జీరో బడ్జెట్ పాలిటిక్స్ కొంప ముంచిదా..అంతర్మధనంలో జనసేన శ్రేణులు

Date:12/06/2019

విజయవాడ  ముచ్చట్లు:

 

మార్పు తెస్తానంటూ పాలిటిక్స్ లో ప్రవేశించిన పవన్ కల్యాణ్ కు తత్వం బోధ పడింది. చేదు వాస్తవాలు ఒక్కటొక్కటిగా వంటపడుతున్నాయి. రాజకీయమంటే ఎత్తు పైఎత్తుల చదరంగం. చినచేపను

పెద చేప మింగేసే కపటనాటక విన్యాసం. ‘ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు కొనుక్కోవద్దు’వంటి సూక్తులు ఎవరి చెవికీ ఎక్కవు. ఎవరూ పట్టించుకోరు. ఖర్చు పెట్టగల సామర్ధ్యం ఉన్న కొందరు నేతలు

సైతం జనసేనలో చేతులు కట్టేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఘోరపరాజయం ఎదురైంది. దీనిని తిప్పికొడతానంటూ పవన్ తాజాగా చెబుతున్నారు. తన ఓటమికి 150 కోట్లు ఖర్చు పెట్టారంటూ

సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఆధారాలు చూపకపోయినప్పటికీ అసలు విషయం ఆయన గ్రహించినట్లున్నారు. అంతగా డబ్బులు రాజ్యం చేస్తుంటే ప్రజాస్వామ్యంలో పైసలు లేకుండా పదవులు

దక్కుతాయా? తన రాజకీయాల సత్తా ప్రత్యర్థులకు రుచి చూపిస్తానంటున్న పవన్ కల్యాణ్ తన పంథా మార్చుకుంటారా? లేక తన దారిలోకే ప్రత్యర్థులను తేగలనన్న నమ్మకం ఆయనకు కుదిరిందా?

అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాడర్ లో నైతిక స్థైర్యం నింపడానికే ఈ వ్యాఖ్యలు చేశారనే వారికీ కొదవ లేదు. ఏదేమైనప్పటికీ పవన్ మార్కు మార్పు కోణంలో మార్పు వస్తోందా?అన్న చర్చ

మొదలైంది.జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ రంగంలోకి దిగిన జనసేన ఆశించిన స్థాయి విజయాలు సాధించలేకపోయింది. అయితే ప్రధానపార్టీలతో పోలిస్తే నిధులను విచ్చలవిడిగా వినియోగించలేదన్న

మంచి పేరు మాత్రం తెచ్చుకుంది. కానీ రాజకీయాల్లో మంచి తనం కంటే విజయం ముఖ్యం. పార్టీ వైఫల్యాలకు కారణాలను అన్వేషించే క్రమంలో భాగంగా అంతర్గత సమీక్షలు ప్రారంభించారు పవన్

కల్యాణ్. ఇంతవరకూ తన ఆశయాలను మాత్రమే చూశారని, ఇకపై తన రాజకీయాలు చూస్తారంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మార్పు కోసం రంగప్రవేశం చేశానన్న

సంప్రదాయ రాజకీయాల వైపు మళ్లుతారా? పొలిటికల్ వ్యూహాలు, ఎత్తుగడల గురించి మాట్లాడటం వెనక ఉద్దేశాలేమిటి? మనీ మేక్స్ ఎవిరీ థింగ్ అన్నట్లుగా మారిన నేటి పాలిటిక్స్ లో జనసేన

పునరుత్థానం పొందగలుగుతుందా? అంటే సమాధానం దొరకడం కష్టమే. ఆశయం వేరు. ఆచరణ వేరు. క్లీన్ పాలిటిక్స్ అంటూ సిద్ధాంతాలు వల్లె వేసినంత మాత్రాన రాజకీయాలు పరిశుద్ధం కావు.

దీనిని గ్రహించిన పవన్ కల్యాణ్ తాను సైతం స్థానిక రాజకీయాలకు అవసరమైన వ్యూహాలను అనుసరిస్తానని ప్రకటించారు. అంటే ప్రత్యర్థుల ఎత్తుగడలను పరిశీలించి ప్రతివ్యూహాలతో ముందుకు

వెళతామనేది ఆయన సమీక్షల సారాంశంగా చెప్పుకోవాలి.శాసనసభ ఎన్నికల్లో 6.7 శాతం ఓటు షేరుకే పరిమితమై జనసేన చతికిలపడింది. ఒక్క స్థానం గెలుపుతో శాసనసభలో కనీస ప్రాతినిధ్యం

మాత్రమే దక్కింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమితో మొత్తం పార్టీ నిర్వీర్యమైపోయింది. నిరంతరం ప్రజల్లో ఉండకుండా అప్పుడప్పుడూ మాత్రమే కనిపించే నేతగా ముద్ర పడటమూ, పార్టీ

గెలుపు సాధిస్తుందనే నమ్మకం లేకపోవడమూ, తెలుగుదేశంతో అంతర్గత అవగాహన ఉందనే అనుమానం వెరసి జనసేన వైఫల్యానికి దారితీశాయనేది ఒక విశ్లేషణ.

ప్రమాణం తర్వాత మార్పులే

Tags:Zero Budget Politics

కేడర్ లో పునరత్తేజం కల్గించే పనిలో జనసేనాని

Date:08/06/2019

విజయవాడ  ముచ్చట్లు:

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఓటమిపై అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా విజయవాడ పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై జనసేనాని చర్చించారు. ఎన్నికలు పద్దతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల సమయంలో.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో పోరాడామన్నారు. ఫలితాలతో దిగులుపడకుండా.. ఈ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ముందుకు సాగాలన్నారు. జనసేన పార్టీ ఒక ఎన్నికల కోసం మొదలుపెట్టిన ప్రయాణం కాదన్నారు జనసేనాని. ఇతర పార్టీలు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని..

 

 

 

 

 

 

జనసేన నాలుగేళ్ల క్రితం పోటీ చేసినట్లయితే బలం పెరిగేదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు రూ.150 కోట్లు దాటిందని.. జనసేన ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసిందన్నారు. మహిళలు, యువతీ, యువకులు స్వచ్ఛందంగా జనసేనకు అండగా నిలిచారని.. అందుకే ఇన్ని లక్షల ఓట్లు వచ్చాయన్నారు. ప్రజల కోసం ఎంత బలంగా నిలబడామన్నదే ముఖ్యమన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకం అవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా పవన్ నేతలతో చర్చించారు. సమీక్షలు పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ క్లారిటీకి వద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ముందుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి కేడర్‌లో పునరుత్తేజింప చేసి.. బలోపేతం చేయాలని నేతలకు పిలిపునిచ్చారు. అలాగే జనసేన తరపున రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ను అభినందించారు.

 

 

 

 

రెండు లక్షల ఓట్లొచ్చాయి
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖ జిల్లా అభ్యర్థులతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యనేతలు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం తదితరులు పవన్ తో సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, భవిష్యత్తులో జనసేన పార్టీ పుంజుకుంటుందని అన్నారు.ఎన్నికల్లో తాము గెలవకపోయినా, 2 లక్షల మందికి పైగా తమను ఓటుతో ఆశీర్వదించారని, కొద్దిసమయంలోనే ఇంత పురోగతి సాధించడం మామూలు విషయం కాదన్నారు.

 

 

 

 

ఇక, సమీక్ష గురించి చెబుతూ, ఈసారి ఎన్నికల్లో జనసేనలో లోపాలు ఎక్కడెక్కడ వచ్చాయి అనే విషయాన్ని పవన్ కల్యాణ్ అందరితో చర్చించారని తెలిపారు. జనసేన ప్రతిపాదించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ యువతలోకి వెళ్లిందని, ధనప్రభావం లేని రాజకీయాలపై యువతలో ఆసక్తి మొదలైందని అన్నారు. గతంలో తాను రైతులను కలిసేందుకు పాదయాత్ర చేశానని, ఇకముందు కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు కూడా వెళతామని సీబీఐ మాజీ జేడీ స్పష్టం చేశారు.

చెవిరెడ్డికి కలిసొచ్చిన అదృష్టం

 

Tags:In the caterer the work is done in the work of resetting

నాగబాబు కోసం ..భారీగానే ఖర్చా…?

Date:19/04/2019
ఏలూరు ముచ్చట్లు:
స‌మాజంలో మార్పు కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పుకొన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఎన్నిక‌ల్లో ఓట్లు అమ్ముకోవ‌డంపై ఎన్నిక‌ల ప్ర‌చారం లో బాగానే లెక్చ‌ర్లు దంచారు. వైసీపీ, టీడీపీ నేత‌లు ఓటుకు రెండు వేలు.. ఒక‌రు, ఓటుకు ప‌దివేలు ప‌సుపు కుంకుమ పేరుతో మ‌రొక‌రు పంచుతున్నార‌ని, ఇంత కుళ్లిపోయిన రాజ‌కీయాలు తాను ఎక్క‌డా చూడ‌లేదని జ‌న‌సేనాని అనేక స‌భ‌ల్లో ఉటంకించారు. చీద‌రించుకు న్నారు. అంతేకాదు, డ‌బ్బుతీసుకుని మీరు ఓటేస్తే.. రేపు ఆ నాయ‌కుడు మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోక‌పోతే.. ఏమ‌ని ప్ర‌శ్నిస్తారు? అంటూ ప్ర‌జ‌ల‌ను నిల‌దీసిన స‌భ‌లు కూడా మ‌న‌కు క‌నిపించాయి. దీంతో జ‌న‌సేన ఈ ఎన్నిక‌ల్లో ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌ద‌ని అంద‌రూ భావించారు. పైగా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులేద‌ని పేద‌వాడిన‌ని, ఓ కానిస్టేబుల్ కుమారుడిగా మాత్ర‌మే త‌న‌కు గుర్తింపు ఉంద‌ని, ఇదే రాజ‌కీయాల‌కు మార్పు కావాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌సంగాల‌ను దంచి కొట్టారు.దీంతో రాజ‌కీయాల‌కు త‌ట‌స్థంగా ఉండే మేదావులు, ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు కూడా ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఒక్క రూపాయి కూడా అద‌నంగా ఖ‌ర్చు చేయ‌కుండా ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కే ఖ‌ర్చు చేసి.. ప్ర‌తి రూపాయికీ లెక్క‌లు చూపిస్తుంద‌ని, పార‌ద‌ర్శకంగా ప‌వ‌న్ పార్టీ దూసుకుపోతుంద‌ని అంద‌రూ భావించారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు ముగిశాయి.
ఇప్పుడు తాజా ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున పోటీకి దిగిన అభ్య‌ర్థులు చేసిన ఖ‌ర్చుపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు చేసిన ఖ‌ర్చు, వారిని బ‌ల‌ప‌రిచిన నాయ‌కులు చేసిన ఖ‌ర్చు బ‌య‌ట‌కు వ‌స్తోంది. ప్ర‌ధానంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న అన్న‌.. న‌టుడు, నిర్మాత‌, జ‌బ‌ర్ద‌స్త్ నాగ‌బాబు పోటీ చేసిన న‌ర‌సాపురంలో ఎంత ఖ‌ర్చు చేశార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం బ‌లం ఎక్కువ (ఓట‌ర్ల ప‌రంగా కాపులు చాలా ఎక్కువుగా ఉన్నా కొన్నేళ్ల నుంచి క్ష‌త్రియులే ఇక్క‌డ ఎక్కువుగా ఎంపీలుగా గెలుస్తున్నారు). పైగా ఇక్క‌డ నుంచి గెలుస్తున్న ఎంపీ అభ్య‌ర్థులు కూడా ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఇక‌.. తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీల త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన నాయ‌కులు కూడా క్ష‌త్రియ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారే. దీంతో ఒక కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా నాగ‌బాబును గెలిపించుకోవ‌డం జ‌న‌సేన శ్రేణుల‌కు స‌వాలుగా మారింది. దీంతో ఇక్క‌డ డ‌బ్బుకు ప‌నిచెప్పార‌నే విష‌యం తాజాగా వెలుగు చూసింది. జనసేన అభ్యర్థుల ఖర్చు రూ. 50 కోట్లు దాటిందని అంచనా.
నాగ‌బాబును గెలిపించుకోవాల‌నే ల‌క్ష్యంతో భీమవరంలో పవన్‌ అభిమానులు రూ. 25 కోట్ల వరకు ఖర్చు చేశారు. పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెంలోనూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన జ‌న‌సేన అభ్య‌ర్థులు కోట్లు ఖ‌ర్చు చేశార‌ని అంటున్నారు.పాల‌కొల్లు నుంచి అసెంబ్లీ బ‌రిలోకి దిగిన గుణ్నం నాగ‌బాబు దాదాపు 10 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశార‌ని స‌మాచారం. అదేవిధంగా న‌ర‌సాపురం నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసిన బొమ్మిడి నాయ‌క‌ర్‌, తాడేప‌ల్లి గూడెం నుంచి బ‌రిలో నిలిచిన బోలిశెట్టి శ్రీనివాస్ కూడా బారీగానే ఖ‌ర్చు చేశార‌ని అంటున్నారు. మొత్తానికి ఎంత లేద‌న్నా 50 కోట్ల పైమాటే నాగ‌బాబు కోసం వీరంతా ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు ఏమేర‌కు విజ‌యం సాధిస్తారో చూడాలంటే.. మే 23 వ‌ర‌కు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు!
Tags: For Nagababu .. Good Khar …?

పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ

Date:21/03/2019
ఏలూరు ముచ్చట్లు:
మొదటిసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించిన పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక అయితే మేలేని నిర్ణయించింది. దీంతో ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వస్థలం మొగల్తూరు భీమవరం సమీపంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ భీమవరంలో కొన్ని రోజులు విద్యాభ్యాసం చేశారు. ఆయనకు ఇక్కడ చాలామంది సన్నిహితులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పట్టణం కావడం కూడా ఆయన భీమవరం ఎంపిక చేసుకోవడానికి కారణం. జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు కూడా భీమవరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సుమారు వారం రోజుల పాటు ఆయన ఇక్కడే బస చేశారు.దీంతో పవన్ భీమవరం వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా పక్కనే ఉన్న పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఇక, ఇక్కడ పవన్ స్వంత కాపు సామాజకవర్గం ఓట్లు సుమారు 60 వేల వరకు ఉన్నారని అంచనా ఉండటంతో పవన్ విజయం సులువవుతుందని పార్టీ భావిస్తోంది.
పవన్ కళ్యాణ్ పోటీ ద్వారా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు పోటీలో ఉన్నారు. ఆయన కాపు సామాజకవర్గానికి చెందిన నేత. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.వరుసగా రెండుసార్లు ఓడిపోయినందున గ్రంధి శ్రీనివాస్ పై ప్రజల్లో సానుభూతి ఉంది. టీడీపీలో ఉన్న విభేదాలు సైతం ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. గ్రంధి శ్రీనివాస్ కూడా కాపు సామాజకవర్గానికి చెందిన నాయకులే. దీంతో ముగ్గురూ ఒకే సామాజకవర్గం నేతల మధ్య పోటీ ఉంది. అయితే, వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కు వైసీపీ అధినేత జగన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారంట. వైసీపీ అధికారంలోకి వచ్చిన భీమవరం నుంచి గ్రంధీ శ్రీనివాస్ గెలిచి వస్తే ఆయనకు కీలక మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారంట. దీంతో గ్రంధి శ్రీనివాస్ రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. విజయం కోసం ఆయన బాగానే కష్టపడుతున్నారు. మరి, పవన్ కళ్యాణ్ ఓడించి ఆ కీలక మంత్రి పదవిని గ్రంధి శ్రీనివాస్ దక్కించుకుంటారో లేదో చూడాలి.
Tags:Pawan Kalyan is contesting in direct election

రెండు స్థానాల్లో పవన్ పోటీకి అవకాశం

Date:19/03/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపై స్పష్టత వచ్చింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధిలోని గాజువాక శాసనసభ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ జనసేన పార్టీ ప్రకటించింది. తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ తెలియజేసిన విషయం తెలిసిందే. తన పోటీపై జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని, ఎక్కడ నుంచి పోటీ చేసేది గంట తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. పవన్ ఎక్కడ నుంచి పోటీచేయాలనే అంశంపై జనరల్ బాడీ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇందులో అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం నియోజకవర్గాలు తొలి స్థానంలో నిలిచాయి. ఈ ఎనిమిదింటిపై అంతర్గత సర్వే నిర్వహించిన మేధావులు, రాజకీయ పరిశీలకులు చివరకు గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీచేయాలని పవన్‌కు సూచించారు. వారి ప్రతిపాదనలకు పవన్ సానుకూలంగా స్పందించారు. గాజువాక అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేస్తారనే తొలి నుంచీ ప్రచారం జరగ్గా, రెండో సీటు మాత్రం అనూహ్యంగా మంగళవారం తెరపైకి వచ్చింది.
ఇక, ఎన్నికల్లో పోటీ విషయంలో అన్నయ్య చిరంజీవి మార్గాన్నే పవన్ అనుసరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి చిరు పోటీ చేశారు. అయితే, తిరుపతిలో మాత్రమే విజయం సాధించిన చిరంజీవి, తన సొంత జిల్లాలోని పాలుకొల్లు మాత్రం ఓటమిపాలయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్టణం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు జనసేన నుంచి అధికార ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో జనసేనానిపై పోటీ చేయబోతున్న ఇతర పార్టీల నేతలు ఎవరో ఓ సారి చూద్దాం.
గాజువాక నియోజకవర్గం:
టీడీపీ – పల్లా శ్రీనివాసరావు
వైసీపీ – టి.నాగిరెడ్డి
బీజేపీ – పులుసు జనార్దన్
భీమవరం నియోజకవర్గం:
టీడీపీ – పులవర్తి రామాంజనేయులు
వైసీపీ – గ్రంధి శ్రీనివాస్
బీజేపీ – ప్రకటించాల్సి ఉంది.
Tags:Pawan is likely to be in the two places

పుంగనూరు రోడ్‌షోలో పవన్‌ అబివాదం

– వేలాది మంది అభిమానులతో స్తంభించిన ట్రాఫిక్‌

Date:02/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

జనసేన పార్టీ అధినేత , సీనినటుడు పవన్‌కళ్యాణ్‌ తొలిసారిగా పుంగనూరులో శనివారం సాయంత్రం ఎంబిటి రోడ్డులో రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోను స్థానిక కన్వీనర్‌ , సీనియర్‌ న్యాయవాది శివప్ప నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రోడ్‌షో మదనపల్లె రోడ్డులోని అమరనాథరెడ్డి పెట్రోల్‌ బంకు వద్ద నుంచి కొత్తయిండ్లు, ట్రావెలర్స్బంగ్లా, అంబేద్కర్‌ సర్కిల్‌, గోకుల్‌సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌, తూర్పువెహోగశాల మీదుగా సాగింది. వేలాది మంది అభిమానుల కేరింతల మధ్య పవన్‌కళ్యాణ్‌ కారులో నుంచి పైకి వచ్చి, ప్రజలకు అభివాదం చేస్తూ కరచాలనం చేశారు. ఈ సందర్భంగా అబిమానులు ఆయనకు పూలవర్షం కురిపించారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్‌…పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ జిందాబాద్‌ అంటు నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. అభిమానులు జనసేన జెండాలు పట్టుకుని మోటారుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పవన్‌ కొత్తయిండ్ల నుంచి ప్రజలకు అబివాదం చేస్తూ రోడ్‌షో నిర్వహించారు. ఎంబిటి రోడ్డు జాతీయ రహదారిపై అభిమానులు, మహిళలు, భవనాలపైకి ఎక్కి గంటల తరబడి పవన్‌కళ్యాణ్‌ కోసం వేచి చూశారు. పవన్‌ను చూడగానే ఒక్కసారిగా అభిమానుల అరుపులతో ప్రసంగం ప్రజలకు అర్థంకాకుండ పోయింది. రెండు నిమిషాల పాటు పవన్‌ ప్రసంగం ముగిసింది. ఈ సందర్భంగా సుమారు గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శివప్పనాయుడు, సురేష్‌కుమార్‌, పగడాల రమణ, శివకుమార్‌రెడ్డి, విరూపాక్షి, కళ్యాణ్‌రాయల్‌, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

 

పెద్దపంజాణి మండలంలో మంత్రి అమర్ సుడిగాలి పర్యటన

Tags: Pawan’s abiad in Punganaru roadshow

సరికొత్త వ్యూహాలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్

 Date:21/02/2019
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఎన్నికలు దగ్గరపడుతున్నందున జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. అందుకోసం గతంలోనే ఇతర పార్టీలకు చెందిన, వివాదరహితులుగా ఉన్న నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పాటు జనసేన సభ్యత్వం కూడా అంతకంతకూ పెంచేలా చర్చలు చేపడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా జనసైనికులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య బహిరంగ సభలు, సమావేశాలు, యాత్రలను తగ్గించిన పవన్.. పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే దృష్టి సారించారు. ఒకవైపు రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికలకు ప్లాన్లు రెడీ చేసుకుంటుండడంతో జనసేనాని కూడా వేగంగా సమాయత్తం అవ్వాలని చూస్తున్నారు. అందుకోసం ఎన్నికల్లో ముఖ్యమైన ప్రక్రియ అభ్యర్థుల ఎంపికపై బాగా ఫోకస్ చేశారు. అధికారాన్ని చేపట్టే అవకాశం లేకున్నా.. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి కావాలని ఆయన అనుకుంటున్నారు. అందుకోసం గెలుపు గుర్రాల ఎంపిక ప్రక్రియను ఇటీవల ప్రారంభించారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలో గతంలో ఏ పార్టీ అమలు చేయని కొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో పారదర్శకత కోసం సరికొత్త పంథాలో జనసేన పార్టీ ముందుకు సాగుతోంది. టికెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ అందరికి స్వేచ్ఛను ఇచ్చారు పవన్ కల్యాణ్. అందుకోసం పార్టీలో సీనియర్లుగా ఉన్న మాదాసు గంగాధరం, శ్రీ అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్ వంటి నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విజయవాడ కార్యాలయంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఇదే కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి రోజూ దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. మంగళవారం నాటికి కమిటీకి 150 మందికి పైగా ఆశావాహులు దరఖాస్తులు అందజేశారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఉన్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వేణు కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరంకు తన బయోడేటాను అందజేశారు. తన వివరాలను ఆ బయోడేటాలో పొందుపరిచారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం వెల్లడించింది. ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అయితే, ఆయన ఎక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారన్న విషయం మాత్రం తెలియలేదు.గతంలో పవన్ విశాఖలో పర్యటిస్తున్న సమయంలో వేణుగోపాలరావు జనసేన కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ముంబై, రాజస్థాన్ జట్ల తరపున ఆడాడు. అలాగే భారత క్రికెట్ జట్టు తరపున వేణుగోపాలరావు 2005లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. మొత్తం 16 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన వేణుగోపాలరావు 24.22 సగటుతో 218 పరుగులు చేశారు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది.
Tags:Pawan Kalyan, the leader of the Janasana with new strategies

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Date:09/01/2019
విజయవాడ ముచ్చట్లు:
పొత్తులపై ఉన్న అనుమానాలన్నింటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ తో కలిస్తే జగన్ కి నొప్పేంటి’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వామపక్షాలు తప్ప రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. వివిధ జిల్లాల నేతలతో ఆయన వరసగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లోనూ ఈ మేరకు ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. జనసేన అవసరం టీడీపీకి లేదా వైసీపీకి ఉందేమో కానీ వారి అవసరం జనసేనకు లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు ఖాయంగానే కనిపిస్తున్నా… సీపీఐ, సీపీఎంని కూడా కలుపుకుని వెళ్లనున్నారు.పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు.
తర్వాత ఆయన ఈ రెండు పార్టీలకు దూరమయ్యాక కమ్యూనిస్టులు పవన్ పై కన్నేశారు. వివిధ సందర్భాల్లో జనసేన పార్టీతో కలిసి కవాతులు, ఇతర ఆందోళన కార్యక్రమాల్లో కమ్యూనిస్టులు చురుగ్గా పాల్గొన్నారు. అయితే, కమ్యూనిస్టులతో పవన్ పొత్తు ఖాయమని తెలిపోయింది. మరి, కమ్యూనిస్టులతో పొత్తు పవన్ కి ఏమేరకు లభిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ కమ్యూనిస్టులు గెలిచే సీట్లు తెలంగాణ ప్రాంతంలోనివే ఉండేవి. ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా అంతోఇంతో సీపీఐ, సీపీఎంకి బలం ఉన్నదంటే కేవలం తెలంగాణలోనే. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నడూ లేని విధంగా ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక ప్రాభావాన్ని పూర్తిగా కోల్పోయింది.కొంతైనా పట్టున్న తెలంగాణలోనే కమ్యూనిస్టుల పరిస్థితి ఇలా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీలు మరింత బలహీనంగా ఉన్నాయి.
అయితే, అన్ని జిల్లాలో కమ్యూనిస్టులకు క్యాడర్, కార్యవర్గాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే జనసేన పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నా కార్యవర్గాలు మాత్రం లేవు. ఇక, ఏపీలో పూర్తిగా బలం కోల్పోయిన కమ్యూనిస్టులతో పొత్తు పవన్ కళ్యాణ్ కి కలిసివస్తుందని చెప్పలేం. ఉద్యమాల్లో ముందుండే కమ్యూనిస్టులు ఓట్లను సాధించలేరు. పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా ఎన్నో కొన్ని స్థానాలను ఆ రెండు పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్థానాల్లో వారు గెలిచే అవకాశాలు తక్కువే.ఇక, ఈ స్థానాలు పోయినా మిగతా స్థానాల్లో మాత్రం జనసేనకు కమ్యూనిస్టు క్యాడర్ మద్దతు ఇస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉండవచ్చు కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం అయితే ఉండదు.
ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని కూటమి అనే పేరు తెచ్చుకోవడం కంటే ఒంటరి పోరు చేసి మొదటి ఎన్నికల్లోనే ఒంటరిగా బరిలో ఉన్నామనే గుర్తింపైనా వస్తుంది కదా అని కొందరు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో జనసేనకు క్యాడర్ నిర్మాణం పూర్తి కానందున ఎన్నికలకు సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి కమ్యూనిస్టులతో పొత్తే మేలనే వాదన కూడా ఉంది. మొత్తానికి ఎర్ర కండువా పవన్ కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
Tags:Pawan Kalyan, the leader of the Jana Sangh, gave a clarity on alliances