ఫిజియోథెరపి కేంద్రం ప్రారంభం

Date:20/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో ఫిజియోథెరపి కేంద్రం ఎంతో అవసరమని లయన్స్క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ అన్నారు. సోమవారం పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌కు ఎదురుగా దేవి ఫిజియోథెరపి కేంద్రాన్ని డాక్టర్‌ దేవి ఏర్పాటు చేయగా డాక్టర్‌ శివ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరి శరీరానికి అనేక సమస్యలు ఎదురౌతుందన్నారు. కొన్ని జబ్బులకు ఫిజియో థెరపి ఎంతో అవసరమన్నారు. పట్టణంలో ఆధునాతన పరికరాలతో ఫిజియోథెరపి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి సారించి, ఎప్పటికప్పుడు శరీరానికి ఎదురైయ్యే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, నడుము నొప్పులు, వెన్నునొప్పి, మెడనొప్పిని నిర్లక్ష్యం చేయకుండ ఫిజియెథెరపి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి, సుత్రమా కంటివైద్యులు శంకర్‌, గిరిజన సంఘ కార్యదర్శి నాగేనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పగలే ఫాగింగ్‌

Tags: Physiotherapy Center Started