పతుల కోసం సతుల ప్రచారం

Date: 25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తలు రాజకీయంలో గెలుపు కోసం ఈ సారి ఎన్నికల్లో భార్యలు ప్రచారం చేసిన అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపి తరపున మూడవసారి పోటీ చేసి, హ్యాట్రిక్‌ సాధించారు. ఈయన గెలుపు కోసం ఆయన సతీమణి స్వర్ణలత పుంగనూరులో ప్రతి రోజు ఇంటింటా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డిని రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిధున్‌రెడ్డిని గెలిపించాలని స్వర్ణమ్మ ప్రచారం చేపట్టారు. అలాగే వైఎస్సార్సీపి ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కలిగించే రీతిలో వివరించారు. నవరత్నాలపై మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఈమె వెంట వైఎస్సార్సీపి నాయకురాలు కొండూరు పద్మావతమ్మ, మహిళ నాయకురాలు సరస్వతి, తులసెమ్మ, సుబ్బమ్మ, కౌన్సిలర్‌ లలితతో పాటు పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకులు బిలాల్‌, రాజేష్‌, హేము, కుమార్‌, సురేష్‌, జెపి యాదవ్‌లు పర్యటించారు.

తండ్రి కోసం తనయ ప్రచారం ….

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన కుమారై శ్రీశక్తి తొలి సారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని , ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తండ్రితో పాటు తన సోదరుడు రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. కాగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి తన కుమారై శ్రీశక్తిని వెంట పెట్టుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రచార కార్యక్రమాలలో ముస్లిం మహిళలు రహత్‌జాన్‌, సల్మాసుల్తాన, రాఫియా, యాస్మిన్‌, ముబినా, దిల్‌షాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

సాదారణ వ్యక్తి ఎంపిగా ఎన్నిక

Tags: Propagation campaign for the sake of duty