12న పీఈటీల సమావేశం

Date:11/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జోన్‌ పీఈటీల సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు బసవరాజ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు డీవైఈవో సయ్యద్‌ముష్ఠాక్‌ అహమ్మద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుంగనూరు జోన్‌ పరిధిలో పుంగనూరు, పెద్దపంజాణి, చౌడేపల్లె , సోమల మండలాల పీఈటీలు కెసి.పల్లె, అరికెల పాఠశాలల్లోని పీఈటీలు సమావేశానికి తప్పక హాజరుకావాలెనని తెలిపారు. క్రీడల నిర్వహణకు సంబంధించి నివేదికలు తయారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సైన్సు సెమినార్‌ పోటీలు

Tags: Meeting of PETs on the 12th

మధ్యంషాపుల అద్దె భవనాలకు టెండర్లు ఆహ్వానం

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం నిర్వహించే మధ్యంషాపులకు అద్దె భవనాలను సేకరించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు పుంగనూరు, రామసముద్రం, పెద్దపంజాణి , చౌడేపల్లె, సోమల, సదుం మండలాల్లో గల మధ్యం దుకాణాలను బాడుగులకు తీసుకునేందుకు టెండర్లను కోరుతున్నట్లు తెలిపారు. భవన యజమానులు ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోపు టెండర్లను పుంగనూరు ఎక్సెజ్‌ కార్యాలయం బాక్సులో వేయాలన్నారు. వివరాలకు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు షాపుల సంఖ్య, వివరాలను నిర్ణయించడం జరుగుతుందన్నారు.

ప్రతి నీటిబొట్టును వృధా చేయరాదు

Tags: Invitation of tenders to mid-sized rental buildings