట్లు :
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృ వియోగం కలిగింది. గత  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో బాన్సువాడలో కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైన పాపమ్మ (107)కు బాన్సువాడ ఏరియా దవాఖానలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ  విషయం తెలుసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడకు చేరుకొని తల్లి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అత్యవసర చికిత్స అందిస్తున్న సమయంలో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన పరిగె పాపమ్మ  భర్తపేరు పరిగె రాజిరెడ్డి. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందులో మూడో సంతానం పోచారం శ్రీనివాసరెడ్డి.
తన రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టాలకు శ్రీకారం చుట్టబోయే ముందు పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రతి ఎన్నికల్లోనూ తన మాతృమూర్తి పాపమ్మ  ఆశీర్వాదంతోనే నామినేషన్ వేయడం పరిపాటి. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే పోచారం, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బాన్సువాడకు చేరుకున్నారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
సిఎం కేసిఆర్ సంతాపం తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తల్లీ పాపమ్మ మృతి చెందడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సిఎం కేసిఆర్ స్పీకర్ కు పోన్ చేసి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. పలువురు పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, అధికారులు సంతాపం వ్యక్తం చేస్తూ పోన్ లో పరామర్శించారు.
Tags:Parental discharge to speaker