ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అభినందన మాల

– వైఎస్సార్సీపి శ్రేణుల విజయోత్సవాలు

Date:23/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో వైఎస్సార్సీపి అత్యధిక మెజార్టీ రావడం, వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గురువారం దీనిపై నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుని, అభినందనలు తెలిపారు.

పుంగనూరు….

పుంగనూరు మండలంలోని బండ్లపల్లె గ్రామంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, యువజన సంఘ నాయకులు సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేసి, సంబరాలు చేసుకున్నారు.అలాగే పట్టణంలోని బస్టాండులో పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకుడు రాజేష్‌, జెపి యాదవ్‌, హేము, కుమార్‌ ఆధ్వర్యంలో అభిమానులు పట్టణంలోని అన్ని ప్రాంతాలలోను బాణ సంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అలాగే సెంటర్‌లాడ్జిలో డాక్టర్‌ రమణ్‌రావు , సుమన్‌శా, ఆర్‌కె.రామక్రిష్ణ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేసి, సంబరాలు చేశారు. ఉర్ధూస్కూల్‌వీధిలో ముస్లిం మహిళా నాయకురాలు రహత్‌జాన్‌, రాఫియా, యాస్మిన్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే నానబాలవీధిలో ముతవల్లి అజిజ్‌సాబ్‌, అయూబ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేసి, సంబరాలు చేసుకున్నారు. అలాగే కొత్తయిండ్లలో కిట్టా, రియాజ్‌, గౌస్‌, అంజాద్‌ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాలలో కౌన్సిలర్‌ ఇనాయతుల్లాషరీఫ్‌, నేతలు కరీముల్లా, కృపాకర్‌, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

 

జనమే శ్వాసగా..! హ్యాట్రిక్‌

Tags: Congratulations to Chief Minister Jagan Mohan Reddy