విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Date:19/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని 24వ వార్డులో గల పాఠశాలలో ఫ్రెండ్స్  మొబైల్ షాపు యజమాని అంజాద్‌బాషా ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు , పెన్నులు, ప్యాడ్స్, వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్‌ అమ్ము హాజరైయ్యారు. ఈ సందర్భంగా షాపు యజమాని జావీద్‌ మాట్లాడుతూ పాఠశాలలోని ఒకొక్క విద్యార్థికి రూ.500లు విలువ చేసే విద్యాసామాగ్రీకిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతియేటా విద్యార్థులకు తమ వంతు సహాయం అందిస్తున్నామన్నారు. ఇందులో బాగంగా ఈ సారి కూడ విద్యార్థులకు అవసరమైన విద్యాసామాగ్రీని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో భారతి, సూపర్‌ వైజర్‌ ఐయిషా, మొబైల్ షాపు యజమానులు సాధిక్‌బాషా, జబివుల్లా , సంకల్ప సోసైటి ప్రతినిధులు జానకి, రాజు, వెంకటేష్‌, బాను, సురేష్‌, పురుషోత్తం, సుజాత, గంగులాచారి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్లపై చెత్తను పడవేస్తే జరిమానాలు విధిస్తాo

Tags: Distributing books to students

విద్యార్థులకు విద్యాసామాగ్రీ పంపిణీ

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం మద్దనపల్లె గ్రామ ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఫ్రెండ్స్చారిటి ఆసోసియేషన్‌ సభ్యులు విద్యాసామాగ్రీని అందజేశారు. హెచ్‌ఎం షఫి ఆధ్వర్యంలో 1 నుంచి 8 వతరగ తి వరకు చదువుతున్న విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు , ఇతర సామాగ్రీని అందజేశారు. ఈ సందర్బంగా సంఘ సభ్యులు రమేష్‌బాబు, శైలేష్‌, గణేష్‌, శ్రీకంఠేశ్వర మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతి యేటా తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యాసామాగ్రీని అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ , ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు క్రిష్ణ, అశ్వర్థనారాయణజెట్టి, రవికుమార్‌, సర్ధార్‌, కిరణ్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.

కమిషనర్‌గా కెఎల్‌.వర్మ పదవి స్వీకారం

Tags; Distributing educational materials to students